E-Paper
Advertisement

OTT Releases This Week : ‘మన శంకర వర ప్రసాద్’ నుంచి ‘అనగనగా ఒక రాజు’ వరకు… ఈ వీకెండ్ తెలుగు సినిమాల పండగ

OTT Releases This Week : ‘మన శంకర వర ప్రసాద్’ నుంచి ‘అనగనగా ఒక రాజు’ వరకు… ఈ వీకెండ్ తెలుగు సినిమాల పండగ
Advertisement

OTT Releases This Week : వాలెంటైన్స్ డే వీక్ వచ్చేసింది. ఈ నేపథ్యంలోనే ఓటీటీలు కూడా ప్రేక్షకులను అలరించడానికి రొమాంటిక్ కంటెంట్ ను రెడీ చేసుకుంటున్నాయి. అందులోనూ ఈ వారం ప్రత్యేకంగా తెలుగు సినిమాల సందడి నడుస్తోంది. మరి అందులో భాగంగా ఈ వారం ఓటీటీలోకి వస్తున్న ఆ తెలుగు సినిమాలు, సిరీస్‌ల లిస్ట్ పై ఒక లుక్కేద్దాం పదండి.

గోల్డ్ అండ్ గీత (Gold & Geetha)

ఈటీవీ విన్‌ లో కథా సుధ సిరీస్‌ లో తాజాగా ‘గోల్డ్ & గీత’ అనే అడ్వెంచర్ డ్రామా చేరింది. అజయ్ కతువర్, ఆదిత్య, దక్షి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ తెలుగు షార్ట్ ఫిల్మ్‌కు గంగనమోని శేఖర్ దర్శకత్వం వహించారు. ఇది నిన్నటి నుండే ఓటీటీలో ప్రసారం అవుతోంది. మరి ఈ సిరీస్ కు ప్రేక్షకుల నుంచి ఎలాంటి ఆదరణ వస్తుందో చూడాలి.

మన శంకర వర ప్రసాద్ గారు (Mana Shankara Vara Prasad Garu)

Advertisement

మెగాస్టార్ చిరంజీవి తాజా సూపర్ హిట్ సినిమా ‘మన శంకర వర ప్రసాద్ గారు’. సంక్రాంతి కానుకగా థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీసు వద్ద దుమ్మురేపిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 11న ఏడు భారతీయ భాషల్లో ఓటీటీలో రిలీజ్ కానుంది. ZEE5 ఓటీటీలో డిజిటల్ అరంగేట్రం చేయబోతోంది. నయనతార కథానాయికగా నటించిన ఈ బ్లాక్‌ బస్టర్‌ కు అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. ఇప్పటికే థియేటర్లలో ఈ మూవీని చూసి ఎంజాయ్ చేసిన ఆడియన్స్, మరికొన్ని గంటల్లో ఎంచక్కా ఇంట్లోనే కూర్చుని ఎంజాయ్ చేయాలని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఫ్యామిలీ ఆడియన్స్ స్పెషల్ గా ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ గురించి వెయిట్ చేస్తున్నారు. ఇక థియేటర్లలో మిస్సైన వారి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

అనగనగ ఒక రాజు (Anaganaga Oka Raju)

టాలీవుడ్ యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి, మీనాక్షి చౌదరి ప్రధాన పాత్రల్లో నటించిన మూవీ ‘అనగనగా ఒక రాజు’. గోదావరి నేపథ్యంతో సాగే ఈ కామెడీ ఎంటర్‌టైనర్‌ థియేటర్లలో అలరించి పక్కా పండగ సినిమా అనిపించుకుంది. హీరో నవీన్‌ పొలిశెట్టి కామెడీ టైమింగ్ ఎప్పటిలాగే ఈ సినిమాలోనూ అదిరిపోయింది. మీనాక్షీ చౌదరి అందం, అభినయం ఇందులో స్పెషల్ అట్రాక్షన్. చమ్మక్‌ చంద్ర, ‘సంక్రాంతికి వస్తున్నాం’ ఫేమ్‌ బుల్లిరాజు, రావు రమేశ్‌ తదితరులు కీలక పాత్రలు పోషించిన ఈ సినిమాను దర్శకుడు మారి తెరకెక్కించారు. ఈ సినిమా జనవరి 14న విడుదల కాగా, 100 కోట్లకు పైగానే కలెక్ట్‌ చేసి అదరగొట్టింది. ఈ హిట్ చిత్రం ఫిబ్రవరి 11న ఐదు భాషల్లో నెట్‌ఫ్లిక్స్‌లో డిజిటల్ గా విడుదల కానుంది.

సంప్రదాయిని సుప్పిని సుద్దపూసని (Sampradayini Suppini Suddapoosani)

Advertisement

శివాజీ, లయ జంటగా మరోసారి కలిసి నటించిన మూవీ ‘సంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’. ఈ క్రైమ్ డ్రామాకి సుధీర్ శ్రీరామ్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా కూడా వాలెంటైన్స్ డే కానుకగా విడుదల కానుంది. ఇప్పటికే ETV Win ఫిబ్రవరి 12న ఈ చిత్రాన్ని స్ట్రీమింగ్ చేయబోతున్నట్టు అధికారికంగా ప్రకటించింది.

Also Read : స్టూడెంట్ ను వేధించే టీచర్… తల్లి ఇచ్చే ట్విస్ట్ కు ఫ్యూజులు అవుట్

Related News

This week OTT Releases : ఈ వారం ఓటీటీ లవర్స్ కు పండగే.. ఏకంగా 18 సినిమాలు స్ట్రీమింగ్..!

Weekend OTT Movies: వీకెండ్ సినిమాల సందడి.. వీటిని అస్సలు మిస్ అవ్వొద్దు..

రెండు రోజుల్లో నలుగురి మర్డర్… నిమిషానికో ట్విస్ట్ ఉన్న సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్

తల్లి టూర్లో, తండ్రికి చుక్కలు చూపించే పిల్లలు… పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్

క్రేజీ సిరీస్ కు సినిమాతో ఎండ్ కార్డు… లాంగ్-డిస్టెన్స్ రిలేషన్‌షిప్లో ఉన్నవాళ్ళు డోంట్ మిస్

చెరువులో బాలుడి శవం… దేవుడికి ఆచారాల పేరుతో గుండె జారిపోయే పనులు

తండ్రి చావుకు కారణమైన వాళ్ళను వేటాడే ఖతర్నాక్ లేడీ… యాక్షన్ తో పిచ్చెక్కించే మూవీ

తండ్రికి మించిన తనయుడు… కానీ తలనొప్పే… మిస్ అవ్వకుండా చూడాల్సిన స్పోర్ట్స్ కామెడీ సిరీస్

Big Stories

Advertisement
×