E-Paper
Advertisement

Chiranjeevi: ది ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ ని వదులుకున్న మెగాస్టార్ .. చేసి ఉంటేనా..?

Chiranjeevi: ది ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ ని వదులుకున్న మెగాస్టార్ .. చేసి ఉంటేనా..?
Advertisement

Chiranjeevi: ది మోస్ట్ వైరల్ వెబ్ సిరీస్ లలో ది ఫ్యామిలీ మ్యాన్  మొదటి వరుసలో ఉంటుంది అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఒకప్పుడు అన్ని సినిమాలను థియేటర్ లో వీక్షించిన ప్రేక్షకులు ఓటీటీ వచ్చాక వెబ్ సిరీస్ లకు అలవాటు పడ్డారు. అప్పుడప్పుడే ఎదుగుతున్న ఓటీటీలోకి మొదటిసారి ది ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయిన ఈ సిరీస్ ప్రపంచం మొత్తంలో నెంబర్ వన్ స్థానంలో నిలిచింది. యాక్షన్ థ్రిల్లింగ్ వెబ్ సిరీస్ లో ఐకానిక్ సిరీస్ గా నిలిచింది.

మనోజ్ భాజ్ పాయ్ , ప్రియమణి, షరీఫ్ హష్మీ, శ్రేయ ధన్వంతరి తదితరులు ప్రముఖ పాత్రల్లో రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహించిన ఈ సిరీస్ 2019లో అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కి వచ్చింది. రిలీజ్ అయిన మొదటి రోజు నుంచి మంచి పాజిటివ్ టాక్ తో భారీ విజయాన్ని అందుకుంది. ఇక హిట్ టాక్ రావడంతో రాజ్ అండ్ డీకే  ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ ను ఫ్రాంచైజీగా మార్చారు. 2021 ఫ్యామిలీ మ్యాన్ 2 సిరీస్ కూడా భారీ విజయం అందుకోవడంతో ఫ్యామిలీ మ్యాన్ 3 ని తెరకెక్కించారు. ఈ సిరీస్ నవంబర్ 21న అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానుంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో మనోజ్, ప్రియమణి తదితరులు ప్రమోషన్స్ మొదలుపెట్టారు.

Advertisement

ఇక ఈ సిరీస్  ప్రమోషన్స్ లో భాగంగా పాత జ్ఞాపకాలను నెటిజన్స్ సైతం గుర్తుతెచ్చుకుంటున్నారు. మొదట ది ఫ్యామిలీ మ్యాన్ కథ మనోజ్ కన్నా ముందు మెగాస్టార్ చిరంజీవి దగ్గరకు వెళ్ళింది అన్న విషయం తెలిసిందే. ఇది పాత విషయమే అయినప్పటికీ తాజాగా మరోసారి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. శ్రీకాంత్ తివారీ పాత్ర కోసం మొదట రాజ్ అండ్ డీకే చిరంజీవిని సంప్రదించారట. అప్పటికి చిరంజీవి ఖైదీ నెంబర్ 150 చిత్రం తర్వాత మరికొన్ని సినిమాలతో బిజీగా ఉన్నాడు. శ్రీకాంత్ తివారీ పాత్ర నచ్చిన కూడా చిరంజీవి.. ఒక కూతురు, కొడుకు ఉన్న తండ్రి పాత్రలో చేయాలి అంటే తన అభిమానులు అంగీకరిస్తారో లేదోనని ఆయన సందిగ్ధంలో పడ్డారట. అప్పటికీ రాజ్ అండ్ డీకే ఇద్దరు పిల్లల పాత్రలను పక్కన పెడదామని, కేవలం పెళ్లి అయినట్లే చూపిస్తామని చెప్పినా కూడా ఎందుకో చిరంజీవి ఆ కథను ఓకే చేయలేకపోయాడని సమాచారం. ఆ తర్వాత ఈ కథ మనోజ్ దగ్గరకు వెళ్ళింది.

మనోజ్ భార్య సైతం ఆ సినిమాలో ఎక్కువ శృంగారం, హింస ఉంటాయని అంటున్నారు. ఈలాంటి సిరీస్ లో నటించి నీ కెరియర్ ని నాశనం చేసుకుంటావా అని అడిగిందట. అయినా కూడా ఒకసారి స్క్రిప్ట్ విన్న తర్వాత మనోజ్ తన ఆలోచనలను మార్చుకొని శ్రీకాంత్ తివారీగా మారాడు. అలా ది ఫ్యామిలీ మ్యాన్  తెరకెక్కినట్లు సమాచారం. ఏది ఏమైనా  శ్రీకాంత్  పాత్రలో మనోజ్ నీ తప్ప ఇంకెవరిని ఊహించుకోలేము అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. చిరంజీవి చేస్తే అది వేరే లెవెల్ లో ఉండేదేమో.. కానీ, ఇప్పుడు అయితే శ్రీకాంత్ అంటే మనోజ్ .. మనోజ్ అంటే శ్రీకాంత్ అని మాత్రమే  చెప్పగలం. ఇప్పటికే రెండు సిరీస్ లు భారీ విజయాన్ని అందుకున్నాయి. ఇక ఈ మూడో సిరీస్ ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

Related News

భాయ్ చిక్కిపోయాడని ఏడ్చేసిన ఫ్యాన్స్.. రివర్స్ సెటైర్ వేసిన సల్మాన్ !

రికార్డుల వేటలో ‘ది ఒడిస్సీ’..మన మేకర్స్ ఇప్పటికైనా మారతారా?

విదేశాల్లో షాట్లు.. ఏపీలో ఓట్లు! టాలీవుడ్ స్టార్స్‌పై అంబికా కృష్ణ మార్కు కౌంటర్లు!

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

Big Stories

Advertisement
×