E-Paper
Advertisement

Divya Bharathi: సుధీర్ చేస్తున్న సినిమాకి ఐటెం సాంగ్ కోసం పిలిచారు, దివ్యభారతి షాకింగ్ కామెంట్స్

Divya Bharathi: సుధీర్ చేస్తున్న సినిమాకి ఐటెం సాంగ్ కోసం పిలిచారు, దివ్యభారతి షాకింగ్ కామెంట్స్
Advertisement

Divya Bharathi: తెలుగు ప్రేక్షకులు భాషతో సంబంధం లేకుండా సినిమా చూస్తారు అని ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు ప్రేక్షకులకు ఒక సినిమా నచ్చితే ఆ సినిమా లోని నటీనటులను కూడా విపరీతంగా ఇష్టపడడం మొదలుపెడతారు. తక్కువ సినిమాలు చేసిన చాలామంది హీరోయిన్స్ ను ఇప్పటికీ తెలుగు ఆడియన్స్ విపరీతంగా గుర్తు పెట్టుకుంటారు. మలయాళం సూపర్ హిట్ సినిమా ప్రేమలు తెలుగులో కూడా డబ్బింగ్ అయింది. ఆ సినిమాలో హీరోయిన్ మమత బైజుకి విపరీతంగా కనెక్ట్ అయిపోయారు తెలుగు ప్రేక్షకులు.

అలానే జీవి ప్రకాష్ హీరోగా నటించిన సినిమా బ్యాచిలర్. ఆ సినిమాలో దివ్యభారతి హీరోయిన్గా నటించింది. దివ్యభారతి అందం గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. అయితే ఆ సినిమా చూసి చాలామంది దివ్యభారతి అందానికి ఫిదా అయిపోయారు. తెలుగులో ఒక స్టార్ హీరోతో సినిమా చేస్తుంది అని చాలామంది ఊహించరు. అయితే ఎవరూ ఊహించని విధంగా సుడిగాలి సుదీర్ హీరోగా గోట్ అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది దివ్యభారతి.

ఐటెం సాంగ్ కోసం పిలిచారు 

Advertisement

గోట్ సినిమా విషయంలో ఎన్ని వివాదాలు జరుగుతున్నాయో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. కేవలం మూడు కోట్ల నుంచి ఐదు కోట్లలోపు సినిమా పూర్తి చేస్తాను అన్న దర్శకుడు నరేష్ కుప్పిలి ను ఓవర్ బడ్జెట్ అవడంతో ఆ సినిమా నుంచి తొలగించేశారు.

తొలగించిన తర్వాత నరేష్ సినిమాలోని కొన్ని సీన్స్ ను లీక్ చేశాడు. ఆ తర్వాత రీసెంట్గా సినిమా నుంచి ఒక పాట వచ్చినా కూడా దానిమీద సోషల్ మీడియా వేదికగా కామెంట్ చేయడం మొదలుపెట్టాడు. అయితే ఓపెన్ గానే హీరోయిన్ దర్శకుడు నరేష్ కుప్పిలి మరియు సుధీర్ ను టార్గెట్ చేస్తూ పోస్ట్ చేసింది.

Advertisement

అయితే అలా సుదీర్ పేరు మెన్షన్ చేయడానికి చాలామందికి కారణం అప్పుడు తెలియలేదు. అయితే నరేష్ కుప్పిలి మరియు సుధీర్ కి మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ గురించి తనకు తెలుసు అని చెప్పింది దివ్యభారతి. అంతేకాకుండా ప్రస్తుతం సుదీర్ పాన్ ఇండియా సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. దానిలో ఒక ఐటెం సాంగ్ కోసం దివ్యభారతిని సంప్రదించాడంట హైలెస్సో సినిమా డైరెక్టర్.

అలా చేయడం తప్పు 

నన్ను ఐటెం సాంగ్ కోసం అడగడం అసలు తప్పులేదు. దానిని కూడా నేను తప్పు పట్టను. కానీ ఆ సినిమా దర్శకుడికి నాకు సుధీర్ కి మధ్య డిస్టబెన్స్ ఉన్నాయి అని తెలిసి కూడా నన్ను అడిగారు. సుధీర్ కి తెలియకుండా ఆదర్శకుడు నన్ను అడిగి ఉంటారు అని నేను అనుకోను. నా పని నేను చేసుకుంటున్న తరుణంలో ఐటెం సాంగ్ కోసం నాకు ఫోన్ చేసి అడగడం అనేది నన్ను పోక్ చేయడమే. అందువల్లనే నేను ట్విట్టర్లో ఆ పోస్ట్ పెట్టాను. చిలక అంటే అర్థం ప్యారిట్ అని నాకు కూడా తెలుసు. కానీ ఆ పదాన్ని యూస్ చేసిన కాంటెస్ట్ ఏదైతే ఉందో అది రాంగ్.

Also Read: Ram Charan theatres : అల్లు అర్జున్ కి పోటీగా రామ్ చరణ్ థియేటర్స్, ఎగ్జిబిటర్లు దుకాణం సర్దుకోవాల్సిందేనా?

Related News

నాగార్జున ‘కింగ్ 100’ నుంచి దసరా సర్‌ప్రైజ్.. అదేంటో తెలుసా ?

బాలీవుడ్‌లో కాల్పుల కలకలం.. టైగర్ ష్రాఫ్‌కు ఏమైంది?

40 ఏళ్ల తర్వాత కాశీకి వెళ్లిన రేణు దేశాయ్.. అక్కడ ఏం జరిగిందంటే?

విజయ్ యాక్షన్‌కు ఫిదా అయిన సందీప్ వంగా.. ఆర్జీవీ రియాక్షన్ మామూలుగా లేదుగా!

బాలు సినిమాలో పవన్ వేసుకున్న ప్యాంట్స్ వెనుక ఇంత కథ ఉందా?

పవన్ కళ్యాణ్‌తో విడిపోయాక నా పరిస్థితి ఇదే.. రేణు దేశాయ్ కామెంట్స్!

నవరాత్రుల వేళ హెబ్బా పటేల్ స్పెషల్ ట్రీట్..ఫ్యాన్స్‌కు కనువిందే!

జ్యోతి పూర్వజ్, పూర్వాజ్ మూవీ ‘కిల్లర్’.. ఒకేసారి రెండు అప్డేట్స్!

Big Stories

Advertisement
×