E-Paper
Advertisement

Band Melam Film: వాయిదా పడిన ‘బ్యాండ్ మేళం’.. ఆ సినిమాలకు పోటీగా విడుదల?

Band Melam Film: వాయిదా పడిన ‘బ్యాండ్ మేళం’.. ఆ సినిమాలకు పోటీగా విడుదల?
Advertisement

Band Melam Film: హర్ష రోషన్ శ్రీదేవి జంటగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన మొట్టమొదటి చిత్రం కోర్టు. ఈ సినిమా ఎలాంటి సక్సెస్ అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకున్న నేపథ్యంలో మరోసారి ఈ జంట బ్యాండ్ మేళం అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. బావ మరదల ప్రేమ కథ సినిమాగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోందని ఇదివరకు సినిమా నుంచి విడుదల చేసిన అప్డేట్స్ చూస్తేనే స్పష్టం అవుతుంది. ఇక ఈ సినిమాని మార్చి 13వ తేదీ విడుదల చేయబోతున్నట్టు చిత్ర బృందం అధికారికంగా విడుదల తేదీని కూడా ప్రకటించారు.

మార్చి 13 నుంచి తప్పుకున్న బ్యాండ్ మేళం..

ఈ సినిమా విడుదల తేదీ కూడా ప్రకటించడంతో ప్రమోషన్లను కూడా వేగవంతం చేశారు. అయితే తాజాగా సోషల్ మీడియాలో ఈ సినిమా విడుదల గురించి వార్తలు పెద్ద ఎత్తున చక్కర్లు కొడుతున్నాయి. ఈ సినిమా మార్చి 13వ తేదీ విడుదల అవడం లేదని కొన్ని కారణాలవల్ల వాయిదా పడింది అంటూ వార్తలు బయటకు వస్తున్నాయి. చిత్ర బృందం మార్చి 13వ తేదీ ఈ సినిమా విడుదల కాబోతుందని ప్రకటించారు కానీ మార్చి 13 నుంచి వాయిదా పడిన ఈ సినిమా ఏప్రిల్ 3 వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుందని తెలుస్తోంది.

ఏప్రిల్ 3న బ్యాండ్ మేళం..

Advertisement

ఈ సినిమా విడుదల గురించి సోషల్ మీడియాలో వార్తలు వచ్చినప్పటికీ చిత్ర బృందం మాత్రం ఇంకా ఎక్కడా స్పందించలేదు. ఇక ఈ సినిమా ఏప్రిల్ 3 వ తేదీ విడుదల అయితే బాక్స్ ఆఫీస్ వద్ద గట్టి పోటీ ఉండబోతుందని స్పష్టమవుతుంది. ఇప్పటికే ఏప్రిల్ 3 న నిహారిక నిర్మాణంలో సంగీత శోభన్ నటించిన రాకాసా(Rakasa ) సినిమా విడుదల కాబోతోంది. ఈ సినిమాతో పాటు శర్వానంద్ బైకర్(Biker) కూడా అదే రోజు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పుడు బ్యాండ్ మేళం కూడా అదే తేదీని ఫిక్స్ చేసుకోబోతుందని సమాచారం. ఈ మూడు సినిమాలు కాకుండా మరో రెండు సినిమాలు కూడా ఇదే తేదీని టార్గెట్ చేశాయని ఇండస్ట్రీ సమాచారం.

కోర్టు సినిమా సక్సెస్ రిపీట్ కానుందా?

Advertisement

ఇలా ఒకేసారి ఏప్రిల్ 3 వ తేదీ పెద్ద ఎత్తున సినిమాలు విడుదలకు సిద్ధం కావడంతో బాక్స్ ఆఫీస్ వద్ద గట్టి పోటీ ఉండబోతుందని స్పష్టం అవుతుంది. మరి బ్యాండ్ మేళం విడుదల వాయిదా గురించి, కొత్త విడుదల తేదీ గురించి వస్తున్న ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందనేది తెలియాలి అంటే చిత్ర బృందం స్పందించాల్సి ఉంది. ఇక ఈ సినిమాకు సతీష్ జవ్వాజి దర్శకత్వం వహించగా, కోన వెంకట్ సమర్పణలో కోన ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్‌పై కావ్య, శ్రావ్య ఈ చిత్రాన్ని నిర్మించారు. కోర్ట్ లాంటి సూపర్ సక్సెస్ సినిమా తర్వాత హర్ష రోషన్, శ్రీదేవి రెండోసారి జంటగా ఈ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో సినిమాపై కూడా మంచి అంచనాలే ఉన్నాయి. మరి ఈ సినిమా విషయంలో ఈ జంట కోర్టు సక్సెస్ ను రిపీట్ చేయబోతున్నారా? లేదా? అనేది తెలియాల్సి ఉంది.

Also Read: Sathi Leelavathi:వాయిదా పడిన మెగా కోడలు సతి లీలావతి .. మళ్లీ విడుదల ఎప్పుడంటే?

Related News

కృష్ణాష్టమి రోజున కల నెరవేరిందంటున్న ఉపాసన.. పోస్ట్ వైరల్!

Shalini Pandey : బాపురే.. బాత్ రూమ్ వీడియోతో ‘అర్జున్ రెడ్డి’ బ్యూటీ రచ్చ.. తట్టుకోలేరమ్మ..!

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

Big Stories

Advertisement
×