E-Paper
Advertisement

Globe Trotter Event: జియో హాట్ స్టార్ లో గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్ మిస్ అయ్యారా.. ఫ్రీగా వచ్చేసింది.. ఇక్కడ చూడండి

Globe Trotter Event: జియో హాట్ స్టార్ లో గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్ మిస్ అయ్యారా.. ఫ్రీగా వచ్చేసింది.. ఇక్కడ చూడండి
Advertisement

Globe Trotter Event: సూపర్ స్టార్ మహేష్ బాబు.. గుంటూరు కారం తర్వాత నటిస్తున్న చిత్రం SSMB29. దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అభిమానులే మాత్రమే కాదు ప్రపంచం మొత్తం ఎంతగానో ఎదురుచూస్తుంది. రెండేళ్ల క్రితమీ ఈ సినిమాను ప్రకటించినా నవంబర్ వరకు ఎలాంటి అప్డేట్ అందించలేదు. ఇక ఎప్పుడు ఎప్పుడు ఈ సినిమా నుంచి ఒక్క అప్డేట్ అయినా రాజమౌళి ఇస్తాడు అని అభిమానులు ఎంతగానో ఎదురు చూసారు. ఎట్టకేలకి ఈ నవంబర్ ఆ ఎదురు చూపులకు తెరదించింది.

ఈ మధ్యనే గ్లోబ్ ట్రోటర్ అనే పేరుతో రాజమౌళి రామోజీ ఫిలిం సిటీల ఒక పెద్ద ఈవెంట్ ను నిర్వహించిన విషయం తెలిసిందే. ఇక ఈవెంట్ ని కూడా ఎంతో గ్రాండ్ గా ప్లాన్ చేశారు. ఎలాంటి అనర్ధాలు జరగకుండా ముందుగానే అభిమానులకు పాస్ పోర్టులు ఇచ్చి ఎలాంటి రాద్ధాంతం చేయకుండా గట్టి కట్టుదిట్టమైన భద్రతలను తీసుకున్నారు. ఇక ఇందులో చాలా హైలెట్స్ ఉన్నాయి అని చెప్పుకొచ్చారు. దీంతో ప్రతి ఒక్కరు ఈవెంట్ కి వెళ్ళాలి అనుకున్నారు .కానీ పాస్ పోర్ట్ ఉన్నవారు తప్ప మిగతావారు వెళ్లడానికి వీల్లేదు అని తెలియడంతో అభిమానులు చాలా నిరాశకు గురయ్యారు.

Advertisement

అయితే జియో హాట్ స్టార్  గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్ ను చూడవచ్చని మేకర్స్ తెలిపారు. కానీ ఆరోజు లైవ్ కూడా అంతంతమాత్రంగానే వచ్చింది. తరువాత అయినా మహేష్ స్పీచ్ లు కానీ, ఈవెంట్ హైలెట్స్ కానీ ఎక్కడ కనిపించలేదు. దీంతో ఈవెంట్ ను లైవ్ చూడని అభిమానులు ఎంతగానో నిరాశ చెందారు. కానీ ఇప్పుడు ఆ సమస్య లేదు.

ఎట్టకేలకు గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్ యూట్యూబ్ లోకి వచ్చేసింది. అప్పుడు చూడని అభిమానులు ఇప్పుడు ఎంచక్కా యూట్యూబ్ లో ఫ్రీగా చూడొచ్చు.  ప్రస్తుతం ఈ వేడుకకు సంబంధించిన వీడియో యూట్యూబ్ లో వైరల్ గా మారింది. ఇక ఈ సినిమాకు వారణాసి అనే టైటిల్ రాజమౌళి కన్ఫమ్ చేశాడు. ఈవెంట్లో హైలెట్ గా చెప్పుకోవాల్సిన విషయాలు ఏమైనా ఉన్నాయి అంటే..  ప్రియాంక చోప్రా దేశి గర్ల్ కు తగ్గట్లే వైట్ అండ్ వైట్ లెహంగాలో నడుచుకుంటూ రావడం, కీరవాణి పోకిరి స్టైల్ లో కుంభ గురించి హైప్ ఇవ్వడం,రాజమౌళి స్పీచ్.. అన్నిటికి మించి మహేష్ బాబు నందిపై రావడం, స్పీచ్  ఇవన్నీ ఈవెంట్ లో  హైలెట్  గా నిలిచాయి. మరి ఇంకెందుకు ఆలస్యం ఈవెంట్ ను యూట్యూబ్ లో వీడియో చూసేయండి.

Advertisement

Related News

భాయ్ చిక్కిపోయాడని ఏడ్చేసిన ఫ్యాన్స్.. రివర్స్ సెటైర్ వేసిన సల్మాన్ !

రికార్డుల వేటలో ‘ది ఒడిస్సీ’..మన మేకర్స్ ఇప్పటికైనా మారతారా?

విదేశాల్లో షాట్లు.. ఏపీలో ఓట్లు! టాలీవుడ్ స్టార్స్‌పై అంబికా కృష్ణ మార్కు కౌంటర్లు!

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

Big Stories

Advertisement
×