E-Paper
Advertisement

Jubilee Hills Bypoll Results: జూబ్లీహిల్స్ విజయం.. కాంగ్రెస్ వెంటే TDP ఓటర్లు!

Jubilee Hills Bypoll Results: జూబ్లీహిల్స్ విజయం.. కాంగ్రెస్ వెంటే TDP ఓటర్లు!
Advertisement

Jubilee Hills Bypoll Results: జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ పార్టీ సాధించిన గెలుపుపై రాష్ట్ర రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చ మొదలైంది. ముఖ్యంగా ఈ విజయానికి టీడీపీ ఓటు బ్యాంక్ కీలక పాత్ర పోషించిందనే వార్త ఇప్పుడు జిల్లా, రాష్ట్ర స్థాయిలో వేగంగా విస్తరిస్తోంది. ఓటింగ్ ముందూ, తరువాత జరిగిన రాజకీయ సమీకరణలు, అభ్యర్థుల నేపథ్యం, ప్రచార తీరు ఈ విషయాలన్నింటిని పక్కపక్కన పెట్టి చూస్తే.. నవీన్ యాదవ్ విజయానికి టీడీపీ ఓటర్ల మద్దతు పెద్ద కారణమని  స్పష్టంగా కనిపిస్తున్నాయి.

కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన అభ్యర్ధులందరికీ గతంలో ఆ పార్టీతో అనుబంధం ఉంది. విజయం సాధించిన కాంగ్రెస్ అభ్యర్ధి నవీన్ యాదవ్ తండ్రి శ్రీశైలం యాదవ్ ఒకప్పుడు కీలక నేతగా వ్యవహరించారు. మాగంటి గోపీనాథ్ కూడా జూబ్లీహిల్స్‌లో టీడీపీ తరుపున గెలిచారు. ఆ తర్వాత బీఆర్ఎస్‌లో చేరారు. బీజేపీ అభ్యర్ధి దీపక్ రెడ్డి సుమారు 20 ఏళ్లు ఆ పార్టీలోనే ఉన్నారు.

Advertisement

ఆంధ్రప్రదేశ్‌లో సత్తా చాటుతున్న టీడీపీ ఇప్పుడు NDA కీలక భాగస్వామిగా ఉంది. ఈ పరిణామం తెలంగాణ రాజకీయాలపై కూడా ప్రభావం చూపింది. దీంతో ఆ పార్టీ ఓట్లపై భీజేపీతో పాటు బీఆర్ఎస్, కాంగ్రెస్ ఆశలు పెట్టుకున్నాయి. ప్రచారంలో భాగంగా కేటీఆర్ టీడీపీ ఓటర్లు తమ వెంటేనని చెప్పుకొచ్చారు. లాస్ట్‌కి టీడీపీ నేతలు, అభిమానులు కాంగ్రెస్ వైపై మొగ్గుచూపినట్లు తాజాగా వెలువడిన ఫలితాలను చూస్తే అర్ధమవుతుంది.

మరోవైపు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన ప్రచారం ప్రత్యేకంగా టీడీపీ ఓటర్లను ఆకర్షించిందనే అభిప్రాయం బలపడుతోంది. ప్రచారంలో ఆయన చేసిన కొన్ని హామీలు, కొన్ని సంకేతాలు, ప్రత్యేక కమ్యూనిటీలతో సమావేశాలు అన్నీకలిసి ఓటర్ల దృష్టిని కాంగ్రెస్ వైపుకు మళ్లించాయి.

Advertisement

Also Read: మొన్న గ్రామాలు.. నేడు సిటీ.. బీఆర్ఎస్‌కు బై బై! కాంగ్రెస్ ట్వీట్ వైరల్

ప్రత్యేకంగా అమీర్‌పేట్ సెంటర్‌లో NTR విగ్రహం ఏర్పాటు చేస్తానని రేవంత్ స్వయంగా ప్రకటించడం, టీడీపీ అభిమాన వర్గాన్ని గణనీయంగా ప్రభావితం చేసిన అంశంగా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

Related News

సొంత పార్టీని ముంచేస్తున్న నేతల దూకుడు.. కాంగ్రెస్‌ పార్టీలో నెక్స్ట్ ఏ సీనియర్ టార్గెట్?

స్పీడ్ పెంచిన రేవంత్ రెడ్డి.. రేపటి నుంచి సొంత గడ్డపై రెండు రోజుల పర్యటన !

అసదుద్దీన్ ఒవైసీ అసలైన దేశభక్తుడు.. సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభంలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

కేబినెట్ నుంచి ఔట్.. సురేఖకు ముందు బర్తరఫ్ అయిన మంత్రులు వీళ్లే!

రేవంతే పట్టుబట్టి నన్ను తీసేశారు..సీఎం పై సంచలన కామెంట్స్!

నన్ను అడగకుండా ఎలా బర్తరఫ్ చేస్తారు?.. అధిష్ఠానంపై మంత్రి కొండా సురేఖ ఫైర్!

Big Stories

Advertisement
×