E-Paper
Advertisement

హీరో దర్శన్ కు షాకిచ్చిన సుప్రీం కోర్టు.. జీవితాంతం జైల్లోనేనా..?

హీరో దర్శన్ కు షాకిచ్చిన సుప్రీం కోర్టు.. జీవితాంతం జైల్లోనేనా..?
Advertisement

Actor Darshan Case: కన్నడ స్టార్ హీరో దర్శన్ అభిమాని హత్య కేసులో జైలు జీవితాన్ని అనుభవిస్తున్న విషయం తెలిసిందే. కొన్ని నెలల క్రితం ఈ హీరోకి అనారోగ్యం కారణం వల్ల సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. రేణుక స్వామి హత్య కేసు పై విచారణ జరిపిన పోలీసులు కీలక సమాచారాన్ని కోర్టుకి అందించడంతో మళ్లీ హీరో దర్శన్ బెయిల్ని క్యాన్సల్ చేసి పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే.. మరోసారి హీరో దర్శన్ కి సుప్రీంకోర్టు షాక్ ఇచ్చిందని వార్తలు వినిపిస్తున్నాయి. అసలు ఏం జరిగింది అన్నది వివరాల్లోకి వెళితే..

హీరో దర్శన్ కు సుప్రీం కోర్టు షాక్..

కన్నడ ఇండస్ట్రీలో స్టార్ హీరో అయిన దర్శన్ తన అభిమాని అయిన రేణుస్వామిని హత్య చేయించిన కారణంగా పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. గత కొన్నినెలలుగా హీరో జైల్లోనే ఉన్నాడు. ఈ క్రమంలో తాజాగా ఈ హీరోకు సుప్రీం కోర్టులో దిమ్మతిరిగే షాక్ ఎదురైంది. దర్శన్ బెయిల్ పిటిషన్‌పై విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది.. అంతేకాదు ఆయన కేసుకు సంబంధించిన విచారణను వేగవంతం చేయాలని అధికారులకు కోర్టు ఆదేశించింది. ఏడాదిలోగా విచారణలో స్పష్టమైన పురోగతి లేకుంటే దర్శన్ బెయిల్ కోసం మళ్ళీ కోర్టును ఆశ్రయించవచ్చు అని పేర్కొంది. గత కొన్ని నెలలుగా ఈ కేసు విచారణ జరుగుతూనే ఉంది.. ఆయన జైల్లో ఉండగానే రిలీజ్ అయిన సినిమా కూడా పెద్దగా ఆకట్టుకోలేదు. ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితిని బట్టి ఈ హీరో ఇకమీదట జైలు నుంచి రిలీజ్ అవుతాడా లేదా అన్నది ఫ్యాన్స్ లో ఆందోళన కలిగిస్తుంది.

Advertisement

Also Read :Intinti Ramayanam Avani : రెండోసారి తల్లి కాబోతున్న అవని.. ఫ్యాన్స్ కు ఇది బ్యాడ్ న్యూస్..!

అసలేందుకు జైలుకు వెళ్లాడు..?

హీరో దర్శన్ తన గర్ల్ ఫ్రెండ్ అయిన పవిత్ర గౌడ పై అభిమాని రేణుక స్వామి అనుచిత వ్యాఖ్యలు చేయడంతో అతనిపై ఆగ్రహించిన హీరో తీవ్రంగా గాయపరిచాడు. కిడ్నాప్ చేసి చిత్రహింసలకు గురిచేశారు. దర్శన్‌తో సహా పలువురు నిందితులు అతడిని చచ్చేలా కొట్టారు.. హింస కాస్త తీవ్ర రూపం దాల్చడంతో అతను మరణించాడు. ఈ ఘటన 2024లో వెలుగు చూసింది. అతని మృతదేహం లభ్యం కావడంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు.. ఈ క్రమంలో హీరో దర్శన్ అతని మరణం వెనక హస్తము ఉందని తెలుసుకున్న పోలీసులు వెంటనే హీరోని అలాగే నటి పవిత్రను అదుపులోకి తీసుకున్నారు. అప్పటినుంచి ఇప్పటివరకు విచారణ కొనసాగుతూనే ఉంది. కొన్ని అనారోగ్య సమస్యల కారణంగా హీరో దర్శన్ ని బెయిల్ పై రిలీజ్ చేశారు. మళ్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.. ఇన్ని రోజుల తర్వాత దర్శన్ బెయిల్ కోసం వేసిన పిటీషన్ సుప్రీంకోర్టు ఎత్తివేసింది. మరోసారి విచారణ జరిపి దర్శన్ కేసుని ముందుకు తీసుకెళ్లే ఆలోచనలో న్యాయవ్యవస్థ ఉన్నట్లు తెలుస్తుంది.. ప్రస్తుతం చూస్తున్న పరిస్థితులను బట్టి ఈ హీరో ఇప్పట్లో బయటికి వచ్చేలా కనిపించడం లేదు. ఒకవేళ నేరం అతనే చేసాడని నిరూపణ అయితే మాత్రం అతనికి కఠినమైన శిక్షలు ఉంటాయని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి…

Related News

వారికి అభినందనలు తెలిపిన ఏపీ డిప్యూటీ సీఎం!

వారణాసి షూటింగ్ పై క్రేజీ అప్డేట్.. జక్కన్న ఏం ప్లాన్ చేస్తున్నావయ్యా?

ఎమోషనల్ గా ‘చెన్నై లవ్ స్టోరీ’ ట్రైలర్.. కిరణ్ ఖాతాలో మరో హిట్?

ఫిగర్ బాలేదని టార్చర్.. 40 ఏళ్లొచ్చాకే ఆ నరకం నుండి బయటపడ్డానంటున్న తారక్ హీరోయిన్

యాంకర్ సుమ హీరోయిన్‌గా నటించిన ఏకైక సినిమా ఏంటో తెలుసా ?

‘టాక్సిక్’ ట్రైలర్ డేట్ ఫిక్స్..ఇదైనా ఖాయమా యష్?

72వ జాతీయ అవార్డుల్లో సత్తా చాటిన తెలుగు సినిమాలు.. ఉత్తమ చిత్రం ఏదంటే?

విక్రమ్ 1 సక్సెస్.. చిరు ఫిదా: ప్రైవేట్ రాకెట్ ప్రయోగంపై మెగాస్టార్ క్రేజీ రియాక్షన్!

Big Stories

Advertisement
×