E-Paper
Advertisement

Globe Trotter: గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్.. హైలైట్స్ ఇవేనట.. ?

Globe Trotter: గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్.. హైలైట్స్ ఇవేనట.. ?
Advertisement

Globe Trotter: కొన్ని గంటలు.. ఇంకొన్ని గంటల్లో SSMB29 టైటిల్ ఏంటి అనేది తెలిసిపోతుంది. రెండేళ్లుగా ఈ మూమెంట్ కోసం ఇండస్ట్రీ మాత్రమే కాదు ప్రపంచం మొత్తం ఎదురుచూస్తుంది. సూపర్ స్టార్ మహేష్ బాబుతో దర్శక ధీరుడు రాజమౌళి సినిమా చేస్తున్నట్లు ప్రకటించి రెండేళ్లు అవుతుంది. ఆర్ఆర్ఆర్ తరువాత జక్కన్న ఈ సినిమాను అనౌన్స్ చేశాడు. ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించిన ఏ అప్డేట్ ను జక్కన్న అంత ఈజీగా చెప్పలేదు. లీకుల ద్వారానో.. గాసిప్స్ ద్వారానో అభిమానులు తెలుసుకోవడం తప్పిస్తే.. ఇప్పటివరకు అధికారికంగా రాజమౌళి ఏది చెప్పలేదు.

ఇక ఎప్పుడైతే గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్ ను అనౌన్స్ చేశారో.. అప్పటినుంచి అప్డేట్స్ మీద అప్డేట్స్ ఇస్తూ వస్తున్నారు. ఈ సినిమాలో ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తుండగా పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ గా నటిస్తున్నాడు. నేడు గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్ రామోజీ ఫిల్మ్ సిటీలో గ్రాండ్ గా జరగనుంది. ఇప్పటికే ఈ ఈవెంట్ హడావిడి హైదరాబాద్ ట్రాఫిక్ మీద పడింది. పాస్ పోర్ట్స్ ఉన్నవారు మాత్రమే రావాలని మేకర్స్ ఖరాకండీగా చెప్పుకొచ్చారు. దీంతో పాస్ పోర్ట్స్ దక్కిన అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తుండగా.. అవి దక్కించుకోలేని అభిమానులు నిరాశతో టీవీలకు అతుక్కుపోవడానికి సిద్ధమవుతున్నారు.

Advertisement

అసలు గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్ లో ఏం ఉండబోతున్నాయి. ఏం చూపించబోతున్నారు అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఒక టైటిల్ రివీల్ ఈవెంట్ ను ఈ రేంజ్ లో ప్లాన్ చేశారు అంటే.. ఖచ్చితంగా అందులో హైలైట్ అయ్యే అంశాలను జోడించకుండా ఉండరు. ఈ ఈవెంట్ కోసం కూడా రాజమౌళి టీమ్ ఏ రేంజ్ లో కష్టపడిందో చూస్తూనే ఉన్నాం. ఇక ఈ ఈవెంట్ కు తెలుగు నుంచి సుమ.. హిందీ నుంచి ఆశిష్ చంచలనీ హోస్టులుగా వ్యవహరిస్తున్నారు.

ఈవెంట్ 6 గంటలకు మొదలు కానుంది. హోస్టులిద్దరూ.. తమ మాటలతో సెలబ్రిటీలు వచ్చేవరకు అభిమానులను అలరించనున్నారు. అదొక గంట సాగిన తరువాత.. మహేష్ బాబు సాంగ్స్ తో డ్యాన్స్ ప్రోగ్రామ్స్ ఉన్నాయని తెలుస్తుంది. వీటి తరువాత కీరవాణి బృందం సాంగ్స్ తో కొద్దిసేపు అలరించనుందట. ఇక దీని తరువాత సంచారీ సాంగ్ ను శృతి హాసన్ లైవ్ పెర్ఫార్మెన్స్ ఉండనుందని తెలుస్తోంది. ఇక అప్పటికే సెలబ్రిటీలు రావడం మొదలుపెడతారు. డైరెక్టర్స్, నిర్మాతలు వచ్చిన తరువాత.. రాజమౌళి గురించి, మహేష్ గురించి సుమ వారిని కొన్ని ప్రశ్నలు వేయడం.. కామెడీ పండించడం జరుగుతుంది.

Advertisement

ఇక అప్పుడే మెయిన్ ఈవెంట్ మొదలు కానుంది. మొదట దేశీ గర్ల్ ప్రియాంక చోప్రా డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ తో ఎంట్రీ ఇవ్వనుందట. ఆమె చేసిన బాలీవుడ్ సాంగ్స్ తో పాటు టాలీవుడ్ సాంగ్స్ మాషప్ తో  అదరగొట్టనుందట. ఆ తరువాత సాంప్రదాయమైన చీరకట్టులో అమ్మడి ఎంట్రీ ఉండనుంది. ఇక తరువాతజక్కన్న.. మహేష్ బాబుకు సూపర్ ఎంట్రీ ప్లాన్ చేసినట్లు సమాచారం. ఈవెంట్ మొత్తానికి ఇదే హైలైట్ గా నిలవనుందని టాక్.

ఇక సినిమాలో నటించే అందరి ఎంట్రీస్ తరువాత గ్లోబ్ ట్రోటర్ అంటే ఏంటి.. సినిమా ఎలా మొదలైంది లాంటి మేకింగ్ షాట్స్ ఏవి చూపించి.. SSMB29 గ్లింప్స్ ను రిలీజ్ చేయనున్నారు. చివర్లో సినిమా టైటిల్ ను రివీల్ చేయనున్నారట. ఇక గ్లింప్స్ లో ప్పటివరకు రిలీజ్ చేసిన పాత్రల తీరు.. హీరో క్యారెక్టర్.. కథను కొద్దిగా చూపించబోతున్నారని తెలుస్తోంది. ఈ హైలైట్స్ తో ఫ్యాన్స్ మరో వారం రోజులు దీని గురించే మాట్లాడుకుంటారు.

Related News

వారికి అభినందనలు తెలిపిన ఏపీ డిప్యూటీ సీఎం!

వారణాసి షూటింగ్ పై క్రేజీ అప్డేట్.. జక్కన్న ఏం ప్లాన్ చేస్తున్నావయ్యా?

ఎమోషనల్ గా ‘చెన్నై లవ్ స్టోరీ’ ట్రైలర్.. కిరణ్ ఖాతాలో మరో హిట్?

ఫిగర్ బాలేదని టార్చర్.. 40 ఏళ్లొచ్చాకే ఆ నరకం నుండి బయటపడ్డానంటున్న తారక్ హీరోయిన్

యాంకర్ సుమ హీరోయిన్‌గా నటించిన ఏకైక సినిమా ఏంటో తెలుసా ?

‘టాక్సిక్’ ట్రైలర్ డేట్ ఫిక్స్..ఇదైనా ఖాయమా యష్?

72వ జాతీయ అవార్డుల్లో సత్తా చాటిన తెలుగు సినిమాలు.. ఉత్తమ చిత్రం ఏదంటే?

విక్రమ్ 1 సక్సెస్.. చిరు ఫిదా: ప్రైవేట్ రాకెట్ ప్రయోగంపై మెగాస్టార్ క్రేజీ రియాక్షన్!

Big Stories

Advertisement
×