E-Paper
Advertisement

US Snow Storm: అమెరికాను వణికిస్తున్న మంచు తుఫాన్‌.. 25 మంది మృతి, అంధకారంలో పలు నగరాలు

US Snow Storm: అమెరికాను వణికిస్తున్న మంచు తుఫాన్‌.. 25 మంది మృతి, అంధకారంలో పలు నగరాలు
Advertisement

US Snow Storm: అమెరికాకు సరికొత్త కష్టాలు మొదలయ్యాయి. మంచు తుఫాన్‌ అక్కడి ప్రజలను వణికిస్తున్నాయి. భీకర మంచు తుపాను ధాటికి కనీసం 25 మంది మరణించినట్లు అంతర్జాతీయ న్యూస్ ఏజెన్సీలు చెబుతున్నాయి. విద్యుత్ లేకపోవడంతో చాలా నగరాలు అంధకారంలో ఉన్నాయి.  కొద్దిరోజులు ఇదే పరిస్థితి నెలకొనవచ్చని అక్కడి వాతావరణ శాఖ అంచనా.

అమెరికాను వణికిస్తున్న మంచు తుఫాన్‌

Advertisement

మనం ఒకటి తలస్తే.. దైవం మరొకటి తలుస్తుంది. ప్రస్తుతం అమెరికా పరిస్థితి అదే విధంగా ఉంది. ప్రపంచ దేశాలను సుంకాలు, యుద్ధాల పేరిట అధ్యక్షుడు ట్రంప్ భయపెడుతున్నాడు. కానీ అమెరికాను ప్రకృతి భయపెడుతోంది. అమెరికాలో మంచు తుఫాను బీభత్సం సృష్టిస్తోంది. దీనికారణంగా జనజీవనం అతలాకుతలమైంది. మంచు తుఫాను కారణంగా ఇప్పటివరకు 25 మంది మృత్యువాత పడినట్టు తెలుస్తోంది.

ఈ సంఖ్య మరింత పెరగవచ్చని అక్కడి ఛానెళ్లు చెబుతున్నాయి. తూర్పు-దక్షిణాది రాష్ట్రాల్లో కొన్నిరోజులుగా మంచు తుపాను వల్ల జనజీవనం అతలాకుతలమైంది. రోడ్లపై మంచు పేరుకు పోవడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. చాలా ప్రాంతాల్లో చెట్లు విరిగిపడడంతో విద్యుత్తు సరఫరాకు అంతరాయం ఏర్పడింది.

Advertisement

25 మంది మృతి, అంధకారంలో పలు నగరాలు

ఆయా ప్రాంతాల్లో పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. టెక్సాస్ నుండి మసాచుసెట్స్ వరకు కనీసం 26 రాష్ట్రాలను మంచు తుఫాను ప్రభావితం చేసింది. ఆర్కానస్‌ నుంచి న్యూ ఇంగ్లాండ్‌ వరకు అంటే దాదాపు 1300 మైళ్ల విస్తీర్ణంలో అడుగు లోతు మేరా మంచు పేరుకుపోయింది. దీంతో వాహనాలను నడిచే అవకాశం లేకుండా పోయింది.

మంచు, చలి కారణంగా ప్రయాణాల రాకపోకలకు ఆటంకాలు ఏర్పడ్డాయి. వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. అలాగే పలు విమానాలు రద్దయ్యాయి. పాఠశాలలు మూసివేశారు. పిట్స్‌బర్గ్‌కు ఉత్తరాన 20 అంగుళాల వరకు మంచు నమోదైంది. సోమవారం నుండి మంగళవారం వరకు మైనస్ 25 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు పడిపోతుందని అక్కడి వాతావరణ శాఖ తెలిపింది.

ఇక న్యూయార్క్ సిటీలో మంచు తుఫాను ధాటికి ఎనిమిది మంది మరణించినట్టు తెలుస్తోంది. మసాచుసెట్స్, ఒహియోలో మంచు తొలగించే క్రమంలో వాహనాల కింద పడి ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. మంచు తుపాను నేపథ్యంలో లక్షలాది ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. మిసిసిపి, టేనస్సీ రాష్ట్రాల్లో చెట్ల కొమ్మలు విద్యుత్ తీగలపై విరిగిపడ్డాయి.

ALSO READ: సాకర్ మైదానంలో దారుణం.. 11 మంది మృతి, ఆ ముఠా పనే?

దీంతో ఆయా ప్రాంతాల్లో పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. దాదాపు మూడు దశాబ్దాల తర్వాత అంటే 1994 తర్వాత మిసిసిపిలో సంభవించిన అత్యంత భయంకరమైన మంచు తుపానుగా అక్కడ మీడియా వర్గాలు వెల్లడించాయి. మంచు తుఫాను తీవ్రంగా ఉన్న ప్రాంతాల్లో అధికారులు మంచాలు, దుప్పట్లు, బాటిల్ వాటర్, జనరేటర్లను సరఫరా చేస్తున్నారు.

భీకర తుపాను కారణంగా నేపథ్యంలో పలు రాష్ట్రాల్లో విమాన సర్వీసులకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఆదివారం ఒక్క రోజు దాదాపు 45 శాతం విమానాలు రద్దయ్యాయి. కోవిడ్ తర్వాత ఈ స్థాయిలో విమానాలు రద్దు కావడం ఇదే తొలిసారి. సోమవారం కూడా సుమారు 8,000 విమానాలు రద్దు అయ్యాయని అధికారులు చెబుతున్నారు.

విద్యుత్ లేకపోవడంతో మిస్సిస్సిప్పి విశ్వవిద్యాలయంలో విద్యార్థులు ఉండిపోయారు. దీని ఫలితంగా వారం రోజులపాటు తరగతులు రద్దు చేసింది వర్సిటీ యాజమాన్యం. ఇక ఆక్స్‌ఫర్డ్ క్యాంపస్ ఇప్పటికీ మంచుతో కప్పబడి ఉంది. దీనివల్ల పరిస్థితులు ప్రమాదకరంగా మారాయి. మంచు తుఫాను వల్ల చాలా నష్టం జరిగిందని ఆక్స్‌ఫర్డ్ మేయర్ తెలిపారు.

 

Related News

విఫలమైన సామూహిక సున్తీలు.. 43 మంది బాలురు మృతి, దక్షిణాఫ్రికాలో ఘటన

ట్రంప్‌‌కు ఊహించని షాక్‌.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ వ్యవహారం.. కొత్త ఆదేశాలకు కోర్టు బ్రేక్

ఇస్తాంబుల్ తీరంలో ఘోరం.. రెండు టర్కీ నౌకలు ఢీ, 10 మంది గల్లంతు!

ప్రియుడితో భార్య రొమాన్స్.. రోబో వాక్యూమ్ క్లీనర్‌ను వాడిన భర్త, చివరికి జైల్లో…

నేపాల్ వరదల గురించి ముందే చెప్పిన బాబా వంగా.. తరువాత జరుగబోయేది ఇదే

పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు.. ఇరాన్ స్థావరాలపై అమెరికా దాడి, గుణపాఠం చెబుతాం-మొజాబ్తా ఖమేని

పాక్‌లో ఘోరం.. 125 ఏళ్ల నాటి ఆలయం కూల్చివేత.. రగిలిపోతున్న హిందువులు!

నేపాల్ జలప్రళయం.. ఒకే ఇంట్లో 24 మృతదేహాలు.. 1000 దాటిన మరణాలు!

Big Stories

Advertisement
×