E-Paper
Advertisement

Sankranthi 2027: సంక్రాంతి రేసులో మరో హీరో.. ఫ్లాపులు వెంటాడుతున్న రిస్కు చేస్తున్నాడుగా?

Sankranthi 2027: సంక్రాంతి రేసులో మరో హీరో.. ఫ్లాపులు వెంటాడుతున్న రిస్కు చేస్తున్నాడుగా?
Advertisement

Sankranthi 2027: జయం సినిమా ద్వారా ఇండస్ట్రీకి హీరోగా పరిచయమైన నితిన్ (Nithin)మొదటి సినిమాతోనే మంచి సక్సెస్ అందుకున్నారు అయితే కెరియర్ పరంగా ఇండస్ట్రీలో వరుస సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈయన మాత్రం సరైన సక్సెస్ అందుకోలేకపోతున్నారు. సినీ బ్యాగ్రౌండ్ ఉన్న కుటుంబం నుంచి ఇండస్ట్రీలోకి వచ్చిన నితిన్ హీరోగా ఇండస్ట్రీలో నిలబడటం కోసం భారీగా కష్టపడుతున్నారని చెప్పాలి. ఇటీవల కాలంలో నితిన్ నటించిన సినిమాలన్నీ కూడా వరుసగా ప్రేక్షకులను నిరాశ పరుస్తున్నాయి. రాబిన్ హుడ్, తమ్ముడు వంటి సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు అయితే ఈ సినిమాలేవి కూడా సక్సెస్ అందుకోలేకపోయాయి.

ఆయ్ డైరెక్టర్ తో నితిన్..

ఇలా వరుస సినిమాలు ఫ్లాప్ అవుతున్న నేపథ్యంలో నితిన్ సైతం కథలపై పూర్తిస్థాయిలో దృష్టి సారించి విభిన్నమైన కథలను ఎంపిక చేసుకుంటూ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం ఈయన దర్శకుడు ఆనంద్ డైరెక్షన్లో ఓ సినిమా చేయబోతున్నారని వార్తలు బయటకు వచ్చాయి అయితే ఇది కాకుండా మరో సినిమాకి కూడా నితిన్ కమిట్ అయినట్టు సమాచారం. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు ప్రకారం ఆయ్ సినిమా డైరెక్టర్ అంజి (Anji)నితిన్ కోసం ఒక అద్భుతమైన కథను నెరెట్ చేశారని తెలుస్తుంది.

సంక్రాంతి శుభాకాంక్షలు..

Advertisement

ఈ సినిమా కోసం సంక్రాంతి శుభాకాంక్షలు (Sankranthi Subhakanshalu)అనే టైటిల్ కూడా రిజిస్టర్ చేయించుకున్నారని ఈ సినిమా కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతోందని తెలుస్తోంది. అదే త్వరలోనే ఈ సినిమా షూటింగ్ పనులను ప్రారంభించి ఈ చిత్రాన్ని 2027 సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం కోసం ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలుస్తోంది.. 2027 సంక్రాంతి పండుగ సందర్భంగా కొత్త సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారనే విషయం తెలిసిన నెటిజన్లు విభిన్న రీతిలో స్పందిస్తూ కామెంట్లు చేస్తున్నారు.

సంక్రాంతి బరిలో స్టార్ హీరోలు..

Advertisement

ఇటీవల కాలంలో నితిన్ సరైన సినిమాలను ఎంపిక చేసుకోలేక బాక్స్ ఆఫీస్ వద్ద వరుస డిజాస్టర్ సినిమాలను ఎదుర్కొంటున్నారు. ఇలా వరుస ప్లాప్ సినిమాలతో సతమతమవుతున్న నితిన్ 2027 సంక్రాంతి పండుగ సందర్భంగా స్టార్ హీరోలకు పోటీగా రాబోతున్నారనే విషయం తెలిసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇప్పటికే ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్న నితిన్ ఈ హీరోలతో పోటీకి దిగి రిస్క్ చేస్తున్నారా? సంక్రాంతి పోటీలో దిగడం అవసరమా అంటూ కామెంట్లు చేస్తున్నారు. అయితే ఈ ఏడాది సంక్రాంతి పండుగకు భారీగా పోటీ ఉండబోతుందని తెలుస్తుంది . ఇప్పటికే వెంకటేష్, చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, శర్వానంద్ వంటి హీరోలందరూ కూడా సంక్రాంతికి కర్చీఫ్ లు వేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు నితిన్ కూడా సంక్రాంతి బరిలో దిగటం గమనార్హం.

Also Read; Peddi movie: మెగాఫాన్స్ కు మళ్లీ నిరాశే.. ఇప్పట్లో పెద్ది అప్డేట్ లేనట్టేనా?

Related News

టాలీవుడ్ లో నేషనల్ అవార్డు అందుకున్న తొలి చైల్డ్ ఆర్టిస్ట్ ఎవరంటే?

భాయ్ చిక్కిపోయాడని ఏడ్చేసిన ఫ్యాన్స్.. రివర్స్ సెటైర్ వేసిన సల్మాన్ !

రికార్డుల వేటలో ‘ది ఒడిస్సీ’..మన మేకర్స్ ఇప్పటికైనా మారతారా?

విదేశాల్లో షాట్లు.. ఏపీలో ఓట్లు! టాలీవుడ్ స్టార్స్‌పై అంబికా కృష్ణ మార్కు కౌంటర్లు!

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

Big Stories

Advertisement
×