E-Paper
Advertisement

Lakshmi Raave Maa Intiki : శ్రీలక్ష్మి రియల్ లైఫ్.. ఒక్కరోజు రెమ్యూనరేషన్..?

Lakshmi Raave Maa Intiki : శ్రీలక్ష్మి రియల్ లైఫ్.. ఒక్కరోజు రెమ్యూనరేషన్..?
Advertisement

Lakshmi Raave Maa Intiki : జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. డిఫరెంట్ స్టోరీలతో పాటుగా గ్రాఫిక్స్ సన్నివేశాలు కూడా ప్రేక్షకులకు ఔరా అనిపిస్తున్నాయి.. ఈమధ్య వచ్చే సీరియల్స్ జనాలని విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. అందులో లక్ష్మీ రావే మా ఇంటికి అనే సీరియల్ రీసెంట్గా ప్రారంభమైంది.. అతి తక్కువ కాలంలోనే ప్రేక్షకుల ఆదరణ పొంది మంచి రేటింగ్ తో దూసుకుపోతుంది. ఈ సీరియల్ లో హీరోయిన్ గా శ్రీలక్ష్మి నటిస్తుంది. ఈమె అసలు పేరు దర్శిని గౌడ. ఈ సీరియల్ కు గాను ఈ అమ్మడు ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటుంది అన్నది ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.. మరి సీరియల్ కు శ్రీలక్ష్మి తీసుకుంటున్న రెమ్యూనరేషన్ ఎంత అన్నది ఒకసారి వివరాల్లోకి వెళ్లి తెలుసుకుందాం..

శ్రీలక్ష్మి రియల్ లైఫ్..

లక్ష్మీ రావే మా ఇంటికి సీరియల్ లో నటిస్తున్న హీరోయిన్ శ్రీలక్ష్మి అసలు పేరు దర్శిని గౌడ. ఈమె కన్నడ ముద్దుగుమ్మ. కన్నడ ఇండస్ట్రీలో వచ్చిన ఎన్నో సీరియల్స్లలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. మోడల్ తన కెరియర్ ని ప్రారంభించిన సీరియల్ హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈమె గతంలో స్టార్ మా లో నాగపంచమి అనే సీరియల్ లో నటించింది. ఆ సీరియల్ ప్రేక్షకులను బాగా అలరించింది. దాంతో ఈమెకు వరుసగా అవకాశాలు క్యూ కడుతున్నాయి. ప్రస్తుతం జీతెలుగు తో పాటుగా జెమినీ టీవీలో కూడా ఓ సీరియల్ లో నటిస్తుందని తెలుస్తుంది. అంతేకాదు స్టార్ మా లో మరో భారీ ప్రాజెక్టులో ఈమెకు హీరోయిన్గా అవకాశం వచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. త్వరలోనే దీనిపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది..

Advertisement

Also Read :సినిమాలను డైరెక్ట్ చేసిన కొరియోగ్రాఫర్స్ ఎవరో తెలుసా..?

దర్శిని గౌడ ఒక్కరోజు రెమ్యూనరేషన్..?

కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన హీరోయిన్లకు తెలుగులో ఎంత డిమాండ్ ఉందో చెప్పనక్కర్లేదు. ఈమధ్య తెలుగులో ఏ సీరియల్ ప్రసారమవుతున్న అందులో హీరోయిన్గా కన్నడ హీరోయిన్లు కనిపిస్తున్నారు. వీళ్ళ నటనకు జనాలు ఫిదా అవడమే కాదు రెమ్యూనరేషన్ కూడా భారీగానే తీసుకుంటున్నారు. ఇప్పటివరకు ఎంతో మంది హీరోయిన్లు తెలుగులోకి ఎంట్రీ ఇచ్చారు.. అందులో దర్శిని గౌడ కూడా ఒకరు. ఈమె గతంలో పలు సీరియల్స్లలో నటించి ప్రేక్షకులను మెప్పించింది. తెలుగులో ఇప్పటివరకు ఈ అమ్మడు చేసిన ప్రతి సీరియల్ కూడా జనాలని విపరీతంగా ఆకట్టుకున్నాయి.. అయితే ఈమె సీరియల్స్ అన్ని మంచి హిట్ టాక్ని సొంతం చేసుకోవడంతో రెమ్యూనరేషన్ కూడా పెంచేసింది.. ఒక్క రోజుకి సీరియల్కు నటించినందుకు గాను ఈమె దాదాపు 35 వేలకు పైగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తుంది. ఈ లెక్కన చూస్తే నెలలో 25 రోజులు షూటింగ్ ఉంటుంది.. అంటే ఈమె సంపాదన నెలకు లక్షల్లో ఉంటుందని చెప్పనక్కర్లేదు.. ప్రస్తుతం ఈమె చేతిలో మరో రెండు భారీ ప్రాజెక్టులు ఉన్నట్లు తెలుస్తుంది.. అతి త్వరలోనే వాటి గురించి ప్రకటించే అవకాశం ఉంది..

Related News

క్యాస్టింగ్ కౌచ్‌పై ఝాన్సీ ఏమన్నారంటే.. ఇండస్ట్రీలో మహిళల పరిస్థితి ఇదేనా?

సలార్‌లో ఛాన్స్ కోసం ఝాన్సీ ఏం చేశారో తెలుసా?

ఆ రోజు షూటింగ్‌లో ఏం జరిగిందంటే.. ఝాన్సీ కన్నీటి కథ!

సుధీర్ కామెడీకి ఫిదా అవ్వాల్సిందే.. ఇస్మార్ట్ బతుకమ్మలో ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్!

జాను లిరి ఒక్క పాటకు ఎంత తీసుకుంటుందో తెలుసా?

యూట్యూబర్ నందనకి కోర్టులో భారీ ఊరట.. సంచలన పోస్ట్ వైరల్!

Telugu Tv Serials : బిగ్ బాస్ ఎఫెక్ట్.. ఆ సీరియల్స్ కు శుభం కార్డు పడినట్లే..?

ఒక్కరోజులో మారిపోయిన లెక్కలు..ఆరో వారం ఊహించని ఎలిమినేషన్ ట్విస్ట్..!

Big Stories

Advertisement
×