Mysterious Temples: భారతదేశం విభిన్న సంస్కృతులకు నిలయం. ఇక్కడి అనేక దేవాలయాల్లో ఎన్నో ఆధ్యాత్మిక రహస్యాలు దాగి ఉన్నాయి. కేరళలోని కొడుంగల్లూర్ భద్రకాళి ఆలయం నుంచి రాజస్థాన్ మోహందీపూర్ బాలాజీ దేవాలయంలో జరిగే దుష్ట శక్తుల నివారణ వరకు ప్రతిదీ మనల్ని విస్మయానికి గురిచేస్తాయి. ఇదిలా ఉంటే.. మధ్యప్రదేశ్‌లో మద్యం సేవించే కాలభైరవుడు అంతే కాకుండా ఏపీలోని లేపాక్షిలో గాలిలో వేలాడే అద్భత స్తంభం, మహేశ్వర్ ఆలయాల కూడా నేటికి ఆధునిక సమాజానికి సవాలుగా నిలుస్తున్నాయి. భక్తితో పాటు విశ్వాసం, సైన్స్ కు అందని రహస్యాల సమ్మేళనం అయిన ఈ 5 ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల విశేషాలను గురించి వివరాలను పూర్తిగా ఇప్పుడు తెలుసుకుందాం.
కొడుంగల్లూర్ భద్రకాళి ఆలయం:(కేరళ)
కేరళలోని త్రిస్సూర్ జిల్లాలో కొడుంగల్లూర్ భద్రకాళి ఆలయం ఉంది. ఈ ఆలయం అత్యంత శక్తివంతమైనదిగా చెబుతారు. ఇక్కడి ఆచారాలు చాలా విభిన్నంగా, భయంకరంగా ఉంటాయి. ఇక్కడ జరిగే భరణి ఉత్సవం చాలా ప్రత్యేకమైనది. ఈ సమయంలో భక్తులు ఎరుపు రంగు బట్టలు ధరించి, కత్తులతో తలలపై కొట్టుకుంటూ రక్తం చిందిస్తారు. అంతే కాదు అమ్మవారిని తిడుతూ పాటలు పాడతారు. ఇది వినడానికి వింతగా ఉన్న ఇలా చేయడం వల్ల భక్తుల లోపల ఉన్న అహంకారం, చెడు ఆలోచనలు నశిస్తాయని నమ్ముతారు. గతంలో ఇక్కడ పాలించిన రాజుకు సంబంధించిన చారిత్రక సంఘనటను ఇది నిదర్శనం అని కొంత మంది చెబుతుంటారు.
2. మెహందీపూర్ బాలాజీ టెంపుల్ :(రాజస్థాన్)
దౌసా జిల్లాలోని ఈ ఆలయం మిగతా ఆలయాలకంటే చాలా భిన్నంగా ఉంటుంది. ఇక్కడ దుష్టశక్తులు, దయ్యాలు పట్టిన వారి విముక్తి కోసం నిత్యం వివిధ ప్రాంతాల నుంచి వస్తుంటారు. బాధితులు ఇక్కడ వింతగా ప్రవర్తించడం చేస్తుంటారు. అలాంటి వారిని ఆలయంలోనే గొలుసులతో కట్టేస్తారు. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే.. ఈ ఆలయంలో ఇచ్చిన ప్రసాదాన్ని ఇంటికి తీసుకువెళ్లకూడదు. అలాగే అక్కడి ఏ వస్తువునైనా వెనక్కి తీసుకురాకూడదు. అలా చేస్తే దుష్ట శక్తులు వారితో పాటు ఇంటికి వస్తాయని నమ్ముతారు. అంతే కాకుండా భక్తులు ఇక్కడి నుంచి ఇంటికి వెళ్లే టప్పుడు కూడా వెనక్కి తిరగకూడదు.
3. నిష్కలంక్ మహాదేశ్ ఆలయం:(గుజరాత్):
గుజరాత్ తీరంలోని కోలియాక్ వద్ద అరేబియా గర్భంలోనే ఈ అద్భుమైన ఆలయం ఉంటుంది. ఈ ఆలయం రోజంతా భక్తులకు కనిపించదు సముద్రం ఆటుపోటు ఆధారంగా రోజులో కొన్ని గంటలు మాత్రమే కనిపిస్తుంది. అలలు వెనక్కి వెళ్లినప్పుడు భక్తులు నడుచకుంటూ వెళ్లి అక్కడ ఉన్న 5 శివ లింగాలను దర్శించుకుంటారు. పోటు రాగానే ఆలయం పూర్తిగా సముద్రంలో మునిగిపోతుంది. కేవలం పైన ఉన్న ధ్వజస్తంభం మాత్రమే అప్పుడు కనిపిస్తుంది.
Also Read: ఇంట్లో సమస్యలు పెరుగుతున్నాయా ? అయితే మీ డస్ట్ బిన్ దిశను ఒక్కసారి గమనించండి
4.కాల భైరవ దేవాలయం: (మధ్యప్రదేశ్)
మధ్య ప్రదేశ్ లోని ఉజ్జయినిలో ఈ కాల భైరవ ఆలయం ఆధునిక సైన్స్ కు సవాల్ విసురుతోంది. ఇక్కడ స్వామి వారికి మద్యం నైవేద్యంగా సమర్పిస్తారు. పూజారి గిన్నలో పోసిన మద్యాన్ని స్వామి వారి విగ్రహం నోటి దగ్గర ఉంచగానే.. ఆ మద్యం క్షణాల్లో మాయం అవుతుంది.విగ్రహం ఆ మద్యాన్ని ఎలా తాగుతుందో ఎవరికీ తెలియదు. విగ్రహ కింద కూడా ఎలాంటి రంధ్రాలు లేవని మద్యం ఎక్కడికి వెళ్తుందో కనిపెట్టేందుకు కూడా పురావస్తు శాఖ వారు తవ్వకాలు జరిపినా కూడా ఎలాంటి ఆధారాలు దొరకలేదని చెబుతారు.
5. లేపాక్షి వీరభద్రాలయం: (ఏపీ)
అనంతపురం జిల్లాలో ని ఈ ఆలయంలో మొత్తం 70 స్తంభాలు ఉంటాయి. ఇందులో ఒక స్తంభం మాత్రం భూమిని తాకకుండా గాలిలో వేలాడుతుంది. ఈ స్తంభం కింద నుంచి ఒక పలుచని వస్త్రాన్ని లేదా పేపర్ నుఒక వైపు నుంచి మరో వైపు సులభంగా పంపించే అవకాశం ఉంటుంది. మొత్తం ఆలయ బరువును సమతుల్యం చేయడంలో ఈ స్తంభం మాత్రమే కీలక పాత్ర పోషిస్తుందని భావిస్తారు.