E-Paper
Advertisement

Euphoria Trailer: వాస్తవికతకు అద్దంపట్టేలా యుఫోరియా ట్రైలర్!

Euphoria Trailer: వాస్తవికతకు అద్దంపట్టేలా యుఫోరియా ట్రైలర్!
Advertisement

Euphoria Trailer: ప్రముఖ స్టార్ హీరోయిన్ సమంత (Samantha ) హీరోగా.. గుణశేఖర్ (Gunasekhar)దర్శకత్వంలో వచ్చిన చిత్రం శాకుంతలం. అయితే ఈ సినిమా డిజాస్టర్ తర్వాత ఇన్నాళ్లకు వాస్తవికతను ఆధారంగా చేసుకొని ప్రస్తుత సమాజ పరిస్థితులకు అద్దం పట్టేలా యుఫోరియా (Euphoria )అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు గుణశేఖర్. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకోవడమే కాకుండా ఆసక్తిని కలిగిస్తోంది అని చెప్పవచ్చు. ఇకపోతే తాజాగా ధురంధర్ సినిమాతో భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న ప్రముఖ బ్యూటీ సారా అర్జున్ (Sara Arjun) ప్రధాన పాత్రలో వస్తున్న ఈ సినిమాలో నాజర్, భూమిక చావ్లా, గౌతమ్ మీనన్, ఆదర్శ్ బాలకృష్ణ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేయగా ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంటోంది.

ఆకట్టుకుంటున్న యుఫోరియా ట్రైలర్..

ట్రైలర్ విషయానికి వస్తే.. సమాజంలో ప్రస్తుతం యువత ఎదుర్కొంటున్న డ్రగ్స్ సమస్యలు , క్రైమ్ నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించారు. ముఖ్యంగా ట్రైలర్లో ఆ ఎలిమెంట్స్ ని ఎక్కువగా చూపించడం గమనార్హం. ఇకపోతే ఈ సినిమాలో మైనర్ క్రైమ్ , పోక్సో తో పాటు ఈ మధ్యకాలంలో అమ్మాయిలపై జరుగుతున్న అఘాయిత్యాలను అన్నింటిని ఆధారంగా చేసుకొని గుణశేఖర్ చాలా అద్భుతంగా నేటివిటీకి తగ్గట్టుగా ఈ సినిమాను రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తానికైతే కరెంటు టాపిక్స్ తో ఆడియన్స్ లో సరికొత్త ఆలోచనలను రేకెత్తిస్తూ సమాజానికి మంచి మెసేజ్ ఇవ్వబోతున్నారు అని అయితే చెప్పవచ్చు. ముఖ్యంగా ఒక్క మాటలో చెప్పాలంటే ఈ ఒక్క ట్రైలర్ సినిమాపై అంచనాలను భారీగా పెంచేసింది.

ఫిబ్రవరి 6న యుఫోరియా..

Advertisement

ఇకపోతే ఫిబ్రవరి 6వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రాన్ని గుణ హ్యాండ్ మేడ్ ఫిలిమ్స్ బ్యానర్ పై నీలిమ గుణ నిర్మిస్తున్నారు. ఇకపోతే ఈ చిత్రానికి కాలభైరవ సంగీతాన్ని అందిస్తున్నారు. ముఖ్యంగా ఇందులో ధురంధర్ సినిమాతో ఓవర్ నైట్ లోనే స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్న సారా అర్జున్ హీరోయిన్గా నటిస్తుండడంతో అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఇకపోతే శాకుంతలం డిజాస్టర్ తర్వాత వస్తున్న సినిమా కావడంతో మరి ఈ సినిమా ఏ విధంగా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందో చూడాలి.

ALSO READ:Tollywood: నాగార్జునతో అనిల్ నెక్స్ట్ సంక్రాంతి ఫిక్స్.. మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటంటే?

తన ఫేవరెట్ తెలుగు హీరో అతడే అంటున్న సారా అర్జున్..

Advertisement

ఇదిలా ఉండగా ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో పాల్గొన్న సారా అర్జున్.. తెలుగులో తనకు ఇష్టమైన హీరో ఎవరో చెప్పి అభిమానులను సంతోషపరిచింది. ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో భాగంగా మీకు ఇష్టమైన తెలుగు హీరో ఎవరు? అని ప్రశ్నించగా.. సారా అర్జున్ మాట్లాడుతూ..” ఇప్పట్లో చాలామంది హీరోలు నా ఫేవరెట్. కాకపోతే రౌడీ హీరో విజయ్ దేవరకొండ అంటే మరింత ఇష్టం” అంటూ తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చింది. మొత్తానికైతే సారా అర్జున్ చేసిన ఈ కామెంట్లకు రౌడీ హీరో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Related News

ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు చిత్రం ఏంటో తెలుసా?

నేషనల్ అవార్డ్స్ రేసులో ధనుష్ రికార్డ్… ‘కలాం’ బయోపిక్‌పై హైప్!

ఆ హీరోతో అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్?

Sharmiela mandre :చడీ చప్పుడు లేకుండా పెళ్లి చేసుకున్న అల్లరి నరేష్ హీరోయిన్.. వరుడు ఎవరంటే?

38ఏళ్ల తర్వాత తండ్రి నాగబాబు రికార్డును రిపీట్ చేసిన నిహారిక!

సైలెంట్ గా నిశ్చితార్థం.. పెళ్లికి సిద్ధమైన టాలీవుడ్ హీరో!

కళ్ళు లేవు.. మైమరిపించే గాత్రానికి నేషనల్ అవార్డు.. ఎవరీ సింగర్?

విజువల్ వండర్ గా రామాయణ ట్రైలర్.. అఫీషియల్ ఎప్పుడంటే?

Big Stories

Advertisement
×