E-Paper
Advertisement

Walking: ఒక నెల, రోజుకు 10 వేల అడుగులు.. బాడీలో జరిగే మార్పులు చూసి మీరే ఆశ్చర్యపోతారు !

Walking: ఒక నెల, రోజుకు 10 వేల అడుగులు.. బాడీలో జరిగే మార్పులు చూసి మీరే ఆశ్చర్యపోతారు !
Advertisement

Walking: వాకింగ్ చేయడం వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉంటాయో మనందరికీ తెలుసు. కానీ ప్రతిరోజూ 10 వేల అడుగులు నడవడం ప్రస్తుత లైఫ్ స్టైల్‌లో భాగంగా చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఒక నెల పాటు ఈ నియమాన్ని నిలకడగా పాటిస్తే.. శరీరంలో జీవక్రియ వేగవంతమై బరువు తగ్గడం సులభమవుతుంది. ఇది గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే కాకుండా.. రక్తపోటును అదుపులో ఉంచుతుంది. శారీరక మార్పులతో పాటు, మనస్సులో ఎండార్ఫిన్లు విడుదలై ఒత్తిడి తగ్గుతుంది. తద్వారా మానసిక ప్రశాంతత చేకూరుతుంది.కేవలం 30 రోజుల్లో మీలో పెరిగే శక్తి స్థాయిలు . ఆత్మవిశ్వాసం మీ జీవనశైలినే సరికొత్తగా మారుస్తాయి. ఇంకా శరీరంలో ఎలాంటి మార్పులు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

10 వేల అడుగులు నడిస్తే కలిగే ప్రయోజనాలు:

Advertisement

1. బరువు తగ్గడం:
ఒక నెల పాటు రోజూ 10 వేల అడుగులు నడవడం వల్ల శరీరం లోని అదనపు కేలరీలు కరుగుతాయి. ఇలా నడవడం ద్వారా రోజుకు 300 నుంచి 500 కేలరీలు ఖర్చవుతాయి. నెల చివరికి.. ఇది దాదాపు 10 వేల నుంచి 15వేలకు కేలరీలకు సమానం. దీని వల్ల శరీరంలోని కొవ్వు తగ్గి, బరువు తగ్గడానికి దోహద పడుతుంది. అలాగే.. మీ మెటబాలిజం రేటు పెరిగి, ఆహారం త్వరగా జీర్ణమవ్వడానికి సహాయపడుతుంది.

2. గుండె ఆరోగ్యం :
నడక అనేది ఒక అద్భుతమైన కార్డియో వ్యాయామం. ఒక నెల రోజుల నిరంతర నడక వల్ల గుండె కండరాలు దృఢంగా మారుతాయి. రక్త ప్రసరణ మెరుగుపడి, రక్తపోటు అదుపులోకి వస్తుంది. ఇది శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించి, మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతుంది. తద్వారా భవిష్యత్తు లో గుండె జబ్బులు వచ్చే ప్రమాదం తగ్గుతుంది.

Advertisement

3. మానసిక ప్రశాంతత:
నడవడం వల్ల శరీరంలో ఎండార్ఫిన్లు అనే “ఫీల్ గుడ్” హార్మోన్లు విడుదలవుతాయి. ఇవి మానసిక ఒత్తిడి, ఆందోళన, నిరాశను తగ్గించడంలో సహాయ పడతాయి. ఒక నెల పాటు ఈ నియమాన్ని పాటిస్తే.. మీలో సానుకూల దృక్పథం పెరుగుతుంది. ప్రకృతిలో నడవడం వల్ల మెదడుకు విశ్రాంతి దొరికి.. ఏకాగ్రత కూడా పెరుగుతుంది.

4. కండరాల బలం:
రోజూ నడవడం వల్ల కాళ్ళు, తుంటి, కోర్ కండరాలు బలోపేతం అవుతాయి. ఇది ఎముకల సాంద్రతను పెంచుతుంది. దీని వల్ల ఆర్థరైటిస్ వంటి సమస్యలు దరిచేరవు. ముఖ్యంగా కూర్చుని పని చేసేవారికి వచ్చే వెన్నునొప్పి, కీళ్ల నొప్పులు ఒక నెలలో గణనీయంగా తగ్గుతాయి.

Also Read: శాశ్వతంగా తెల్ల జుట్టును నల్లగా మార్చే పాతకాలపు చిట్కా ఇదే!

5. మెరుగైన నిద్ర:
క్రమం తప్పకుండా నడిచే వారిలో నిద్రలేమి సమస్య తగ్గుతుంది. శరీరం శారీరకంగా అలసి పోవడం వల్ల రాత్రి పూట గాఢ నిద్ర పడుతుంది. అలాగే.. రోజంతా మీరు గతంలో కంటే ఎక్కువ ఉత్సాహంగా, శక్తివంతంగా ఉన్నట్లు గమనిస్తారు.

6. రక్తంలో చక్కెర స్థాయిలు:
మధుమేహం ఉన్నవారికి లేదా వచ్చే అవకాశం ఉన్నవారికి 10 వేల అడుగుల నడక ఒక వరం లాంటిది. ఇది ఇన్సులిన్ సున్నితత్వాన్ని పెంచుతుంది. దీని వల్ల రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలు అదుపులో ఉంటాయి.

Related News

సండే స్పెషల్.. ఎప్పుడూ ఒకేలా కాకుండా మటన్‌ను ఇలా గ్రీన్‌గా వండి చూడండి.. వేళ్లు నాకేస్తారు!

అరకు ఫేమస్ బొంగు చికెన్.. తింటే జీవితంలో ఆ రుచిని మర్చిపోరు, ఎలా చేయాలో తెలుసా?

జంక్ ఫుడ్ తింటే క్యాన్సర్ రాదా? 4.6 లక్షల మందిపై జరిగిన అధ్యయనంలో షాకింగ్ విషయాలు!

మీ పిల్లాడు ఆలస్యంగా మాట్లాడుతున్నాడా? త్వరగా మాట్లాడేందుకు డాక్టర్ చెప్పిన టిప్స్ ఇవే

మీ జీవిత భాగస్వామిలో బలహీనతలే కాదు ఈ మంచి లక్షణాలు కూడా గమనించండి.. రిలేషన్‌షిప్‌లో చాలా ముఖ్యం

ఉదయం లేవగానే గర్ల్‌ఫ్రెండ్‌‌తో చాటింగ్ చేస్తున్నారా? ఈ 5 విషయాలు చెబితే బ్రేకప్ ప్రమాదం

52 ఏళ్ల వయసులో తల్లి కాబోతున్న ప్రముఖ నటి.. ఆ వయసులో గర్భం దాల్చడం ఆరోగ్యకరమేనా?

పిల్లల్లో డిప్రెషన్ ముప్పును తగ్గించే చిన్ననాటి అనుభవాలు ఇవే.. పేరెంట్స్ ఇవి తప్పక తెలుసుకోవాలి!

Big Stories

Advertisement
×