Funky: మాస్ కా దాస్ విశ్వక్ సేన్ (Vishwak Sen), దర్శకుడు కె.వి. అనుదీప్ (KV Anudeep) కలయికలో రూపుదిద్దుకుంటోన్న చిత్రం ‘ఫంకీ’ (Funky). ఈ సినిమాపై ఎలాంటి అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మరో ‘జాతిరత్నాలు’ అవుతుందని అంతా ఊహిస్తున్నారు. ఎందుకంటే, ఇప్పటికే వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ అలాంటి ఫీల్‌ని ఇవ్వడంతో, కచ్చితంగా బాక్సాఫీస్ వద్ద మంచి సక్సెస్ ఫుల్ సినిమా అవుతుందని మేకర్స్ కూడా ఆశపడుతున్నారు. ప్రేమికుల దినోత్సవం కానుకగా ఒకరోజు ముందుగా ఫిబ్రవరి 13న థియేటర్లలో రాబోతున్న ఈ చిత్ర ప్రమోషన్స్‌ని మేకర్స్ యమా జోరుగా నిర్వహిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ ట్రెండింగ్‌లో ఉండగానే.. తాజాగా ఈ చిత్రం నుంచి మూడవ గీతం ‘యమ యమ్మ’ వీడియో సాంగ్ (Yama Yamma Video Song)ను తిరుపతిలో జరిగిన కార్యక్రమంలో మేకర్స్ విడుదల చేశారు. ఈ సాంగ్ ఎలా ఉందంటే…
Also Read- Indraja: రాణి భవానిదేవి పాత్రలో ఇంద్రజ.. యుద్ధం ఎవరితో అంటే?
సంక్రాంతికి వచ్చిన ‘మన శంకర వర ప్రసాద్ గారు’ సినిమాతో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న భీమ్స్ సిసిరోలియో ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఆయన స్వరపరిచిన ఈ మాస్ గీతం, విన్న వెంటనే హుషారును తెప్పించడంమే కాకుండా, కాలు కదిపేలా చేస్తోంది. దేవ్ పవార్ ఈ పాటకు సాహిత్యం అందించగా.. గాయని రోహిణి సోరట్‌తో కలిసి సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో ఈ పాటను ఆలపించారు. హీరోహీరోయిన్లు విశ్వక్ సేన్, కయాదు లోహర్ (Kayadu Lohar)పై చిత్రీకరించిన ఈ పాట.. మాస్ పాటల అభిమానులకు విందు భోజనంలా ఉండేలా ఆట సందీప్ మాస్టర్ కంపోజ్ చేశారు. ప్రస్తుతం ఈ పాట సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇప్పటికే వచ్చిన మొదటి పాట ‘ధీరే ధీరే’, రెండో పాట ‘రట్టాటటావ్’ చార్ట్‌బస్టర్స్‌గా నిలిచాయి. ఇప్పుడు ‘యమ యమ్మ’ కూడా అదే జోరును కొనసాగించి లిస్ట్‌లో నిలుస్తుందని మేకర్స్ భావిస్తున్నారు.
Also Read- Kangana Ranaut: కంగనా ఫ్లర్ట్ చేసినా, పట్టించుకోని నటుడెవరో తెలుసా?
ఈ సాంగ్ లాంఛ్ వేడుకలో మాస్ కా దాస్ విశ్వక్ సేన్ మాట్లాడుతూ.. ‘‘ఒక మంచి సినిమా అందించాలనే ఉద్దేశంతోనే.. దాదాపు సంవత్సరం విరామం తీసుకొని ఈ సినిమా చేశాను. ఈ చిత్రం ప్రేక్షకులందరినీ మెప్పిస్తుంది. ఇదొక క్లీన్ ఎంటర్‌టైనర్ చిత్రం. అందరూ మీ కుటుంబంతో కలిసి థియేటర్‌కి రండి. రెండు గంటల పది నిమిషాల పాటు అన్నీ మర్చిపోయి కడుపుబ్బా నవ్వుకుంటారు. ఫిబ్రవరి 13న థియేటర్లలో కలుద్దాం. ఈసారి అస్సలు నిరాశపరచను’’ అని చెప్పుకొచ్చారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రేక్షకుల అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా ‘ఫంకీ’ చిత్రం ప్రేక్షకులను నవ్వుల్లో ముంచెత్తడం ఖాయమని చిత్ర బృందం హామీ ఇస్తోంది.