E-Paper
Advertisement

సినిమాలను డైరెక్ట్ చేసిన కొరియోగ్రాఫర్స్ ఎవరో తెలుసా..?

సినిమాలను డైరెక్ట్ చేసిన కొరియోగ్రాఫర్స్ ఎవరో తెలుసా..?
Advertisement

Tollywood : ఏదైనా ఒకటి సాధించాలని అనుకున్న వాళ్లు కచ్చితంగా సాధించి తీరుతారు.. అయితే అందుకోసం ఓర్పు సహనం కూడా ఉండాలి.. ఈ మధ్య సినీ ఇండస్ట్రీలో ఒక ఫీల్డ్ లోకి ఎంటర్ అయిన వాళ్ళు ఇంట్రెస్ట్ తో మరొక ఫీల్డ్ లో కూడా రాణిస్తూ సక్సెస్ అవుతున్నారు.. అలాంటి వారిలో కొందరు కొరియోగ్రాఫర్లు కూడా ఉన్నారు.. డాన్స్ మాస్టర్లుగా హీరోలతో స్టెప్పులు వేయించే కొరియోగ్రాఫర్లు ఈమధ్య డైరెక్టర్లుగా మరి సక్సెస్ అవుతున్నారు.. ఇప్పటికే ఎంతోమంది మాస్టర్లు తమలోని టాలెంట్ నిరూపించుకున్నారు.. అయితే ఇప్పటివరకు ఎంతమంది కొరియోగ్రాఫర్లు డైరెక్టర్లుగా సక్సెస్ అయ్యారో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం…

రాఘవ లారెన్స్..

తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు రాఘవ లారెన్స్.. హీరోగా సినిమాలలో రాణించాలని అనుకున్నాడు కానీ.. కొన్ని కారణాలవల్ల తన కోరిక నెరవేరలేదు. అయితే డాన్స్ మాస్టర్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి హీరోలతో అదిరిపోయే స్టెప్పులేంచాడు లారెన్స్. ఆ తర్వాత హీరోగా కూడా సత్తాని చాటాడు.. ప్రస్తుతం డైరెక్టర్గా మాత్రమే కాదు.. నిర్మాతగా కూడా పలు సినిమాలను నిర్మించారు. రాఘవ లారెన్స్ మాస్టర్ ఇప్పటివరకు దాదాపు తొమ్మిది సినిమాలకు దర్శకత్వం వహించారు.. ఈయన తెరకెక్కిచ్చిన అన్ని సినిమాలలో కేవలం ఒకటి రెండు సినిమాలు మాత్రమే బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి.. మిగిలిన అన్ని సినిమాలు మంచి టాక్ ని అందుకోవడంతోపాటుగా కలెక్షన్ల వర్షం కూడా కురిపించాయి.

ప్రభుదేవా..

Advertisement

తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు ప్రభుదేవా.. ఈయన ఒకప్పుడు హీరోగా ఎన్నో సినిమాలలో నటించి ప్రేక్షకుల మనసు దోచుకున్నాడు.. కేవలం హీరోగా మాత్రమే కాదు డాన్స్ మాస్టర్ గా కూడా పలు సినిమాలకు వ్యవహరించి సక్సెస్ అయ్యారు. అంతే కాదండోయ్ ఈయన డైరెక్టర్ గా కూడా సినిమాలు చేశారు.. నువ్వొస్తానంటే నేనొద్దంటానా, పౌర్ణమి, శంకర్ దాదా జిందాబాద్ వంటి సినిమాలను డైరెక్ట్ చేశాడు..

బిన్ని విజయ్ మాస్టర్..

టాలీవుడ్ ఇండస్ట్రీలోని స్టార్ హీరోలతో స్టెప్పులు వేయించిన విజయ్ బిన్ని మాస్టర్ గురించి ఎంత చెప్పినా తక్కువే.. ఈమధ్య ఎక్కువగా బుల్లితెర షోలకు జడ్జిగా వ్యవహరిస్తూ సందడి చేస్తున్నారు. ఈయన డైరెక్టర్ గా మారి తెరకెక్కించిన సినిమా నా సామిరంగా. అక్కినేని నాగార్జున హీరోగా వచ్చిన ఈ సినిమా మంచి సక్సెస్ ని అందుకుంది. ఈ డైరెక్టర్ మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాడు..

Advertisement

Also Read :గురువారం టీవీ సినిమాలు.. ఆ ఒక్కటి డోంట్ మిస్..

వీళ్లతో పాటుగా మరి కొంతమంది కొరియోగ్రాఫర్లు డైరెక్షన్ డిపార్ట్మెంట్లో కూడా పనిచేస్తున్న విషయం చాలామందికి తెలియదు.. నెక్స్ట్ ఏ కొరియోగ్రాఫర్ డైరెక్టర్ గా మారి ఏ హీరోతో సినిమాను తెరకెక్కిస్తారో చూడాలి.. ఈ మధ్య లేడీ డ్యాన్స్ మాస్టర్స్ కూడా డైరెక్టర్ లు అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ వారం వరుసగా సినిమాలు వస్తున్నాయి. ఏది ఏమైనా దీపం ఉండగానే కొందరు డబ్బులను సంపాదిస్తున్నారు. ఫ్యూచర్ లో ఎలాంటి సినిమాలు వస్తాయో చూడాలి

Related News

టాక్సిక్ ..500కోట్లు అయ్యే పనేనా ?

మా ఆయన కోసమే గాయమైనట్టుంది… పెళ్లి తర్వాత మూడు నెలలు కలవలేదంటూ!

శ్రీకృష్ణుడిగా రౌడీ హీరో విజయ్ దేవరకొండ.. దిల్ రాజు క్రేజీ రీమేక్ ప్లాన్

బన్నీ ట్రిపుల్ రోల్‌పై కొత్త ట్విస్ట్.. ‘రాకా’ కథ మొత్తం మారిపోయిందా?

డెనిమ్‌లో మాల్వి మల్హోత్రా.. బ్లూ బ్యూటీని చూస్తే చూపు తిప్పుకోవడం కష్టమే!

ఇరుముడి బాక్సాఫీస్ రన్.. రూ.300 కోట్లు సాధ్యమేనా?

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కొడుకు కేసులో బిగ్ ట్విస్ట్…

ఇరుముడి సీక్వెల్ సినిమాలో రామ్ చరణ్.. ఫాన్స్ కు పూనకాలే!

Big Stories

Advertisement
×