E-Paper
Advertisement

బాలయ్య NBK 111కు మాస్ టైటిల్..వైరల్ అవుతున్న వీడియో!

బాలయ్య NBK 111కు మాస్ టైటిల్..వైరల్ అవుతున్న వీడియో!
Advertisement

NBK 111 Movie: నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం పలు సినిమాలకు కమిట్ అవుతూ కెరియర్ పరంగా బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఈయన గత ఏడాది అఖండ 2 సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ అనుకున్న స్థాయిలో ఈ సినిమా ప్రేక్షకాదరణ నోచుకోలేకపోయింది. ఈ నేపథ్యంలోనే తదుపరి సినిమాపై బాలయ్య అభిమానులు ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. ఇదివరకే డైరెక్టర్ గోపిచంద్ మలినేని (GopiChand Malineni)దర్శకత్వంలో బాలకృష్ణ (Balakrishna)నటించిన వీర సింహారెడ్డి సినిమా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు మరోసారి వీరిద్దరి కాంబినేషన్లో సినిమా రాబోతున్న నేపథ్యంలో ఈ సినిమాపై కూడా అదే అంచనాలు ఉన్నాయి.

NBK 111 టైటిల్ అనౌన్స్మెంట్..

గోపీచంద్ డైరెక్షన్లో బాలకృష్ణ నటిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం NBK 111 అనే వర్కింగ్ టైటిల్ తో షూటింగ్ పనులను జరుపుకుంటుంది. అయితే తాజాగా చిత్ర నిర్మాతలు ఈ సినిమాకు సంబంధించి ఒక కీలక అప్డేట్ తెలియజేశారు. టీజర్ గ్లింప్ విడుదల చేస్తూ ఈ సినిమాకు సంబంధించిన ఒక బిగ్ అప్డేట్ సెప్టెంబర్ ఆరో తేదీ రాబోతుందని తెలియజేశారు. బహుశా అదే రోజు టైటిల్ విడుదల చేయబోతున్నారని తెలుస్తుంది. అయితే ఈ సినిమాకు సంబంధించి రెండు టైటిల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

‘దాదా’ గా బాలయ్య..

Advertisement

బాలకృష్ణ గోపీచంద్ మలినేని కాంబినేషన్లో రాబోతున్న ఈ సినిమాకు “గాడ్”(God) లేదా “దాదా”(Dada)అనే టైటిల్స్ పరిశీలనలో ఉన్నాయని తెలుస్తోంది. ఈ రెండు టైటిల్స్ లో ఏదో ఒకటి చిత్ర నిర్మాతలు ఫైనల్ చేయబోతున్నారని టాలీవుడ్ సమాచారం. మరి nbk 111 కు ఎలాంటి టైటిల్ పెట్టబోతున్నారు అనేది తెలియాలి అంటే సెప్టెంబర్ ఆరో తేదీ వరకు ఎదురుచూడాల్సిందే. ఇక ఈ సినిమాలో బాలయ్యకు జోడిగా నటి కాజల్ అగర్వాల్ నటించబోతున్నారని సమాచారం ముందుగా ఈ సినిమాలో నయనతార ఎంపిక అయినప్పటికీ ఈ సినిమా కథలో మార్పులు చేసిన నేపథ్యంలో నయనతార తప్పుకున్నట్టు వార్తలు వచ్చాయి.

Advertisement

ఇక వృద్ధిస్ సినిమాస్ బ్యానర్ పై వెంకట సతీష్ కిలారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎస్ ఎస్ తమన్ ఈ సినిమాకు సంగీతం అందించగా, ఇందులో మంచు మనోజ్ ,సంజయ్ దత్, శరత్ కుమార్ సముద్రఖని వంటి తదితరులు కీలకపాత్రలలో నటించబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పనులు పూర్తి కావాల్సి ఉండగా కాస్త ఆలస్యంగా ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. అదే విధంగా ఇటీవల బాలకృష్ణకు సర్జరీ కావడంతో షూటింగ్ కు చిన్న విరామం ఇచ్చారు. ఇక బాలకృష్ణ మరో దర్శకుడు కొరటాల శివ డైరెక్షన్ లో కూడా ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అతి త్వరలోనే ఈ సినిమా షూటింగ్ పనులు ప్రారంభం కానున్నాయి.

Also Read: రఘు మాస్టర్ ఎంపిక చెల్లదు… సుమలత సంచలన వ్యాఖ్యలు!

Related News

ఈ జనరేషన్‌కు మరో బ్రహ్మానందం దొరికేశాడు.. కోనా వెంకట్ కామెంట్స్!

గ్లామర్ మాత్రమే కాదు.. చీరకట్టులోనూ త్రిష అందం అదుర్స్!

రజనీకాంత్‌కు తిరుగులేదుగా.. ‘జైలర్ 2’ కలెక్షన్ల లెక్క ఇదే!

గ్యాంగ్‌స్టర్ సినిమా అనుకుంటే.. చిరంజీవి సినిమాలో అసలు ట్విస్ట్ ఇదే!

రేవంత్ రెడ్డి, కేసీఆర్‌తో పరిచయాలున్నా.. ఆ పని మాత్రం చేయలేదు!

స్పెషల్ అట్రాక్షన్ గా రణబీర్ వాచ్.. రాముడు, హనుమంతుడితో ప్రత్యేక డిజైన్..

దాసరి సినిమా షూటింగ్‌లో అసలేం జరిగింది? దివ్యవాణి బయటపెట్టిన విషయాలు

రణబాలి విషయంలో నేను చెప్పిందే జరిగింది.. విజయ్ కామెంట్స్ వైరల్!

Big Stories

Advertisement
×