Dekhlenge Saala Recreation Video: దేవిశ్రీప్రసాద్ అంటే ఎనర్జీకి మరో పేరు. ఆయన కంపోజ్ చేసిన పాటలు విడుదలైన ప్రతీసారి ప్రేక్షకుల్లో పండుగ వాతావరణం కనిపిస్తుంది. అలాంటి పాటల్లో ఒకటైన.. డేఖ్‌లేంగే సాలా ఇప్పుడు మరోసారి సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. ఇప్పటికే అభిమానులను ఊపేసిన ఈ పాటకు తాజాగా డీఎస్పీ ప్రత్యేక రీక్రియేషన్ వీడియో విడుదల చేయడంతో హంగామా మరింత పెరిగింది.
ఈ వీడియోను “థాంక్యూ చాలా ఫార్ యువర్ లవ్ ఫర్ డేఖ్‌లేంగే సాలా..” అనే క్యాప్షన్‌తో సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇందులో డీఎస్పీ వివిధ లొకేషన్లలో డాన్స్ చేస్తూ కనిపించారు. ఎక్కడ చూసినా ఆయన ముఖంలో చిరునవ్వు..అడుగుల్లో జోష్ కనిపించింది. తనే కంపోజ్ చేసిన పాటకు తనే ఇలా ఎంజాయ్ చేస్తూ డాన్స్ చేయడం అభిమానులకు చాలా నచ్చింది. అందుకే ఈ వీడియో క్షణాల్లో వైరల్ అయింది.
డేఖ్‌లేంగే సాలా పాట.. పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న.. ఉస్తాద్ భగత్ సింగ్.. సినిమాలోని ఫస్ట్ సింగిల్ గా విడుదలైన సంగతి తెలిసిందే. దర్శకుడు హరీష్ శంకర్ ఈ పాటను సినిమాకి బిగ్గెస్ట్ డాన్స్ నెంబర్‌గా ముందే చెప్పారు. లిరికల్ వీడియో విడుదలైన తర్వాత అది నిజమే అని అభిమానులు సైతం ఈ సాంగ్లో పవన్ కళ్యాణ్ ని చూసి ఫిదా అయ్యారు. పాటలో పవన్ కళ్యాణ్ స్టెప్స్, ఆయన స్టైల్, గ్రేస్ అన్నీ కలిసి ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.
A Rockstar @ThisIsDSP's special recreation of the chartbuster #DekhlengeSaala ❤🔥
The energy & visuals are just lit 🔥🔥#UstaadBhagatSingh
POWER STAR @PawanKalyan @harish2you @sreeleela14 #RaashiiKhanna @ThisIsDSP @rparthiepan @DoP_Bose #AnandSai @Venupro @MythriOfficial… pic.twitter.com/rg1982dgPE— Mythri Movie Makers (@MythriOfficial) January 4, 2026
ఈ పాటకు డీఎస్పీ ఇచ్చిన ట్యూన్..భాస్కరభట్ల రవి కుమార్ రాసిన సింపుల్ కానీ పవర్‌ఫుల్ లిరిక్స్, విశాల్ దడ్లానీ గాత్రం కలిసి పాటను మరింత ఎంగేజింగ్‌గా మార్చాయి. చాలా మంది అభిమానులు ఈ పాట వింటే గబ్బర్ సింగ్ రోజులు గుర్తొస్తున్నాయంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఈ సినిమాలో శ్రీలీల..రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇద్దరూ పవన్ కళ్యాణ్‌తో తొలిసారి స్క్రీన్ షేర్ చేస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను భారీ స్థాయిలో నిర్మిస్తోంది. పార్థీబన్ కూడా కీలక పాత్రలో కనిపించనున్నారు.
మొత్తానికి..డేఖ్‌లేంగే సాలా పాటతో మొదలైన ఊపు, డీఎస్పీ రీక్రియేషన్ వీడియోతో మరో లెవల్‌కు చేరింది. సినిమా రిలీజ్‌కి ముందే ఈ పాట సినిమాపై అంచనాలను బాగా పెంచేసింది.
ALSO READ: Naga Vamshi: హడావిడి కాదు.. కంటెంట్ మాట్లాడాలి…అఖిల్ లెనిన్ గురించి నిర్మాత కీలక వ్యాఖ్యలు..!