E-Paper
Advertisement

బాలీవుడ్‌ పరువు తీసిన స్వీడిష్ బ్యూటీ.. సౌత్ గొప్పతనం చెబుతూ షాకింగ్ పోస్ట్!

బాలీవుడ్‌ పరువు తీసిన స్వీడిష్ బ్యూటీ.. సౌత్ గొప్పతనం చెబుతూ షాకింగ్ పోస్ట్!
Advertisement

Elli AvrRam:ఇండస్ట్రీలో కనిపించే వెలుగులే కాదు కనిపించని చీకట్లు కూడా చాలా ఉంటాయని మరోసారి తేలిపోయింది. అయితే ఈసారి మన వాళ్ళ గొప్పల్ని, తప్పుల్ని మనవాళ్ళు కాకుండా ఫారిన్ భామ, స్వీడిష్ బ్యూటీ ఎల్లీ అవ్రామ్ బయట పెట్టడం విశేషం. మరి తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఈ అందం బయటపెట్టిన ఆ డార్క్ షేడ్స్ అండ్ గుడ్ థింగ్స్ ఏంటో చూసేద్దాం.

హిందీ మేకర్స్ కు అసలు మానవత్వం లేదు 

Advertisement

ఎల్లీ అవ్రామ్ మాట్లాడుతూ హిందీ మేకర్స్ కు అసలు మానవత్వం లేదని, అక్కడ పని చేసే వారు చచ్చినా పట్టించుకోరంటూ చెప్పుకొచ్చింది. అలా బాలీవుడ్ ఇండస్ట్రీలో ఉండే టాక్సిక్ వర్క్ కల్చర్ గురించి ఆమె చేసిన కామెంట్స్ ఇపుడు బీ టౌన్ లో మంటలు రాజేస్తున్నాయ్.ఈ క్రమంలో బాలీవుడ్ సెట్స్ లో నటీనటుల పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో ఎల్లీ వివరిస్తూ ఒళ్లు గగుర్పొడిచే నిజాలు బయటపెట్టింది. అసలు నీకు ఆకలి ఉందా నీరసంగా ఉందా? అన్నది వారికి అవసరం లేదు. భోజనం చేస్తున్నామని చూడకుండా రమ్మని అరుస్తారు అంటూ తన బాధని బయటపెట్టింది. ఒకవేళ నువ్వు స్పృహ తప్పి పడిపోతావని తెలిసినా వాళ్లు కనికరించరు అంటూ బాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్‌ల తీరుపై మండి పడింది.తాను ఎంత టాలెంట్ చూపించినా ‘మలంగ్’ సినిమా వరకు తనను ఒక నటిగా ఎవరూ గుర్తించలేదని, కేవలం ఫిగర్ ఎలా ఉందనే దాన్నిబట్టి ఛాన్స్ లు ఇస్తారని ఫైర్ అయింది.

సౌత్ సినిమాల్ని చేయడం ఎంతో ప్రశాంతత

Advertisement

ఇక అదే క్రమంలో పక్కనే ఉన్న సౌత్ సినిమాల్ని వెనకేసుకొని రావడం విశేషం. “దక్షిణాది సినిమాల్లో పనిచేయడం నాకు ఎంతో ప్రశాంతతను ఇచ్చింది. అక్కడ ఎవరూ కేకలు వేయరు, అంతా నిశ్శబ్దంగా, పద్ధతిగా వాకీటాకీల్లో మాట్లాడుకుంటారు” అంటూ సౌత్ వర్కింగ్ స్టైల్ ని ఆకాశానికి ఎత్తింది.ఇక బాలీవుడ్ మేకర్స్ నటీనటుల ప్రతిభను ఎలా తొక్కిపెడతారో కూడా ఎల్లీ వివరించింది. “నువ్వు అందంగా ఉన్నావంటే నిన్ను కేవలం గ్లామర్ బొమ్మగానే చూస్తారు. గ్లామర్ పాత్రలకు తప్ప సీరియస్ రోల్స్‌కు పనికిరావు అని ముద్ర వేసేస్తారు (Typecasting)” అంటూ ఘాటైన కామెంట్స్ చేసింది.దీంతో చాలా మంది బాలీవుడ్ సినిమాలు వరుసగా ఫ్లాప్ అవుతుండటం, సౌత్ సినిమాలు నెంబర్ 1 పొజిషన్ కి దూసుకు రావడానికి వెనుకున్న రీజన్ ఇదే అని తమదైన జడ్జ్ మెంట్స్ పాస్ చేస్తున్నారు.

ఇక ఈ ఫారిన్ బ్యూటీ నటించిన సినిమాల విషయానికి వస్తే, ‘మిక్కీ వైరస్’, ‘నాపేరు సూర్య’, కోలీవుడ్ స్టార్ ధనుష్ ‘నేనే వస్తున్నా’, ‘కిస్ కిస్కో ప్యార్ కరూన్’ వంటి సినిమాలల్లో తనదైన డాన్స్ తో మెప్పించగా, తాజాగా 2025లో వచ్చిన ‘బీ హ్యాపీ’ చిత్రంతో మాత్రం నటిగా మంచి మార్కులే కొట్టేసింది.చూడాలి మరి ఈ అమ్మడు చేసిన కామెంట్స్ పై బాలీవుడ్ బాబులు ఎలా రియాక్ట్ అవుతారో !

also read:మహానటి మరణం వెనుక చేదు నిజాలు..ఆ రాత్రి హోటల్ గదిలో ఏం జరిగింది? చివరకు ప్రభుత్వ ఆసుపత్రిలో అనాథలా..?

Related News

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

Big Stories

Advertisement
×