E-Paper
Advertisement

ప్రభాస్ మూవీ షూటింగ్ కి వెళ్తుండగా ఘోర ప్రమాదం.. ఒకరు మృతి..

ప్రభాస్ మూవీ షూటింగ్ కి వెళ్తుండగా ఘోర ప్రమాదం.. ఒకరు మృతి..
Advertisement

Fauji Movie :రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) హీరోగా ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ప్రొడక్షన్లో నిర్మితమవుతున్న చిత్రం ఫౌజీ. సీతారామం సినిమాతో ఊహించని పాపులారిటీ సొంతం చేసుకున్న హను రాఘవపూడి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా.. ప్రముఖ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఇమాన్వి ఇందులో హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. మొదట ఆగస్టులో ఈ సినిమాను రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేసినప్పటికీ.. కొన్ని కారణాలవల్ల ఈ సినిమాను సెప్టెంబర్ లోనైనా తీసుకురావాలని చూస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే షూటింగ్ ను కూడా శరవేగంగా జరుపుకుంటున్నారు. అయితే ఇలాంటి సమయంలో సడన్గా ఈ చిత్ర బృందానికి ఊహించని షాక్ తగిలింది.

ఫౌజీ సినిమా షూటింగ్ కి వెళ్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం..

ప్రస్తుతం ఈ సినిమా షూటింగు రామోజీ ఫిలిం సిటీ లో జరుగుతోంది. ఈ సినిమా సెట్స్ కి వెళ్తుండగా ప్రొడక్షన్ కారుకు ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. హైదరాబాద్ శివారులోని అబ్దుల్లాపూర్ మెట్ వద్ద ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ సినిమా షూటింగ్ కోసం ప్రొడక్షన్ యూనిట్ సభ్యులు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి ఒక్కసారిగా డివైడర్ ను బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో వాహనంలో మొత్తం ఆరుగురు ప్రయాణిస్తుండగా.. కారు డివైడర్ వేగానికి ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ కి చెందిన ఒక వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.ఇక మిగిలిన ఐదుగురు సభ్యులు తీవ్రంగా గాయపడడంతో గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు ఫోన్ చేసి వారి సహాయంతో చికిత్స నిమిత్తం సమీప హాస్పిటల్ కి తరలించారు.

ఒకరు మృతి .. పలువురికి గాయాలు..

Advertisement

ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం బాధితులు వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ప్రమాదం చోటు చేసుకోవడంతో చిత్రబృందం మొత్తం దిగ్భ్రాంతికి లోనయ్యింది. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అయితే కారు డివైడర్ ను ఢీ కొట్టడానికి అసలు కారణం ఏంటి అన్న విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. ప్రస్తుతం ఈ విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

ALSO READ:పెయిడ్ సబ్‌స్క్రిప్షన్ మొదలుపెట్టిన శ్రీ రెడ్డి.. 2 రోజుల్లోనే ఊహించని సబ్‌స్క్రైబర్స్!

షూటింగ్ కి బ్రేక్..

Advertisement

ఈ సినిమాని 1940 బ్యాక్ డ్రాప్ స్టోరీ తో తెరకెక్కిస్తున్నారు. ఈ ఏడాది దసరాకి థియేటర్లలోకి తీసుకురావాలని అనుకుంటున్న నేపథ్యంలో అందుకు తగ్గట్టుగానే షూటింగ్ కూడా చేస్తున్నారు. ఇంతలోనే ఇలాంటి సంఘటన జరగడం బాధాకరం అనే చెప్పాలి. ఏది ఏమైనా ఈ సినిమా షూటింగ్ కి కాస్త ఇప్పుడు బ్రేక్ పడిందని చెప్పవచ్చు.

 

Related News

కృష్ణాష్టమి రోజున కల నెరవేరిందంటున్న ఉపాసన.. పోస్ట్ వైరల్!

Shalini Pandey : బాపురే.. బాత్ రూమ్ వీడియోతో ‘అర్జున్ రెడ్డి’ బ్యూటీ రచ్చ.. తట్టుకోలేరమ్మ..!

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

Big Stories

Advertisement
×