Poonam Pandey: పూనం పాండే..కాంట్రవర్సీలకి కేరాఫ్.. పబ్లిసిటీ కోసం కొత్త కొత్త స్టంట్లు చేయడం ఈ బాలీవుడ్ బ్యూటీకి బాగాఅలవాటు.సినీ కెరీర్ కంటే కూడా వివాదాలతోనే ఈ భామ ఎక్కువ ప్రచారం పొందింది మరి . మొదట్లో ముంబైలో మోడల్‌గా కెరీర్ ప్రారంభించిన పూనం, ఆ తర్వాత టీవిలోకి ఎంట్రీ ఇచ్చింది.
ప్రముఖ హిందీ సీరియల్ ‘సీఐడీ’లో చిన్న పాత్రతో బుల్లితెరపై మెరిసిన ఈ భామ, 2011లో ‘ఫియర్ ఫ్యాక్టర్: ఖాత్రోన్ కీ కిలాడీ 4’ రియాలిటీ షోతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత ‘సూపర్ కాప్స్ వర్సెస్ సూపర్ విలన్స్’ వంటి డ్రామా సీరియల్స్‌లో నటించి మెప్పించింది కూడా.
‘నషా’ చిత్రంతో బాలీవుడ్‌లోకి
ఇక ఈ పాపులారిటీతోనే 2013 జూలై 26న విడుదలైన ‘నషా’ చిత్రంతో బాలీవుడ్‌లోకి కథానాయికగా అడుగుపెట్టింది. ఆ తర్వాత ‘జీఎస్టీ: గ్యాంగ్స్ ఆఫ్ సోషల్ మీడియా’, 2018 అక్టోబర్ 26న వచ్చిన ‘ది జర్నీ ఆఫ్ కర్మ’, ‘లవ్ ఇన్ ఏ ట్యాక్సీ’, ‘టచ్ ది ఫైర్’ వంటి హిందీ సినిమాల్లో నటించింది తన సత్తా చాటింది.
ఆ క్రమంలోనే 2015 జూలై 24న విడుదలైన ‘మాలిని అండ్ కో’ చిత్రంతో టాలీవుడ్ ప్రేక్షకులను కూడా పలకరించింది కూడా. అయితే ఆమె నటించిన ఏ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించలేకపోయింది.
విచిత్రమైన పబ్లిసిటీ స్టంట్లకు తెర
మొత్తానికి సినిమాలు పెద్దగా కలసి రాకపోవడంతో పూనం పాండే విచిత్రమైన పబ్లిసిటీ స్టంట్లకు తెరతీసింది. 2011 ఐసీసీ వన్డే వరల్డ్ కప్ సమయంలో టీమిండియా ట్రోఫీ గెలిస్తే వేదికపై అందరి ముందూ న్యూడ్ గా మారిపోతానని చేసిన ప్రకటన అప్పట్లో తీవ్ర దుమారం రేపింది. ఆ తర్వాత సెప్టెంబర్ 2020లో తన లాంగ్ టైమ్ బాయ్‌ఫ్రెండ్ సామ్ బాంబేను పెళ్లి చేసుకున్న పూనం, వివాహమైన కొద్ది రోజులకే ఆయనపై గృహహింస ఆరోపణలు చేసి పోలీసులకు ఫిర్యాదు చేయడం అప్పట్లో హాట్ టాపిక్ .
ఆపై 2022లో ప్రసారమైన ‘లాక్ అప్’ రియాలిటీ షోలో పాల్గొని తన బోల్డ్ కామెంట్స్‌తో రోజూ వార్తల్లో నిలిచింది.అయితే పూనం పాండే చేసిన పబ్లిసిటీ స్టంట్లలో పెద్ద షాక్ ఇచ్చిన స్టంట్ 2024 ఫిబ్రవరి 1న జరిగింది. ఆమె సర్వైకల్ క్యాన్సర్‌తో కన్నుమూసిందంటూ ఆమె అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఒక పోస్ట్ వదలడమే.
కానీ, కట్ చేస్తే మరుసటి రోజే (ఫిబ్రవరి 2న) తాను బతికే ఉన్నానని, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌పై అవగాహన కల్పించడానికే ఈ నాటకం ఆడనని వీడియో విడుదల చేసింది. చావుతో కూడా పబ్లిసిటీ స్టంట్లు చేస్తుందా అంటూ ఆ సమయంలో నెటిజన్లు ఫైర్ అయ్యారు కూడా .
శృంగార వీడియోలు సమాజానికి, దేశానికి సేవ
ఇదిలా ఉంటె తాజాగా మరోసారి విపరీతమైన వ్యాఖ్యలు చేసి నెటిజన్ల కోపానికి కారణం అయింది. ఒక పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. భారతదేశంలో వ్యభిచారాన్ని తక్షణమే చట్టబద్ధం చేయాలని, అలా చేస్తేనే మహిళలపై జరిగే లైంగిక నేరాలు, అఘాయిత్యాలు తగ్గుతాయని చెప్పుకొచ్చింది. అంతటితో ఆగకుండా, తన శృంగార వీడియోలు సమాజానికి, దేశానికి సేవ చేస్తున్నాయని, అవి పురుషుల మానసిక ఒత్తిడిని తగ్గించి రిలాక్స్ అవ్వడానికి ఉపయోగపడుతున్నాయని చేసిన కామెంట్స్ నెట్టింట మంటలు పుట్టిస్తున్నాయి.
also read :ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!
ఈ మాటలు విన్న నెటిజన్లు సమాజానికి ఏం సందేశం ఇస్తున్నావంటూ ఆమెపై మండిపడుతున్నారు. మొత్తానికి ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలవడమే పనిగా పెట్టుకుందన్న మాట !