E-Paper
Advertisement

V.V.Vinayak: మెగా హీరో పై వి.వి వినాయక్ కామెంట్స్.. హిట్ డైరెక్టర్ల వెంట పరిగెత్తే రకం కాదు!

V.V.Vinayak: మెగా హీరో పై వి.వి వినాయక్ కామెంట్స్.. హిట్ డైరెక్టర్ల వెంట పరిగెత్తే రకం కాదు!
Advertisement

V.V.Vinayak: టాలీవుడ్ ఇండస్ట్రీలో దర్శకుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో సీనియర్ డైరెక్టర్  వి.వి వినాయక్(V.V.Vinayak) ఒకరు. ఈయన డైరెక్షన్ లో టాలీవుడ్ ఇండస్ట్రీలోని స్టార్ హీరోలు అందరూ కూడా సినిమాలు చేసి అద్భుతమైన విజయాలను సొంతం చేసుకున్నారు. అయితే ఇటీవల కాలంలో వి.వి వినాయక్ పూర్తిగా సినిమాలకు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. ఇలా ఇండస్ట్రీకి దూరమైన ఈయన తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఈయన నటుడు రామ్ చరణ్ (Ramcharan)గురించి చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

చరణ్ మాట ఇస్తే తప్పడు..

రామ్ చరణ్ ప్రముఖ నటుడు చిరంజీవి వారసుడిగా ఇండస్ట్రీలోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఒక స్టార్ హీరో కుమారుడు అయినప్పటికీ రామ్ చరణ్ డౌన్ టు ఎర్త్ అంటూ వినాయక్ తెలిపారు. ఆయన చూడటానికి చాలా రాయల్ గా, క్లాస్ గా ఉండే వ్యక్తి. కానీ డౌట్ ఎర్త్ అని తెలిపారు. ఇతర హీరోలు మాదిరిగా రామ్ చరణ్ హిట్ డైరెక్టర్ల వెంట పరిగెత్తే రకం కాదని, ఒకసారి డైరెక్టర్ తో సినిమా చేస్తానని వాళ్లకు మాట ఇచ్చిన తర్వాత వాళ్ళు హిట్ సినిమాలతో ఉన్నా లేదా ఫ్లాప్ సినిమాలతో ఉన్న వారితో కచ్చితంగా సినిమా చేస్తారని వి.వి వినాయక్ తెలిపారు. ఇచ్చిన మాట విషయంలో వెనక్కి తగ్గకుండా మాట నిలబెట్టుకొనే వ్యక్తిత్వం రామ్ చరణ్ ది అంటూ వి.వి వినాయక్ చరణ్ పై ప్రశంసల కురిపిస్తూ చేసిన ఈ కామెంట్స్ పట్ల మెగా ఫాన్స్ ఫిదా అవుతున్నారు.

వినాయక్ దర్శకత్వంలో నాయక్ సినిమా..

Advertisement

వినాయక్ దర్శకత్వంలో రాంచరణ్ నాయక్ అనే సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. అలాగే చరణ్ నిర్మాణంలో చిరంజీవి హీరోగా నటించిన ఖైదీ నెంబర్ 150 సినిమాకు కూడా దర్శకత్వం వహించారు.రామ్ చరణ్ ఎంతో ఉన్నత స్థాయిలో ఉన్నప్పటికీ చాలా వినయంగా గౌరవంతో ఉంటారనే సంగతి తెలిసిందే. ఇలా ఇప్పటికే ఎంతోమంది రామ్ చరణ్ పై పెద్ద ఎత్తున ప్రశంసలు కురిపించారు. తాజాగా   వి.వి వినాయక్ సైతం చరణ్ గురించి గొప్పగా చెప్పటం విశేషం. ఇక రాంచరణ్ ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ హీరోగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. బుచ్చిబాబు సాన దర్శకత్వంలో పెద్ది సినిమా పనులలో ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఈ సినిమా గ్రామీణ క్రీడా నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

పెద్దికి వాయిదా తప్పదా?

Advertisement

ఈ సినిమాను రాంచరణ్ పుట్టిన రోజు సందర్భంగా మార్చి 27వ తేదీ విడుదల చేయాలనే ఆలోచనలో చిత్ర నిర్మాతలు ఉన్నారు అయితే షూటింగ్ పూర్తికాని నేపథ్యంలో ఈ సినిమాని తిరిగి ఏప్రిల్ 30వ తేదీ విడుదల చేయబోతున్నట్లు తెలిపారు. అయితే ఈ సినిమా ఏప్రిల్ 30 వ తేదీ నుంచి కూడా వాయిదా పడబోతోంది అంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి కానీ ఇప్పటివరకు చిత్ర బృందం మాత్రం ఈ వార్తలపై ఎక్కడ స్పందించలేదు. మరి అనుకున్న విధంగానే ఈ సినిమా ఏప్రిల్ 30వ తేదీ విడుదల కాబోతోందా? లేదంటే మరోసారి వాయిదా పడుతుందా అనేది తెలియాల్సి ఉంది.

Also Read: Anchor Ravi: పెట్రోల్ సమస్యపై యాంకర్ రవి ఆగ్రహం.. ప్రభుత్వం చెప్పలేదంటూ..

Related News

కన్నీటి పర్యంతమవుతున్న మహారాజా హీరోయిన్.. అసలేం జరిగిందంటే?

డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ వివాదం..ఫిలిం ఫెడరేషన్ అత్యవసర సమావేశం!

ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు చిత్రం ఏంటో తెలుసా?

నేషనల్ అవార్డ్స్ రేసులో ధనుష్ రికార్డ్… ‘కలాం’ బయోపిక్‌పై హైప్!

ఆ హీరోతో అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్?

Sharmiela mandre :చడీ చప్పుడు లేకుండా పెళ్లి చేసుకున్న అల్లరి నరేష్ హీరోయిన్.. వరుడు ఎవరంటే?

38ఏళ్ల తర్వాత తండ్రి నాగబాబు రికార్డును రిపీట్ చేసిన నిహారిక!

సైలెంట్ గా నిశ్చితార్థం.. పెళ్లికి సిద్ధమైన టాలీవుడ్ హీరో!

Big Stories

Advertisement
×