Redmi Buds 8 Lite: కొంతకాలంగా వినియోగదారుల్లో మంచి క్రేజ్‌ను పెంపొందించుకున్న ప్రముఖ టెక్ సంస్థ షావోమీ తమ రెడ్‌మీ నుంచి సరికొత్త బడ్జెట్ ట్రూ వైర్లెస్ ఇయర్ బడ్స్‌ను గ్లోబల్ మార్కెట్‌లో విడుదల చేసింది. Redme Buds 8 Lite పేరుతో అందుబాటులోకి వచ్చిన ఈ డివైజ్‌ను రోజూ నాన్‌స్టాప్‌గా ఉపయోగించే యూజర్లను దృష్టిలో పెట్టుకుని రూపొందించినట్లు తెలుస్తోంది. తక్కువ ధరలోనే హై ఫీచర్లు కలిగిన ఈ ఇయరబడ్స్ ఇప్పటికే ట్రెండ్ సెట్ చేస్తున్నాయి.
ఈ ఇయర్‌బడ్స్‌లో 12.4mm టైటానియం డయాఫ్రామ్ డైనమిక్ డ్రైవర్ ఉంది. దీని వల్ల ఆడియో ఎలాంటి నాయిస్ లేకుండా స్పష్టంగా వినిపిస్తుందని కంపెనీ చెబుతోంది. ఇక కనెక్టివిటీ కోసం బ్లూటూత్ 5.4 సపోర్ట్ అందించగా.. AAC, SBC కోడెక్స్‌కు కూడా సపోర్ట్ చేస్తుంది.
Also Read: ఐఫోన్‌కు గట్టి పోటీ ఇచ్చేలా భారత మార్కెట్లోకి ‘మోటరోలా సిగ్నేచర్’ వచ్చేస్తోంది!
ఇక నాయిస్ కంట్రోల్ విషయానికి వస్తే.. దీనిలో హైబ్రిడ్ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ (ANC) ఫీచర్ ఉంది. మాట్లాడేటప్పుడు, అవతలి వాళ్లు మాట్లాడుతున్నది వినేటప్పుడు మైక్రోఫోన్ల సాయంతో చాలా స్పష్టంగా వినవచ్చు. దీని కోసం ఈ ఇయర్‌బడ్స్ 42dB వరకు వైడ్ ఫ్రీక్వెన్సీ నాయిస్ క్యాన్సిలేషన్ అందిస్తుంది. అలాగే ట్రాన్స్‌పరెన్సీ మోడ్ కూడా ఉండటంతో.. ఇయర్‌బడ్స్ చెవిలో నుంచి తీయకుండానే బయటి శబ్దాలు కూడా వినిపిస్తాయి.
ఫోన్ మాట్లాడే సమయంలోనూ స్పష్టమైన వాయిస్ కోసం డ్యుయల్ మైక్ AI ENC టెక్నాలజీనీ ఈ బడ్స్‌లో ఉపయోగించారు. ఇది మీ వాయిస్‌ను స్పష్టంగా క్యాప్చర్ చేయడమే కాకుండా.. సెకనుకు 6 మీటర్ల వేగంతో వచ్చే గాలి శబ్దాన్ని కూడా తగ్గించేలా ఈ ఫీచర్‌ను డిజైన్ చేశారు.
ఆడియోను మీకు నచ్చినట్టు మార్చుకోవడానికి 5 EQ ప్రీసెట్స్ ఉన్నాయి. వీటితో స్టాండర్డ్, ట్రెబుల్ ఎన్‌హాన్స్, బాస్ ఎన్‌హాన్స్, వాయిస్ ఎన్‌హాన్స్, వాల్యూమ్ బూస్ట్ వంటి మోడ్‌లను ఎంచుకోవచ్చు. ఇంకా ఎక్కువ కస్టమైజేషన్ కావాలంటే.. Xiaomi Air Buds యాప్ ద్వారా కస్టమ్ EQ సెట్టింగ్స్ కూడా చేసుకోవచ్చు.
నేటి తరం యూజర్లను దృష్టిలో పెట్టుకుని ఈ ఇయర్‌బడ్స్ డ్యుయల్ డివైస్ కనెక్షన్ సపోర్ట్‌ను కూడా అందిస్తుంది. అంటే.. ఒకేసారి రెండు డివైస్‌లకు కనెక్టయ్యి, కాల్ లేదా ఆడియో వచ్చినప్పుడు ఆటోమేటిక్‌గా స్విచ్ ఆన్ అవుతుంది. అలాగే ఇది IP54 డస్ట్, స్ప్లాష్ రెసిస్టెన్స్, స్మార్ట్ ట్యాప్ కంట్రోల్స్, USB Type-C ఛార్జింగ్ వంటి ఫీచర్లను కలిగి ఉంది.
ఇక బ్యాటరీ పరంగా చూసుకుంటే.. 36 గంటల బ్యాటరీ లైఫ్‌ను కలిగి ఉంటుంది. అలాగే 10 నిమిషాల ఫాస్ట్ ఛార్జింగ్‌తో 2 గంటల మ్యూజిక్ ప్లేబ్యాక్ పొందవచ్చు. ఈ REDMI Buds 8 Lite బ్లాక్, వైట్, బ్లూ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉన్నాయి. వీటి ధర రూ.2,400గా కంపెనీ నిర్ణయించింది. ఈ బడ్స్ ఇప్పటికే కొన్ని గ్లోబల్ మార్కెట్లలో అమ్మకాల్లోకి వచ్చాయి.