E-Paper
Advertisement

Tollywood Heros : క్రికెటర్ అవ్వాలనుకొని హీరోలైన టాలీవుడ్ స్టార్స్ ఎవరో తెలుసా..?

Tollywood Heros : క్రికెటర్ అవ్వాలనుకొని హీరోలైన టాలీవుడ్ స్టార్స్ ఎవరో తెలుసా..?
Advertisement

Tollywood Heros : టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం స్టార్స్ గా కొనసాగుతున్న హీరోలు కొందరు ఈమధ్య పలు ఇంటర్వ్యూ లలో పాల్గొంటూ, తమ గోల్స్ గురించి బయట పెడుతూ వస్తున్నారు. తమకు చిన్నప్పటి నుంచి అలా అవ్వాలన్న కోరిక ఉంటుందని, కానీ చివరికి అనుకోకుండా సినిమాల్లోకి రావాల్సి వచ్చిందని చాలామంది ఇంటర్వ్యూలలో బయటపెట్టారు.. తమ డ్రీమ్ ఎప్పటికైనా నెరవేర్చుకోవాలనే కోరికతో ఇప్పటికీ ఉన్న స్టార్ హీరోలు ఎందరో ఉన్నారు. ఈ మధ్య యంగ్ హీరోలు కూడా తమ డ్రీమ్ గురించి ఇంటర్వ్యూలలో బయటపెడుతున్నారు.. నిజానికి ఒక్కొక్కరికి ఒక్కొక్క గోల్ ఉంటుంది. అలాగే టాలీవుడ్ ఇండస్ట్రీలోని యంగ్ హీరోలు కొంతమంది క్రికెటర్లు అవ్వాలని అనుకున్నారు. అనుకోకుండా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి వరుసగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు.. అలా క్రికెటర్లు అవ్వాలనుకున్న టాలీవుడ్ యంగ్ హీరోలు ఎవరో ఒకసారి తెలుసుకుందాం..

క్రికెటర్స్ అవ్వాలకున్న టాలీవుడ్ యంగ్ హీరోలు..

అక్కినేని అఖిల్.. 

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది టాలెంటెడ్ క్రికెటర్స్ ఉన్నారు.. అందులో యంగ్ హీరోలు ఎక్కువగా ఉన్నారు.. అవును మీరు విన్నది అక్షరాల నిజమే.. అక్కినేని అఖిల్ మంచి క్రికెటర్ అన్న విషయం తెలిసిందే.. అఖిల్ కి చిన్ననాటి నుంచి క్రికెట్ అంటే ఆసక్తి. దీంతో పెద్ద క్రికెటర్ అవ్వాలనే కోరిక ఉండేది. తానో గొప్ప బ్యాట్స్ మెన్ గా ప్రూవ్ చేసుకోవాలనుకున్నాడు. ఈ విషయంలో డాడ్ నాగార్జున కూడా ఎంతో ఎంకరేజ్ చేసారు.. అంతేకాదు తన కొడుకుని చిన్నప్పుడే స్పోర్ట్స్ స్కూల్లో జాయిన్ చేశారు నాగార్జున.. ఆస్ట్రేలియాలో ఉన్న అఖిల్ క్రికెట్ గురించి ప్రావీణ్యం సంపాదించాడు. ఆటతో పాటు రాజకీయాలు కూడా క్రికెట్ లో కీలక పాత్ర పోషించేవి. అలా అఖిల్ క్రికెట్ కు దూరమయ్యాడు.. ఆ తర్వాత సినిమాల్లోకి హీరోగా ఎంట్రీ ఇచ్చారు. స్టార్ హీరో తనయుడు అయినా కూడా ఇప్పటివరకు ఆయన ఖాతాలో సూపర్ హిట్ సినిమా మాత్రం పడలేదు..

రౌడీ హీరో విజయ్ దేవరకొండ.. 

Advertisement

టాలీవుడ్ యంగ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి ఎన్నో సినిమాల్లో నటించాడు కానీ అర్జున్ రెడ్డి తర్వాత ఆయన క్రేజ్ పూర్తిగా మారిపోయింది.. లవర్ బాయ్ గా మారిన విజయ్ దేవరకొండ ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ చిత్రాల్లో నటించాడు.. కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద బిగ్గెస్ట్ హిట్గా నిలవగా.. ఈమధ్య వస్తున్న సినిమాలు ఏవి ఆయనకు పెద్దగా సక్సెస్ ని ఇవ్వలేకపోతున్నాయి.. ఈయన కూడా గతంలో క్రికెటర్ అవ్వాలని అనుకున్నాడట.. కానీ అనుకోకుండా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి నటుడుగా రాణిస్తున్నాడు.. ప్రస్తుతం ఈయన 15వ సినిమాలో నటిస్తూ బిజీగా ఉన్నారు.

Also Read : ఈ వారం ఓటీటీ 20కి పైగా సినిమాలు.. ఆ 3 అస్సలు మిస్ అవ్వకండి..

రోషన్..

Advertisement

టాలీవుడ్ సీనియర్ హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఇప్పటికీ రెండు సినిమాలు చేశారు. ఆ సినిమాలు అతనికి పెద్దగా సక్సెస్ ఇవ్వకపోయినా కూడా హీరోగా తన నటనకు మంచి మార్కులు పడ్డాయి. ప్రస్తుతం మూడవ ఛాంపియన్ మూవీలో నటిస్తున్నారు. ఇప్పటివరకు విడుదలైన అప్డేట్స్ తో భారీ అంచనాలను క్రియేట్ చేసుకున్నఈ మూవీ ఈనెల 25న క్రిస్మస్ కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ హీరో కూడా సినిమాల్లోకి రాకముందు క్రికెటర్ అవ్వాలని అనుకున్నాడట. కానీ కొన్ని పరిస్థితుల కారణంగా హీరోగా  మారాడు. వీళ్లు మాత్రమే కాదు టాలీవుడ్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ కూడా క్రికెటర్ అవ్వాలని అనుకున్నాడట.. ఆ తర్వాత కానీ కొన్ని పరిస్థితుల కారణంగా హీరోగా మారాడు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది హీరోలు తమ డ్రీమ్స్ ని పక్కన పెట్టి సినిమాల్లో హీరోలుగా రాణిస్తున్నారు..

 

Related News

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

ఎన్టీఆర్ డ్రాగన్ లో బాలీవుడ్ స్టార్స్… ఏం ప్లాన్ చేస్తున్నావ్ నీల్?

RC16పై మాస్ అప్డేట్..చరణ్–సుకుమార్ మూవీ గ్రాండ్ లాంచ్ ఎప్పుడో తెలుసా?

క్యాస్టింగ్ కౌచ్ పై పొలిమేర బ్యూటీ హాట్ కామెంట్స్.. చాలా ఇబ్బంది పెట్టేవారు?

Big Stories

Advertisement
×