E-Paper
Advertisement

Peddi movie: మెగాఫాన్స్ కు మళ్లీ నిరాశే.. ఇప్పట్లో పెద్ది అప్డేట్ లేనట్టేనా?

Peddi movie: మెగాఫాన్స్ కు మళ్లీ నిరాశే.. ఇప్పట్లో పెద్ది అప్డేట్ లేనట్టేనా?
Advertisement

Peddi Movie : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Rancharan)ప్రస్తుతం బుచ్చిబాబు సానా దర్శకత్వంలో పెద్ది సినిమా(Peddi Movie) చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.. వృద్ధి సినిమాస్ బ్యానర్ పై ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. నిజానికి ఈ సినిమాని మార్చి 27వ తేదీ ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం కోసం చిత్ర బృందం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు అయితే చివరి నిమిషంలో ఈ సినిమా విడుదల నుంచి తప్పుకుంది. మార్చ్ 27వ తేదీ విడుదల కావాల్సిన సినిమా ఏప్రిల్ 30వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

రికార్డు స్థాయిలో చికిరి చికిరి వ్యూస్..

షూటింగ్ పనులు కొంత భాగం మిగిలి ఉన్నాయి అలాగే పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి కావడం కోసం మరి కాస్త ఆలస్యం అవుతున్న నేపథ్యంలో విడుదలను వాయిదా వేశారు.. అయితే ఇప్పటివరకు ఈ సినిమా నుంచి విడుదల చేసిన అప్డేట్స్ మాత్రం సినిమా పట్ల మంచి అంచనాలను పెంచడంతో ఈ సినిమా పట్ల అభిమానులు కూడా ఎంతో ఆతృత కనబరుస్తున్నారు. సినిమా నుంచి విడుదల చేసిన ఫస్ట్ సింగిల్ చికిరి చికిరి సాంగ్ ఎలాంటి ఆదరణ సొంతం చేసుకున్నదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ పాట ఏకంగా 200 మిలియన్ పైగా వ్యూస్ దక్కించుకుంది.

ఆలస్యంగా సెకండ్ సింగిల్..

Advertisement

ఇలా మొదటి పాటకు ఈ స్థాయిలో ఆదరణ లభించడంతో రెండో పాట విషయంలో కూడా అంతకుమించి అంచనాలు ఉన్నాయి. ఇక రెండో సాంగ్ రామ్ చరణ్ ఇంట్రో సాంగ్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతుందని గత కొద్దిరోజులుగా వార్తలు వచ్చాయి. అయితే ఈ సెకండ్ సింగల్ వాలెంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14వ తేదీ విడుదల కాబోతుందని వార్తలు బయటకు వచ్చాయి కానీ చిత్ర బృందం మాత్రం అధికారకంగా ఈ విషయాన్ని వెల్లడించలేదు అయితే తాజా సమాచారం ప్రకారం ఈ పాట కోసం మెగా అభిమానులు మరికొద్ది రోజులు ఎదురు చూడాల్సిందేనని స్పష్టం అవుతుంది.ఈ పాటను ఫిబ్రవరి 27వ తేదీ లేదా మార్చి 3 లేదా4 తేదీలలో హోలీ పండుగ సందర్భంగా విడుదల చేయాలని ఆలోచనలు చిత్ర నిర్మాతలు ఉన్నట్టు సమాచారం.

ఏఆర్ రెహమాన్ సంగీతం..

Advertisement

పెద్ది సెకండ్ సింగిల్ రావడానికి మరింత ఆలస్యం అవుతున్నట్టు సమాచారం. ఫిబ్రవరి 14వ తేదీ విడుదలవుతుందని ఎదురుచూసిన అభిమానులకు ఈ వార్త కాస్త నిరాశ కలిగిస్తుందని చెప్పాలి. ఈ పాటకు సంబంధించిన పనులు పూర్తికాని నేపథ్యంలోనే ఆలస్యం అవుతుందని తెలుస్తుంది. పాటకు సంబంధించిన అప్డేట్ చిత్ర బృందం వెల్లడించనున్నారు.. ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ జోడిగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించబోతున్నారు. మరొక నటి మృణాళ్ ఠాకూర్ స్పెషల్ సాంగ్ చేయబోతున్నట్టు కూడా వార్తలు వచ్చాయి కానీ ఈ వార్తలపై ఎలాంటి ప్రకటన వెల్లడించలేదు. ఆస్కార్ అవార్ గ్రహీత ఏఆర్ రెహమాన్ ఈ సినిమాకు సంగీతం అందించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో జగపతిబాబు కూడా కీలక పాత్రలో కనిపించబోతున్నారు.

Also Read; Mahesh Babu: ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా ఇది.. ఆ సినిమా మహేష్ బాబు ప్రశంసలు!

Related News

హైదరాబాద్‌లో ‘ఒడిస్సీ’ మూవీని ఎంజాయ్ చేయడానికి పెర్ఫెక్ట్ థియేటర్లు ఇవే, స్క్రీన్.. సౌండ్ అదుర్స్!

సెన్సార్ పూర్తి చేసుకున్న నయనతార ‘హాయ్’.. రిలీజ్ డేట్ లాక్!

చెప్పినట్టే వచ్చాడు.. గూస్ బంప్స్ తెప్పిస్తున్న జననాయగన్ షార్ట్ వీడియో వైరల్!

‘గాడ్ ఆఫ్ వార్’లో ఎన్టీఆర్‌తో నటించే హీరోయిన్ ఎవరో తెలుసా ?

ఐశ్వర్య రాజేష్ మొరను ఆలకించిన డైరెక్టర్.. బాలయ్య మూవీలో క్రేజీ రోల్!

‘విక్రమ్ 1’ ర్యాకెట్ ప్రయోగంలో జబర్దస్త్ సత్యశ్రీ చెల్లి కీలక పాత్ర.. ఆ ఫొటోలు షేర్ చేస్తూ నటి ఎమోషనల్!

నటిగా పీవీ సింధు.. ఆసక్తిని రేకెత్తిస్తున్న పోస్ట్!

చిన్న వయసులోనే గొప్ప మనసు చాటుకున్న సితార.. మహేష్ బాబు ఎమోషనల్ పోస్ట్!

Big Stories

Advertisement
×