E-Paper
Advertisement

Highest Grossers 2025 : ఈ ఏడాది కలెక్షన్లతో రికార్డులు బ్రేక్ చేసిన సినిమాలు ఇవే…

Highest Grossers 2025 : ఈ ఏడాది కలెక్షన్లతో రికార్డులు బ్రేక్ చేసిన సినిమాలు ఇవే…
Advertisement

Highest Grossers 2025 :  సినీ ఇండస్ట్రీలో ప్రతి ఏడాది పొడవునా సినిమాలు రిలీజ్ అవుతూ ఉంటాయి. వాటిలో స్టార్ హీరోల సినిమాల స్టోరీలు బాగోలేకపోవడంతో యావరేజ్ టాక్ ను సొంతం చేసుకుంటున్నాయి. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది థియేటర్లలోకి వచ్చిన స్టార్ హీరోల సినిమాల్లో చాలావరకు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి.. ఈ ఏడాది చిన్న సినిమాలు గా వచ్చిన ప్రతి సినిమా బాక్సాఫీస్ రికార్డులను బ్రేక్ చేశాయి.. 2024లో మిక్స్డ్ టాక్ ను సినిమాలు ఎక్కువగా సొంతం చేసుకున్నాయి. కానీ ఈ ఏడాది మాత్రం కాసుల వర్షం బాగానే కురిపించాయి.. కొన్ని చిన్న సినిమాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. మరి 2025 లో బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బాస్టర్ హిట్ అందుకున్న సినిమాలు ఏవి? ప్రపంచవ్యాప్తంగా రాబట్టిన కలెక్షన్స్ ఎంతనో ఒకసారి చూసేద్దాం..

ఈ ఏడాది హైయెస్ట్ కలెక్షన్స్ అందుకున్న సినిమాలు ఇవే.. 

రైడ్ 2..

బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ నటించిన రైడ్ 2 చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.. గతంలో వచ్చిన రైడ్ చిత్రానికి సీక్వెల్ గా ఈ సినిమా వచ్చింది. ఎటువంటి అంచనాలు లేకుండా థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ ను షేక్ చేసింది.. ప్రపంచవ్యాప్తంగా 237 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఇండియాలో 206 కోట్ల వసూళ్లను అందుకుంది. అటు ఓవర్సీస్ లో కూడా రికార్డు బ్రేక్ స్థాయిలో కలెక్షన్లను అందుకుంది.

సంక్రాంతికి వస్తున్నాం..

Advertisement

ఇండియా వైడ్ హిట్ చిత్రాల జాబితాలో చోటు సంపాదించి ఈ ఏడాది సంక్రాంతి బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన మూవీ సంక్రాంతికి వస్తున్నాం.. విక్టరీ వెంకటేష్, టాలీవుడ్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్లో ఈ సినిమా వచ్చింది. ఇండియా వైడ్‌గా 220 కోట్ల గ్రాస్, ఓవర్సీస్‌లో 34.4 కోట్ల రూపాయలు వసూలు చేసింది.. మొత్తంగా ఈ మూవీ 260 వరకు వసూళ్లను అందుకుంది.

ఛావా.. 

టాలీవుడ్ బ్యూటిఫుల్ హీరోయిన్ రష్మిక మందన్న, బాలీవుడ్ స్టార్ హీరో విక్కీ కౌశల్ జంటగా నటించిన చిత్రం ఛావా.. మొదటినుంచి భారీ అంచనాలను క్రియేట్ చేసుకున్న ఏ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద రిలీజ్ అయ్యాక అంతకుమించి కలెక్షన్లను అందుకుంది.. ఇండియా వైడ్ గా మొత్తం ఎనిమిది వందల కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది..

మహావతార్ నరసింహ.. 

Advertisement

ఈ ఏడాది ఇండియన్ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించిన బెస్ట్ యానిమేషన్ మూవీ మహావతార్ నరసింహ.. కన్నడ చిత్రంగా వివిధ భాషల్లోకి డబ్ అయిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 327 కోట్లు వసూల్ చేసి సరికొత్త రికార్డు ను నమోదు చేసుకుంది.

కొత్త లోక.. 

కళ్యాణి ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ లోక: చాప్టర్ 1 చంద్ర చిత్రం.. ఎటువంటి అంచనాలు లేకుండా చిన్న సినిమాగా వచ్చిన ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా 350 కోట్లవరకు వసూళ్లను సొంతం చేసుకుంది. మలయాళ ఇండస్ట్రీ గతంలో నమోదు చేసుకున్న రికార్డులను ఇది బ్రేక్ చేసింది.. ఇవే కాదు వీటితో పాటుగా ఓజీ, హౌస్ ఫుల్ సీజన్ 5, సయ్యారా, కాంతార చాప్టర్ 1, వార్, కూలీ సినిమాకీ కూడా ఉన్నాయి. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది భారీ కలెక్షన్లను చాలా సినిమాలు రాబట్టాయి.. ప్రస్తుతం ఈ ఏడాది చివరగా ఈనెల బోలెడు సినిమాలు థియేటర్లలో సందడి చెయ్యనున్నాయి.

Related News

జ్యోతి పూర్వజ్, పూర్వాజ్ మూవీ ‘కిల్లర్’.. ఒకేసారి రెండు అప్డేట్స్!

‘స్పిరిట్’ వాయిదా.. ఫ్యాన్స్‌కు కొత్త రిలీజ్ డేట్ ప్రకటించిన సందీప్ రెడ్డి వంగా!

గరివిడి లక్ష్మి సినిమాపై రవితేజ రివ్యూ.. ఏమన్నారంటే?

ఏడేళ్ల వయసులోనే సాఫ్ట్వేర్ సంస్థకు యజమాని.. ‘జైలర్’ బుడ్డోడు చిన్నోడు కాదండోయ్!

‘గరివిడి లక్ష్మి’లో ఆర్పీ పట్నాయక్ పాత్ర వెనుక అసలు కథ ఇదేనా?

క్యాస్టింగ్ కౌచ్‌పై ఝాన్సీ ఏమన్నారంటే.. ఇండస్ట్రీలో మహిళల పరిస్థితి ఇదేనా?

యూత్‌ను టార్గెట్ చేస్తూ వస్తున్న ‘హైకూ’.. అక్టోబర్ 23న థియేటర్లలోకి!

మాల్దీవుల్లో ఖుషీ కపూర్ అందాల సందడి.. ఫ్యాన్స్‌కు ఫుల్ ట్రీట్!

Big Stories

Advertisement
×