E-Paper
Advertisement

Prabhas: జపాన్‌ భూకంపంలో ప్రభాస్‌… ఆయన సేఫ్ అంటూ డైరెక్టర్ క్లారిటీ

Prabhas: జపాన్‌ భూకంపంలో ప్రభాస్‌… ఆయన సేఫ్ అంటూ డైరెక్టర్ క్లారిటీ
Advertisement

Prabhas: టాలీవుడ్ స్టార్, పాన్ ఇండియా హీరో ప్రభాస్(Prabhas) ప్రస్తుతం జపాన్(Japan) పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. జపాన్లో బాహుబలి ది ఎపిక్ (Bahubali The Epic)సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్లలో భాగంగా ప్రభాస్ తో పాటు నిర్మాత శోభు యార్లగడ్డ జపాన్ లో పర్యటిస్తూ పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్లను నిర్వహించడమే కాకుండా అభిమానులను కలుస్తూ సందడి చేస్తున్నారు. ఇలా జపాన్ ప్రమోషన్లకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇదిలా ఉండగా సోమవారం జపాన్ లో భూకంపం (Earthquake)సంభవించిన సంగతి తెలిసిందే. రిక్టర్ స్కేలు పై భూకంపం తీవ్రత దాదాపు 7.6 గా నమోదయింది.

జపాన్ లో భూకంపం.. ఆందోళనలో ప్రభాస్ ఫ్యాన్స్..

ఇలా జపాన్ లో భూకంపం సంభవించిన నేపథ్యంలో అక్కడ బాహుబలి పర్యటనలో ఉన్న ప్రభాస్ గురించి అభిమానులు ఆందోళన చెందారు. భూకంపం కారణంగా ప్రభాస్ కు ఏ విధమైనటువంటి ప్రమాదం లేదు కదా అంటూ అభిమానులు ఆందోళన చెందుతూ సోషల్ మీడియా వేదికగా పోస్టులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రభాస్ గురించి డైరెక్టర్ మారుతి సోషల్ మీడియా వేదికగా తెలియచేయడంతో అభిమానులు ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. ఇదే విషయం గురించి డైరెక్టర్ మారుతి సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ.. ప్రభాస్ తో తాను మాట్లాడానని ఆయన టోక్యోలో లేరని ప్రభాస్ క్షేమంగా ఉన్నారు ఎవరు ఆందోళన చెందాల్సిన పనిలేదు అంటూ మారుతి సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.

ప్రభాస్ క్షేమంగా ఉన్నారు..

Advertisement

ఈ విధంగా ప్రభాస్ క్షేమం గురించి మారుతి ఈ విషయాన్ని తెలియచేయడంతో అభిమానులు కూడా ఊపిరి పీల్చుకున్నారు. ఇక ప్రభాస్ ప్రస్తుతం తన సినిమా పనులను పక్కనపెట్టి బాహుబలి ది ఎపిక్ ప్రమోషన్ లలో భాగంగా జపాన్ లో పర్యటిస్తున్నారు. ఇక త్వరలోనే ఈయన తిరిగి ఇండియా చేరుకోబోతున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం ప్రభాస్ వరుస పాన్ ఇండియా సినిమా పనులలో ఎంతో బిజీగా ఉన్నారు. ఈయన స్పిరిట్ సినిమాతో పాటు, ఫౌజీ సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.

Advertisement

ఇక త్వరలోనే మారుతి డైరెక్షన్ లో ప్రభాస్ నటించిన ది రాజా సాబ్(The Raja Saab) సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుంది. ఈ సినిమా 2026 సంక్రాంతి పండుగను పురస్కరించుకొని జనవరి 9వ తేదీ విడుదల కాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్లను కూడా నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన పస్ట్ సింగల్ మంచి ఆదరణ సొంతం చేసుకుంది. ఇక త్వరలోనే సెకండ్ సింగిల్ కూడా విడుదల చేయబోతున్నారని తెలుస్తోంది. ఇలా ప్రభాస్ ఒకవైపు సినిమాల షూటింగ్స్ మరోవైపు సినిమాల ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొంటూ ఎంతో బిజీ బిజీగా గడుపుతున్నారు.

Also Read: Balakrishna: బాలయ్య అఖండ 2 మాత్రమే కాదు.. గతంలోనూ ఈ సినిమాలు ఆగిపోయాయని తెలుసా?

Related News

నవరాత్రుల వేళ హెబ్బా పటేల్ స్పెషల్ ట్రీట్..ఫ్యాన్స్‌కు కనువిందే!

జ్యోతి పూర్వజ్, పూర్వాజ్ మూవీ ‘కిల్లర్’.. ఒకేసారి రెండు అప్డేట్స్!

‘స్పిరిట్’ వాయిదా.. ఫ్యాన్స్‌కు కొత్త రిలీజ్ డేట్ ప్రకటించిన సందీప్ రెడ్డి వంగా!

గరివిడి లక్ష్మి సినిమాపై రవితేజ రివ్యూ.. ఏమన్నారంటే?

ఏడేళ్ల వయసులోనే సాఫ్ట్వేర్ సంస్థకు యజమాని.. ‘జైలర్’ బుడ్డోడు చిన్నోడు కాదండోయ్!

‘గరివిడి లక్ష్మి’లో ఆర్పీ పట్నాయక్ పాత్ర వెనుక అసలు కథ ఇదేనా?

క్యాస్టింగ్ కౌచ్‌పై ఝాన్సీ ఏమన్నారంటే.. ఇండస్ట్రీలో మహిళల పరిస్థితి ఇదేనా?

యూత్‌ను టార్గెట్ చేస్తూ వస్తున్న ‘హైకూ’.. అక్టోబర్ 23న థియేటర్లలోకి!

Big Stories

Advertisement
×