E-Paper
Advertisement

Allu Sirish: ‘మగజాతి ఆణిముత్యం’గా అల్లు శిరీష్.. ఈసారైనా హిట్ కొడతాడా

Allu Sirish: ‘మగజాతి ఆణిముత్యం’గా అల్లు శిరీష్.. ఈసారైనా హిట్ కొడతాడా
Advertisement

Allu Sirish:అల్లు కుటుంబం నుండి అడుగుపెట్టిన హీరోలలో అల్లు శిరీష్ (Allu Sirish) కూడా ఒకరు. అయితే ఈయన తన అన్నయ్య, ప్రముఖ స్టార్ హీరో అల్లు అర్జున్ ( Allu Arjun) అంతటి రేంజ్ లో పాపులారిటీ దక్కించుకోలేదు అనడంలో సందేహం లేదు. కనీసం ఇప్పటికైనా ఈయన కెరియర్ లో ఒక్క హిట్టు పడకపోతుందా అని ఎదురుచూసే అభిమానులు కూడా లేకపోలేదు. అలాంటి ఈయన ఇప్పుడు ఒక వినూత్నమైన కథతో ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలుస్తోంది. పైగా ఈ సినిమాతో కచ్చితంగా బ్లాక్ బాస్టర్ అందుకోవాలని శిరీష్ ఫిక్స్ అయ్యారు. మరి ఆ డైరెక్టర్ ఎవరు? ఏ జోనర్ లో సినిమా రాబోతోంది? అనే విషయం ఇప్పుడు చూద్దాం. .

మగజాతి ఆణిముత్యంగా అల్లు శిరీష్..

ఇప్పటికే బచ్చలమల్లి, సోలో బ్రతికే సో బెటర్ వంటి చిత్రాలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ దక్కించుకున్న టాలెంటెడ్ డైరెక్టర్ సుబ్బు దర్శకత్వంలో శిరీష్ సినిమా ఫిక్స్ అయ్యింది. ఈ సినిమాకు ఒక వైవిద్యమైన టైటిల్ ను ఫిక్స్ చేయగా.. అది కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ క్రేజీ ప్రాజెక్టుకు ‘మగజాతి ఆణిముత్యం’ అనే ఒక వింత టైటిల్ ను ఫిక్స్ చేశారు. సాధారణంగా సోషల్ మీడియాలో మీమ్స్ పాపులర్ డైలాగ్స్ లో వినిపించే ఈ పదాన్ని ఇప్పుడు టైటిల్ గా పెట్టడంతో సినిమాపై క్యూరియాసిటీ పెరిగిపోయింది. సుబ్బు మార్క్ ఎంటర్టైన్మెంట్.. యూత్ ఫుల్ ఎలిమెంట్స్ తో ఈ సినిమా ఉండబోతుందని సమాచారం. ఈ చిత్రాన్ని హాస్య మూవీస్ పతాకంపై రాజేష్ దండ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. సుబ్బు మార్క్ స్క్రీన్ ప్లే , అల్లు శిరీష్ బాడీ లాంగ్వేజ్ కు సరిపోయేలా ఈ కథను సిద్ధం చేసినట్లు సమాచారం.. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు అధికారికంగా వెలువడనున్నాయి.

అల్లు శిరీష్ వ్యక్తిగత జీవితం.

Advertisement

ఇదిలా ఉండగా మరొకవైపు అల్లు శిరీష్ త్వరలో వైవాహిక బంధం లోకి అడుగుపెట్టబోతున్నారు. తన స్నేహితురాలు, ప్రేయసి నైనికతో త్వరలోనే వైవాహిక బంధంలోకి అడుగుపెట్టబోతున్నారు. ఈ నేపథ్యంలోనే పెళ్లికి ముందే దుబాయ్ వేదికగా ఘనంగా ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ ను నిర్వహించారు. ఈ గ్రాండ్ ఈవెంట్ కి అల్లు కుటుంబ సభ్యులు , అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరైనట్లు సమాచారం. ఇకపోతే ఈ ప్రీ వెడ్డింగ్ వేడుకలు దుబాయ్ లోని ప్రఖ్యాత జీ1 బీచ్ వేదికగా జరగడం విశేషం. సముద్ర అలల మధ్య లగ్జరీ బోట్ లో శిరీష్ నైనికా తమ స్నేహితులతో కలిసి ఈ సెలబ్రేషన్స్ జరుపుకున్నారు.

also read:Mrunal thakur: భరించడం కష్టం.. బ్రేకప్ పై తొలిసారి స్పందించిన మృణాల్!

తమ్ముడు కోసం అల్లు అర్జున్ సినిమాకి బ్రేక్..

Advertisement

ఇకపోతే ఈ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ లో అల్లు అర్జున్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. వైట్ టీ షర్టు స్పెషల్ గాగుల్స్ తో అందరి దృష్టిని ఆకట్టుకున్నారు. ఈ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ లో అల్లు కుటుంబ సభ్యుల మధ్య అనుబంధం మరింత ప్రత్యేకంగా కనిపించింది. కుటుంబ సభ్యుల సంతోషం ఈ వేడుకలకు ప్రత్యేకతను తీసుకొచ్చాయి . ఇదిలా ఉండగా అల్లు అర్జున్ మరొకవైపు తన సినిమా షూటింగ్ షెడ్యూల్ నుంచి విరామం తీసుకుని ఈ వేడుకలకు హాజరైనట్లు తెలుస్తోంది.

Related News

Nagarjuna:ఇండస్ట్రీకి నాగార్జున స్ట్రాంగ్ హెచ్చరిక!

Lenin: వాటి కోసమే అఖిల్ ఇన్నేళ్లు ఎదురు చూసాడు.. నాగార్జున ఎమోషనల్!

మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.5లక్షలు ప్రకటన!

నేరుగా ఓటీటీలోకి రాబోతున్న మృణాల్ సస్పెన్స్ థ్రిల్లర్!

చిన్న సినిమా.. విపరీతమైన క్రేజ్.. 72వ జాతీయ అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’ రచ్చ!

కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా లైఫ్‌లో బిగ్ ట్విస్ట్.. తండ్రిపై సంచలన ఆరోపణలు

స్పిరిట్ కథ లీక్: ఆ ఒక్క ట్విస్ట్‌తో థియేటర్లు షేక్ అవ్వడం ఖాయం!

మరో సినిమాతో ‘రాజు వెడ్స్ రాంబాయి’ దర్శకుడు.. హీరో ఎవరో తెలుసా ?

Big Stories

Advertisement
×