E-Paper
Advertisement

మహానటి మరణం వెనుక చేదు నిజాలు..ఆ రాత్రి హోటల్ గదిలో ఏం జరిగింది? చివరకు ప్రభుత్వ ఆసుపత్రిలో అనాథలా..?

మహానటి మరణం వెనుక చేదు నిజాలు..ఆ రాత్రి హోటల్ గదిలో ఏం జరిగింది? చివరకు ప్రభుత్వ ఆసుపత్రిలో అనాథలా..?

Savitri Life:సావిత్రి …ఈ పేరు వింటే వెండి తెర పులకరిస్తుంది. సినిమాలు తమలో నటించినందుకు తెగ సంబరపడతాయ్. ఇక 50, 60లలో ఈవిడ లేకపోతే సినిమానే లేదు అన్నంతగా సాగిందంటే దర్శకనిర్మాతలు సావిత్రికి ఎంతలా విలువిచ్చేవారో అర్థం చేసుకోవచ్చు. అలాంటి ఈ మహా నటి ఎంత డబ్బు సంపాదించినప్పటికీ చివరిలో అనాథలా చనిపోయిందంటే ఎవరికైనా గుండె తరిగిపోకుండా ఉండదు. అసలు వెండి తెరపై చెరగని సంతకం చేసిన సావిత్రి సినీ జీవితాన్ని ఎలా మొదలు పెట్టి ఎలా ముగించిందో క్విక్ గా చూసేద్దాం.

1957 ‘మాయాబజార్’ నాటికి అగ్రస్థానం 

1950లో ‘సంసారం’ సినిమాతో మొదలైంది సావిత్రి ప్రస్థానం. అలా 1957 ‘మాయాబజార్’ నాటికి అగ్రస్థానానికి చేరింది. అప్పటి వరకు మద్రాసులో అద్దె ఇంట్లో తండ్రి చాటుగా పెరిగిన సావిత్రి తన కష్టార్జితంతో 1958 మార్చి 1న టీ. నగర్, హబీబుల్లా రోడ్డులో మొట్టమొదటి రెండంతస్తుల మేడను నిర్మించింది.ఆ తర్వాత ‘మిస్సమ్మ’, ‘రక్తసంబంధం’ వంటి బ్లాక్ బస్టర్ హిట్లతో నాలుగు ఇళ్లు, ఊటీలో లగ్జరీ బంగళాను సొంతం చేసుకుంది  కూడా.

ఇక అప్పటికే సారంగపాణి వీధిలో ఇల్లు ఉన్న అక్కినేని దానిని దర్శకుడు ఆదుర్తికి అయ్యేయగా, సావిత్రి దానిని కూడా కోనేసెంత స్థాయికి చేరుకుంది. అలా అడ్డే లేదన్నట్టుగా దూసుకుపోతున్న సావిత్రి జీవితాన్ని జెమిని గణేషన్‌తో జరిగిన పెళ్లి తలకిందులు చేసేసింది. దాంతో మోసపోయానన్న పచ్చాత్తాపంతో మత్తుకు బానిస కావడంతో అప్పటి వరకు కట్టుకున్న తన కోట అంత కుప్పకూలాల్సిన పరిస్థితి.

హోటల్ గదిలో నోటి నుంచి నురగ కక్కుతూ

ఇక అప్పటివరకు ఇన్కంటాక్స్ ఎగ్గొట్టని ఆమె ఇల్లని, సంపాదించిన ఆస్తుల్ని టాక్స్ కట్టలేదన్న పేరుతో జప్తు చేశారు. దీనితో నిలువ నీడ కూడా లేని ఈ మహా నటి చివరకు అన్నా నగర్‌లోని ఒక ఇరుకైన అద్దె ఇంట్లోకి మారాల్సి రావడం అత్యంత విషాదకరం అని చెప్పాలి. అప్పటికే మద్యానికి బాగా అలవాటు పడింది సావిత్రి. ఆ క్రమంలో 1980 మే 10న ఒక కన్నడ షూటింగ్ కోసం బెంగళూరు వెళ్లినప్పుడు సావిత్రి జీవితంలో అసలైన నరకం మొదలైంది. హోటల్ గదిలో నోటి నుంచి నురగ కక్కుతూ అపస్మారక స్థితిలో పడి ఉన్న ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్తే, స్టార్ హీరోయిన్ అని కూడా చూడకుండా మూడు ప్రైవేట్ ఆసుపత్రులు చేర్చుకోవడానికి వెనుకడుగు వేశాయి.అయితే అంతకు ముందు రోజే నటి శుభ సూసైడ్ చేసుకోవడం, ఆ న్యూస్ సెన్సేషన్ అవడంతో భయపడిన ఆసుపత్రులు సావిత్రికి కనీసం ట్రీట్ మెంట్ అందించేందుకు కూడా ముందుకు రాలేదు.

మూడు నెలల ట్రీట్ మెంట్ తర్వాత

చివరకు ఏదిక్కులేక శివాజీనగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక సాధారణ రోగిలా ఆమెను చేర్చాల్సి వచ్చింది. ఇక ఆమె పరిస్థితి చూసి కన్నడ కంఠీరవ రాజ్‌కుమార్ పరామర్శించగా, మే 18న జెమిని గణేషన్ వచ్చి పలకరించినప్పుడు సావిత్రి కేవలం కన్నీళ్లు మాత్రమే కార్చగలడం బాధాకరం. అయితే వైద్యుల పరీక్షల్లో ఆమె మెదడు కణాలు చనిపోయాయని, కోమాలోకి వెళ్లారని తేలింది.ఇక ఆ తర్వాత మద్రాసులోని లేడీ వెల్లింగ్టన్ హాస్పిటల్ లో మూడు నెలల ట్రీట్ మెంట్ తర్వాత అన్నా నగర్లో సావిత్రి ఉన్న అద్దె ఇంటికి తీసుకువచ్చారు.

చివరకి 1981 డిసెంబర్ 26 రాత్రి 10:30 గంటలకు

అలానే దాదాపు ఏడాది పైగా మంచానిపైనే ఉండటంతో ఆమె వీపు అంతా పుండ్లు పడి భయంకరమైన వేదనను అనుభవించారు. ఆ సమయంలోనే విజయవాడ హోమియో వైద్యుడు డాక్టర్ వాసు, అక్కినేని, దాసరి వంటి వారు పరామర్శించారు.ఇక సంపాదించిన ఆస్తులన్నీ పోవడంతో ఆమె ట్రీట్ మెంట్ కి అన్నా నగర్ వచ్చాక సంపాదించిన డబ్బునే వాడాల్సి వచ్చిందంటే జెమినీ ఆమె మీద పెట్టిన శ్రద్ధ ఏంటో అర్థమవుతుంది.అలా 596 రోజులపాటు చావుతో పోరాటం చేసిన మహా నటి చివరకి 1981 డిసెంబర్ 26 రాత్రి 10:30 గంటలకు ఆ చావుకి తలవంచాల్సి వచ్చింది.

ఏది ఏమైనా కోట్లాది మంది అభిమానాన్ని, డబ్బుని సంపాదించిన వెండితెర మహారాణి ఇలా దిక్కులేని చావడం తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఒక మాయని మచ్చనే చెప్పాలి.

also read:‘సంబరాల ఏటిగట్టు’కి బడ్జెట్ బ్రేకులు.. 2026లో కూడా కష్టమేనా?

Related News

యూట్యూబర్ ‘నందూస్ వరల్డ్’ దంపతులపై చీటింగ్ కేసు.. యూకే ఉద్యోగాల పేరిట భారీ వసూళ్లు

అభిమానిపై ‘రాకింగ్ స్టార్’ రియల్ ప్రేమా.. క్యాన్సర్ బాధితుడికి వీడియో కాల్ చేసిన యష్!

పెద్ది’ మూవీ రివ్యూ: రామ్ చరణ్ ఊరమాస్ జాతర.. బుచ్చిబాబు హిట్ కొట్టాడా?

పెద్ది ఓటీటీ లాక్….అప్పుడే డిజిటల్ స్ట్రీమింగ్ పై క్లారిటీ వచ్చేసిందిగా!

ప్రభాస్ ‘స్పిరిట్’ లొకేషన్ సెల్ఫీ లీక్.. లుక్ చూస్తే పూనకాలే!

బన్నీ-లోకేష్ కనగారాజ్ సినిమా క్యాన్సిల్ అయిందా? …. అసలు నిజం తెలిస్తే షాకవ్వాల్సిందే!

చరణ్ ‘పెద్ది’ బాక్సాఫీస్ బ్యాటింగ్ స్టార్ట్.. సమంత, వరుణ్ తేజ్ రివ్యూస్ వైరల్.. ‘మెగా 158’ టీమ్ స్పెషల్ విష్

పెద్ది’ రిలీజ్ వేళ రచ్చ.. రామ్ చరణ్ విగ్రహంపై దారుణంగా ట్రోల్స్, క్షమాపణలు చెప్పిన ఫ్యాన్స్!

Big Stories

×