E-Paper
Advertisement

Disha Patani: అతడితో డేటింగ్ లో దిశాపటానీ.. ఎవరో తెలిస్తే షాక్!

Disha Patani: అతడితో డేటింగ్ లో దిశాపటానీ.. ఎవరో తెలిస్తే షాక్!
Advertisement

Disha Patani:ప్రముఖ బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీ (Disha Patani) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. తన అందంతో, అభినయంతో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న ఈ చిన్నది.. బాలీవుడ్ లోనే సినిమాలు చేస్తూ భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది. బాలీవుడ్ లోనే కాకుండా తెలుగులో కూడా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న ఈమె.. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ అందాలు ఆరబోస్తూ.. యువతను విపరీతంగా ఆకట్టుకుంటుంది. అలాంటి ఈ ముద్దుగుమ్మ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి

డేటింగ్ లో దిశా పటానీ..

అసలు విషయంలోకి వెళ్తే.. బాలీవుడ్ హీరోయిన్గా భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న ఈమె డేటింగ్ లో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు తన ప్రియుడితో కలిసి దర్శనమివ్వడంతో డేటింగ్ రూమర్స్ నిజమేనంటూ నెటిజన్స్ కూడా కామెంట్లు చేస్తున్నారు.. బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన దిశా పటానీ ఇప్పుడు పంజాబీ సింగర్ తల్విందర్ (Talwinder)తో డేటింగ్ లో ఉన్నట్లు వార్తలు రాగా.. అవి నిజమయ్యాయి. చికాగోలో ఒక స్పెషల్ ఈవెంట్ జరిగింది. అక్కడ సింగర్ తల్విందర్ తన ప్రదర్శన ఇచ్చారు. అయితే ఈవెంట్ తర్వాత దిశా పటానీ చేయి పట్టుకొని ఆయన బయటకు వచ్చారు. అనంతరం ఒకే కారులో ఈ జంట వెళ్లిపోయింది.

దిశాపటానీ స్పందిస్తుందా?

Advertisement

ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో సింగర్ తల్విందర్ తో దిశా పటానీ డేటింగ్ లో ఉంది అంటూ నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. అయితే ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. మరి దీనిపై దిశాపటానీ స్పందించి చెక్ పెడుతుందేమో చూడాలి.

ALSO READ:Patriot Movie: మల్టీస్టారర్ పేట్రియాట్ రిలీజ్ డేట్ ఫిక్స్.. రికార్డులు బద్దలవ్వాల్సిందేనా?

దిశా పటానీ నటించిన తెలుగు చిత్రం..

Advertisement

ప్రముఖ డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ గా పేరు దక్కించుకున్న పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా వచ్చిన ‘లోఫర్’ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది. ఈ సినిమాతో మంచి పేరు దక్కించుకున్న ఈమె.. ఆ తర్వాత హిందీలో ఎంఎస్ ధోని: ది అన్ టోల్డ్ స్టోరీ అనే సినిమాలో నటించి భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది. ఇకపోతే వరుసగా హిందీలోనే సినిమాలు చేస్తున్న దిశా పటానీ మ్యూజిక్ వీడియోలలో కూడా కనిపించి మరింత ఇమేజ్ సొంతం చేసుకుంది.

దిశా పటానీ అందుకున్న అవార్డులు..

తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను మెప్పించిన ఈమె.. పలు అవార్డులు కూడా అందుకుంది. అలా ఎమ్ ఎస్ ధోని ది అన్ టోల్డ్ స్టోరీ సినిమాకి గానూ.. బిగ్ స్టార్ ఎంటర్టైన్మెంట్ అవార్డులతో పాటు స్టార్ స్క్రీన్ అవార్డులు, స్టార్ డస్ట్ అవార్డులు అందుకుంది. అంతేకాదు ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిలిం అకాడమీ అవార్డును కూడా దక్కించుకుంది.. ఇక 2018లో వచ్చిన భాగీ 2 సినిమాకి గానూ లక్స్ గోల్డెన్ రోజ్ అవార్డును అందుకుంది. ఇక ప్రస్తుతం డేటింగ్ రూమర్స్ ఎదుర్కొంటున్న ఈమె దీనిపై ఎలాంటి క్లారిటీ ఇస్తుందో చూడాలి.

Related News

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

Big Stories

Advertisement
×