Samantha : టాలీవుడ్ హీరోయిన్ సమంతకు ఘోర అవమానం జరిగింది. ఆమె రీసెంట్ గా జూబ్లీహిల్స్ లోని షోరూం ఓపెనింగ్ కి గెస్ట్ గా వెళ్లారు. ఆ షో రూమ్ ని ఓపెన్ చేసిన తర్వాత ఆమె తిరిగి మళ్లీ బయటకు రాబోతుంటే జనాలు ఆమెతో సెల్ఫీలు దిగేందుకు చుట్టుముట్టారు. సమంత ఎంతో ఓపికగా అక్కడ ఉన్న వారికి సెల్ఫీలు ఇచ్చింది. అయినా కూడా కొంతమంది ఆకతాయిలు ఆమెని తాకెందుకు ముందుకు వచ్చారు. అది గమంచిన సెక్యూరిటీ వాళ్లను ఆపే ప్రయత్నం చేశారు. నా పర్సనల్ సెక్యూరిటీతో చాలా ఇబ్బంది పడుతూ బయటికి వచ్చేసింది సమంత.. అందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.. ఈ వీడియోలను చూసిన సమంత అభిమానులు ఫీల్ అవుతున్నారు.. ఇక నెటిజన్లు మొన్న నిధి అగర్వాల్ కు, నేడు సమంతకు ఇలాంటి చేదు అనుభవం ఎదురవడం దారుణం అన్ని కామెంట్లు పెడుతున్నారు. హీరోయిన్లను ఒక కార్యక్రమానికి పిలిచినప్పుడు వాళ్ళని భద్రంగా చూసుకోవాల్సిన బాధ్యత ఆ కార్యక్రమా నిర్వాహకుల మీద ఉంటుంది. కానీ వాళ్లిలా సెక్యూరిటీని పెంచక పోవడం వల్లే హీరోయిన్లకు రక్షణ లేకుండా పోతుంది అని మరికొందరు నెటిజెన్లు కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది..
హీరోయిన్ సమంత సినిమాలతో పాటుగా కొన్ని షాపింగ్ మాల్స్ ఓపెనింగ్స్ చేస్తూ వస్తుంది. ఈ మధ్య సామ్ ఎక్కువగా మాల్స్ ఓపెనింగ్ చేస్తూ బాగా బిజీగా ఉంది. తాజాగా హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ దగ్గర ఓ షోరూమ్ ఓపెనింగ్‌కి ముఖ్య అతిథిగా హాజరైంది.. ఆ కార్యక్రమాన్ని ముగించుకొని తిరిగి బయటికి వెళ్తున్న సమయంలో సమంతను చూసేందుకు భారీగా జనం రావడంతో ఒక్కసారిగా తోపులాట కూడా జరిగింది. అక్కడున్న జనాల్లో కొందరు ఆమెతో సెల్ఫీలు దిగేందుకు ఎగబడ్డారు.. సమంత బయటకు వెళ్తున్న సమయంలో ఆకతాయిలో ఆమె చీర కొంగును లాగినట్లు వీడియోలో కనిపిస్తుంది. ఇక తన పర్సనల్ సెక్యూరిటీ సాయంతో సమంత అక్కడి నుంచి బయటపడింది. ఇదేవిధంగా మొన్న హైదరాబాద్ లోని ప్రముఖ మాల్ లూలూ మాల్ దగ్గర హీరోయిన్ నిధి అగర్వాల్ కు కూడా జరిగింది. వరుసగా ఇలాంటి ఘటనలు జరగడం ఇదే మొదటిసారి.. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది..
Also Read :జ్యోతిష్యుడు మాట విన్న మనోజ్.. ప్రభావతికి దిమ్మతిరిగే షాక్.. లక్ష కోసం ప్రభావతి ఆశ..
స్టార్ హీరోయిన్లకు మాత్రమే కాదు.. అటు హీరోలకు కూడా అదే పరిస్థితి కనిపిస్తుంది. సోషల్ మీడియా యుగంలో సెలబ్రిటీలతో ఫోటోలు దిగడం, దాన్ని షేర్ చేసి లైకులు, కామెంట్లు తెచ్చుకోవడం చాలా పెద్ద గొప్ప విషయంగా జనాలు మారుతున్నారు. దాంతో ఈమధ్య సెలబ్రిటీలు ఎక్కడ కనిపిస్తే అక్కడకు జనాలు అనుకున్నదానికన్నా ఎక్కువగా హాజరువుతున్నారు. భారీగా జనాలు తరలి రావడంతో అక్కడున్న బాడీగార్డ్లు కూడా వాళ్ళని కంట్రోల్ చేయలేకపోతున్నారు. అలాంటి సందర్భాల్లోనే ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. మరి దీనిపై జనాలు తీరు మారుతుందా..? షాపింగ్ మాల్ ఓనర్స్ వేరే మార్గాలను ఎంచుకుంటారా? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇకపోతే సమంత సినిమాల విషయానికొస్తే.. ఒకవైపు నిర్మాతగా సినిమాలను నిర్మిస్తూనే, మరోవైపు హీరోయిన్ గా సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. ప్రస్తుతం ఆమె ఓ లేడీ ఓరియెంటెడ్ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. అలాగే బాలీవుడ్ లో కూడా కొన్ని సినిమాలకు సైన్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే వీటి గురించి తెలిసే అవకాశం ఉంది.