E-Paper
Advertisement

Ustaad Bhagath Singh : పవన్ ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించే న్యూస్.. కొత్త రిలీజ్ డేట్ ఇదే..?

Ustaad Bhagath Singh : పవన్ ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించే న్యూస్.. కొత్త రిలీజ్ డేట్ ఇదే..?
Advertisement

Ustaad Bhagath Singh : టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం నటిస్తున్న తాజా చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్.. గతంలో బ్లాక్ బాస్టర్ హిట్ అందుకున్న గబ్బర్ సింగ్ తర్వాత హరీష్ శంకర్ డైరెక్షన్ లో రాబోతున్న సినిమా రావడంతో అంచనాలు ఈ సినిమాపై ఎక్కువగానే ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. అయితే సినిమా నుంచి పోస్టర్లు తప్ప పెద్దగా అప్డేట్స్ బయటికి రాలేదు. సోషల్ మీడియాలో ఈ సినిమా రిలీజ్ డేట్ పై రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి.. తాజాగా ఈ మూవీ నుంచి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది. అది ఏంటంటే సినిమాకు రెండు రిలీజ్ డేట్స్ అనుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అందులో ఏదొక డేట్ ను లాక్ చేసుకొనే అవకాశం ఉన్నట్లు టాక్.. ఇంతకీ ఆ డేట్స్ ఏవో వివరాల్లోకి వెళ్లి తెలుసుకుందాం..

ఉస్తాద్ భగత్ సింగ్ కొత్త రిలీజ్ డేట్..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఒక వైపు రాజకీయాలతో బిజీగా ఉన్నా సరే మరోవైపు మాత్రం ఆయన కమిటైన సినిమాలను పూర్తి చేశాడు… చివరగా వచ్చిన ఓజీ మూవీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.. ప్రస్తుతం ఆయన నటిస్తున్న చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్.. టాలీవుడ్ మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. కొన్ని రోజుల క్రితమే ఈ సినిమా షూటింగు పూర్తయిన విషయం తెలిసిందే. అయితే సినిమా షూటింగ్ ఆలస్యం అవ్వడంతో మూవీ రిలీజ్ డేట్ పై సంధిగ్ధం ఏర్పడింది. తాజాగా ఈ చిత్రం రిలీజ్ డేట్ పై ఒక క్లారిటీ వచ్చేసింది. దీనికి రెండు రిలీజ్ డేట్స్ అనుకుంటున్నట్లు తెలుస్తుంది. అందులో ఒకటి మార్చి 27, రెండోది ఏప్రిల్ 23.. మార్చిలో రామ్ చరణ్ నటించిన పెద్ది మూవీ రిలీజ్ కాబోతుంది. బాబాయి అబ్బాయి మధ్య పోటీ వద్దనుకుంటే మాత్రం ఏప్రిల్ 23 న సినిమా వచ్చే అవకాశం ఉంది. త్వరలోనే ఈ మూవీ రిలీజ్ డేట్ పై అధికారిక ప్రకటన రాబోతున్నట్లు సమాచారం.

Advertisement

Also Read :ఎన్టీఆర్ – నీల్ చిత్రానికి మరోసారి బ్రేక్.. ఇప్పటిలో సినిమా లేనట్లే..?

భగత్ సింగ్ పై పెరుగుతున్న అంచనాలు.. 

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, హీరోగా రాశి ఖన్నా అలాగే శ్రీలీల హీరోయిన్స్ గా దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్న అవైటెడ్ చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్.. మాస్, యాక్షన్ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ మూవీ కోసం పవన్ అభిమానులు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కి ఆ మధ్య నిర్మాత నుంచి ఏప్రిల్ రిలీజ్ ఉంటుంది అని కన్ఫర్మ్ చేశారు.. మార్చిలో రామ్ చరణ్ సినిమా ఉండడంతో ఏప్రిల్ లోనే 23 లేదా 24 తేదీలలో ఏదో ఒక తేదీని కన్ఫామ్ చేసే అవకాశం ఉన్నట్లు సినీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. మరి వీటిలో ఎంతవరకు నిజం ఉంది అనేది వేచి చూడాలి.. ఇక ఈ మూవీలో తమిళ నటుడు పార్తిబన్ ఈ సినిమాలో విలన్ గా నటించారు. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు..

Related News

ఐశ్వర్య రాజేష్ మొరను ఆలకించిన డైరెక్టర్.. బాలయ్య మూవీలో క్రేజీ రోల్!

‘విక్రమ్ 1’ ర్యాకెట్ ప్రయోగంలో జబర్దస్త్ సత్యశ్రీ చెల్లి కీలక పాత్ర.. ఆ ఫొటోలు షేర్ చేస్తూ నటి ఎమోషనల్!

నటిగా పీవీ సింధు.. ఆసక్తిని రేకెత్తిస్తున్న పోస్ట్!

చిన్న వయసులోనే గొప్ప మనసు చాటుకున్న సితార.. మహేష్ బాబు ఎమోషనల్ పోస్ట్!

టాలీవుడ్ లో నేషనల్ అవార్డు అందుకున్న తొలి చైల్డ్ ఆర్టిస్ట్ ఎవరంటే?

భాయ్ చిక్కిపోయాడని ఏడ్చేసిన ఫ్యాన్స్.. రివర్స్ సెటైర్ వేసిన సల్మాన్ !

రికార్డుల వేటలో ‘ది ఒడిస్సీ’..మన మేకర్స్ ఇప్పటికైనా మారతారా?

విదేశాల్లో షాట్లు.. ఏపీలో ఓట్లు! టాలీవుడ్ స్టార్స్‌పై అంబికా కృష్ణ మార్కు కౌంటర్లు!

Big Stories

Advertisement
×