Sathi Leelavathi: లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi)టాలీవుడ్ ఇండస్ట్రీలో నటిగా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతులను సొంతం చేసుకున్నారు. వరుస తెలుగు సినిమాలలో నటిస్తున్నఈమె మెగా హీరో వరుణ్ తేజ్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. పెళ్లి తర్వాత లావణ్య త్రిపాఠి సినిమాలకు దూరమవుతుంది అంటూ ఎన్నో రకాల వార్తలు వచ్చినప్పటికీ ఈ వార్తలు నిజం కాదంటూ లావణ్య త్రిపాఠి తన కొత్త సినిమాని ప్రకటించారు. సతీ లీలావతి(Sathi Leelavathi) అనే సినిమా ద్వారా ఈమె ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు. లావణ్య త్రిపాఠి(Lavanya Tripati) దేవ్ మోహన్ (Dev Mohan) హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా మార్చి ఆరవ తేదీ విడుదల కావాల్సి ఉంది.
ఈ సినిమా మార్చి 6న విడుదల కాబోతున్న నేపథ్యంలో చిత్రబృందం అదే దిశగా ప్రమోషన్ కార్యక్రమాలను కూడా నిర్వహిస్తూ వచ్చారు. అయితే చివరి నిమిషంలో ఈ సినిమా వాయిదా పడిందని తెలుస్తోంది. ఈ విషయాన్ని చిత్ర బృందం అధికారకంగా తెలియజేశారు. సతీ లీలావతి సినిమా మార్చి ఆరవ తేదీ విడుదల కావాల్సి ఉండగా కొన్ని సాంకేతిక ఇబ్బందులు తలెత్తడంతో ఈ సినిమా వాయిదా పడుతుందని త్వరలోనే కొత్త విడుదల తేదీని ప్రకటిస్తాము అంటూ చిత్ర నిర్మాతలు అధికారకంగా తెలియజేశారు.
ఇలా ఈ సినిమా చివరి నిమిషంలో వాయిదా పడటంతో మెగా అభిమానులు కూడా కాస్త నిరాశ వ్యక్తం చేస్తున్నారు. లావణ్య త్రిపాఠి పెళ్లి తర్వాత నటించిన మొదటి సినిమా కావడంతో ఈ సినిమా ఎంతో ప్రత్యేకంగా మారిందనే చెప్పాలి. తాతినేని సత్య దర్శకత్వంలో ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా నుంచి ఇదివరకు పలు అప్డేట్స్ విడుదల చేయగా సినిమా పట్ల మంచి అంచనాలని పెంచేశాయి. ఎన్నో అంచనాల నడుమ ఈ సినిమా విడుదల కాబోతున్న నేపథ్యంలో కొన్ని కారణాలవల్ల వాయిదా పడింది. మరి కొత్త విడుదల తేదీ ఎప్పుడు ఏంటి అనే వివరాలు తెలియాల్సి ఉంది.
Good things take the right time 🎬
The revised release date of Sathi Leelavathi will be announced soon ✨
We’re carefully crafting every detail to deliver an experience that truly meets your expectations 🔥
See you very soon 💚@Itslavanya @ActorDevMohan pic.twitter.com/YNiB9lEgns
— Durga Devi Pictures LLP (@ddp_offl) March 2, 2026
లావణ్య విషయానికి వస్తే ఈమె అందాల రాక్షసి సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు మొదటి సినిమాతోనే మంచి సక్సెస్ అందుకున్న లావణ్య తదుపరి సూపర్ హిట్ సినిమాలలో నటించారు. ఇక వరుణ్ తేజ్ తో కలిసి అంతరిక్షం మిస్టర్ అనే సినిమాలలో జంటగా నటించారు. ఈ సినిమాల సమయంలోనే వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించడమే కాకుండా పెద్దల సమక్షంలో పెళ్లి బంధంతో ఒకటయ్యారు వీరిద్దరూ 2023 నవంబర్ ఒకటో తేదీ ఇటలీలో వివాహం జరుపుకున్న సంగతి తెలిసిందే. గత ఏడాది ఈ దంపతులకు పండంటి మగ బిడ్డ జన్మించారు . ఈ చిన్నారికి వాయువ్ తేజ్ అని నామకరణం చేసిన సంగతి తెలిసిందే. ఇక వరుణ్ లావణ్య ఇద్దరు ప్రస్తుతం సినిమాల పరంగా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా ఉన్నారు.
Also Read: Rashmika Vijay: పెళ్లి జరిగి నాలుగు రోజులు కాలేదు.. పిల్లల పై రష్మిక కామెంట్స్ విన్నారా?