E-Paper
Advertisement

మనసును తాకే అందమైన ప్రేమకథ… ఫ్యామిలీ అంతా కలసి చూడదగ్గ ఫీల్ గుడ్ ఎంటర్‌టైనర్

మనసును తాకే అందమైన ప్రేమకథ… ఫ్యామిలీ అంతా కలసి చూడదగ్గ ఫీల్ గుడ్ ఎంటర్‌టైనర్
Advertisement

Youthful Romantic Comedy: కాలేజీ రోజుల నుంచే ప్రేమించిన అమ్మాయినే పెళ్లి చేసుకోవాలని కలలు కనే ఓ యువకుడు… చివరకు పెద్దలను ఒప్పించి పెళ్లి చూపులు కూడా ఏర్పాటు చేస్తాడు. కానీ పెళ్లికి కేవలం 23 రోజులు మాత్రమే ఉండగా… ఆ అమ్మాయి పెళ్లికే నో చెబితే ? ప్రేమ ఉన్నా, పెళ్లి అనే బంధంపై భయం ఉంటే ? ఆ భయాన్ని పోగొట్టి తన ప్రేమను గెలిపించుకోవడానికి అబ్బాయి చేసే ప్రయత్నాలేంటి ? ప్రేమ, పెళ్లి, కమిట్‌మెంట్ భయం చుట్టూ సరదాగా సాగే లవ్ స్టోరీనే ‘నందిని’ (Nandhini). మరి ఈ చిత్రం కథేంటి? ఎక్కడ చూడొచ్చు? అనే వివరాలపై ఓ లుక్కేద్దాం పదండి.

కథలోకి వెళ్తే…

శివకు కాలేజీ రోజుల నుంచే నందిని అంటే చాలా ఇష్టం. ఆమెను మనస్ఫూర్తిగా ప్రేమించినా… ఆ విషయాన్ని నేరుగా చెప్పే ధైర్యం మాత్రం ఉండదు. చివరకు పెద్దలను ఒప్పించి నందినితో పెళ్లి చూపులు ఏర్పాటు చేయిస్తాడు. శివ మంచితనం నచ్చడంతో నందిని కుటుంబ సభ్యులు కూడా ఈ పెళ్లికి ఓకే చెబుతారు. దీంతో పెళ్ళికి అంతా సిద్ధం అవుతుంది.

Advertisement

అంతా సెట్ అయిపోయిందనుకునే సమయంలో అసలు ట్విస్ట్ మొదలవుతుంది. పెళ్లికి ఇంకా 23 రోజులు మాత్రమే ఉన్నా… నందిని మాత్రం పెళ్లికి సిద్ధంగా ఉండదు. కారణం ప్రేమపై ఇష్టం లేక కాదు. ఆమెకు కమిట్‌మెంట్ అంటేనే భయం. పెళ్లి తర్వాత జీవితం ఎలా మారుతుందో, ఒక బంధంలో చిక్కుకుపోతానేమోనన్న భయం ఆమెను వెంటాడుతుంటుంది.

ఇక నందిని మనసులో ఉన్న ఈ భయాన్ని అర్థం చేసుకున్న శివ… ఆమెను బలవంతం చేయకుండా తన ప్రేమతో గెలుచుకోవాలని నిర్ణయించుకుంటాడు. పెళ్లికి ఉన్న కొద్ది రోజుల్లోనే ఆమె భయాలను పోగొట్టేందుకు ప్రయత్నిస్తాడు. ఈ క్రమంలో శివ, నందినిల మధ్య జరిగే సరదా సంభాషణలు, చిన్న చిన్న అలకలు, అపార్థాలు కథను ఫీల్‌గుడ్‌గా నడిపిస్తాయి. ఒకవైపు శివ తన ప్రేమను నిరూపించుకోవాలని ప్రయత్నిస్తుంటే… మరోవైపు నందిని తన భయాలను ఎదుర్కోవాల్సి వస్తుంది.

Advertisement

అసలు నందినికి కమిట్‌మెంట్‌పై ఇంత భయం ఎందుకు ? శివ నిజమైన ప్రేమతో ఆమె మనసును మార్చగలిగాడా ? 23 రోజుల్లోనే నందిని తన నిర్ణయాన్ని మార్చుకుందా ? చివరికి వీళ్ల ప్రేమ పెళ్లి పీటల వరకు వెళ్లిందా ? అనేదే ఈ కథలో ఆసక్తిగా చూడాల్సిన విషయం.

తెలుగులో ఎక్కడ చూడొచ్చు ?

‘నందిని’ ఈటీవీ విన్ (ETV Win) ఒరిజినల్ సిరీస్ ‘కథా సుధ’లో భాగంగా విడుదలైన యూత్‌ఫుల్ లవ్ అండ్ రొమాంటిక్ కామెడీ లఘు చిత్రం. ప్రముఖ దర్శకుడు కె. రాఘవేంద్రరావు సమర్పణలో తెరకెక్కిన ఈ చిత్రానికి రామారావు సిరిపురం దర్శకత్వం వహించారు. ఆకాంక్ష, పవన్ సింగులూరి ప్రధాన పాత్రల్లో నటించగా, మీనా వాసు, శరణ్య, నళిని దేవి కీలక పాత్రల్లో కనిపిస్తారు. సంగీతం సాయి కార్తీక్ అందించారు. ఓటీటీలో ఓ మంచి ఫీల్ గుడ్ డ్రామాను వెతుకుతున్న వాళ్ళకి ఈ మూవీ బెస్ట్ ఆప్షన్.

Read Also: మొగుడు పెళ్లాల మధ్యలోకి వచ్చి ముంచేశాడు… క్లైమాక్స్‌లో ఊహించని డ్రామా… తెలుగులో ఇంగ్లీష్ సిరీస్

Tags

Related News

కార్గిల్‌ యుద్ధంలో పక్షవాతం… ఓటమిని ఒప్పుకోని నిజమైన యోధుడి కథ… గూస్ బంప్స్ స్టోరీ భయ్యా

మాఫియా గ్యాంగ్‌ చేతికి చిక్కిన పురాతన నిధి మ్యాప్‌… డేంజరస్ అడ్వెంచర్ లో కామెడీ కూడా

అత్తింట్లోనే దెయ్యాల వేట… ఒక్కొక్కరినీ రాక్షసులుగా మార్చే దుష్టశక్తి… తెలుగులోనూ హారర్ మూవీ

డెత్‌ లిస్ట్‌లో ఒకే కుటుంబం… ఒక్కొక్కరినీ మృత్యువు వేటాడే హారర్‌ ఫ్రాంచైజీ కొత్త అధ్యాయం స్ట్రీమింగ్

మోనాలిసా పెయింటింగ్‌ కొట్టేయడానికి మాస్టర్‌ప్లాన్‌… ఫ్యామిలీ ఫ్యామిలీకి ఇదే పనా ? క్రేజీ క్రైమ్ కామెడీ

కాలేజీ క్యాంపస్‌లో డ్రగ్స్‌ కలకలం… గ్యాంగ్‌స్టర్‌ ఎంట్రీతో అడ్డం తిరిగే కథ… క్రైమ్‌, కామెడీ కలిసిన మలయాళ మూవీ

జర్నలిస్ట్ మిస్సింగ్ తో తీవ్ర కలకలం… కట్ చేస్తే దిమ్మతిరిగే ట్విస్ట్… మలయాళ క్రైమ్ థ్రిల్లర్‌ ఓటీటీలోకి

జైలర్ 2 వచ్చేది ఆ ఓటీటీలోనే..స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!

Big Stories

Advertisement
×