E-Paper
Advertisement

Prabhas : హీరోయిన్‌కు ప్రభాస్ చీర గిఫ్ట్… పబ్లిక్‌గా అసలు స్టోరీ చెప్పెసింది

Prabhas : హీరోయిన్‌కు ప్రభాస్ చీర గిఫ్ట్… పబ్లిక్‌గా అసలు స్టోరీ చెప్పెసింది
Advertisement

Prabhas :ప్రముఖ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా, రిద్ధీ కుమార్, మాళవిక మోహనన్,నిధి అగర్వాల్ హీరోయిన్లుగా తెరకెక్కుతున్న రొమాంటిక్ కామెడీ హారర్ చిత్రం ది రాజా సాబ్. 2026 జనవరి 9న సంక్రాంతి సందర్భంగా చాలా గ్రాండ్ గా విడుదలవుతోంది. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన పోస్టర్లు, ట్రైలర్స్, అప్డేట్స్ అన్నీ కూడా అభిమానులలో ఉత్సాహాన్ని రెట్టింపు చేశాయి. దీనికి తోడు రీసెంట్గా హైదరాబాదులో ది రాజాసాబ్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను కూడా నిర్వహించారు. ఈ ఈవెంట్లో హీరోయిన్లు ముగ్గురు కూడా స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచిన విషయం తెలిసిందే.

రిద్ధీ కుమార్ కు చీరను గిఫ్ట్ గా ఇచ్చిన ప్రభాస్..

ఇకపోతే మిగతా ఇద్దరితో పోల్చుకుంటే రిద్ధీ కుమార్ వేదికపై మాట్లాడడమే కాకుండా తాను కట్టుకున్న చీరను ప్రభాస్ గిఫ్ట్ గా ఇచ్చారని చెప్పడంతో ఆ ప్రాంగణం మొత్తం ఈలలు, చప్పట్లతో మారు మ్రోగిపోయింది .అంతేకాదు ప్రత్యేకంగా ఆమెకే ప్రభాస్ చీరను గిఫ్టుగా ఇవ్వడంపై పలు రకాల కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి. దీంతో ఎట్టకేలకు అసలు విషయాన్నీ చెప్పి అందరిని ఆశ్చర్యపరిచింది

అసలు విషయం చెప్పిన హీరోయిన్..

Advertisement

ముఖ్యంగా చాలామంది నెటిజన్స్ , ప్రభాస్ అతిధి ఆతిథ్యం మాత్రమే కాదు చీరలు కూడా గిఫ్ట్ గా ఇస్తారా? రిద్దీ మాత్రమే ఎందుకు అంత స్పెషల్? అంటూ కామెంట్లు చేస్తున్నారు.ఈ నేపథ్యంలోనే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రిద్దీ కుమార్ అసలు విషయాన్ని వెల్లడించింది. రిద్దీ కుమార్ మాట్లాడుతూ..” దీపావళి తర్వాత తొలిసారి ది రాజా సాబ్ సినిమా షూటింగ్ సెట్ లో అడుగు పెట్టాను. ఆ రోజు అక్టోబర్ 23. అదే రోజు ప్రభాస్ పుట్టిన రోజు. ఆయన అక్కడే ఉన్నారు నేను ప్రభాస్ కి ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలి అనుకున్నాను. రెండు రోజుల తర్వాత దీపావళి పార్టీ కూడా జరిగింది.

ఆ సమయంలో మారుతి సార్ వచ్చి ప్రభాస్ మీతో మాట్లాడుతాడు అన్నారు.అలా తొలిసారి ఆయనతో నేను ఫోన్లో మాట్లాడాను. ఆ కాల్ సమయంలో నేను ముంబైలో ఉన్నాను. ఇక బర్తడే గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నాను అని కూడా చెప్పాను. ఆయన ఓకే అన్నారు. అయితే అదే సమయంలో నాకు కూడా దీపావళి గిఫ్ట్ ఉందని చెప్పారు. కర్ణుడి కథ ఆధారంగా శివాజీ సావంత్ రాసిన మృత్యుంజయ్ అనే పుస్తకాన్ని నేను గిఫ్ట్ గా తీసుకెళ్లాను. కర్ణుడి నేచర్, ప్రభాస్ నేచర్ చాలా సిమిలర్గా అనిపిస్తాయి. ప్రభాస్ అంటే రాజు లాంటి వ్యక్తి అందుకే నేను ఆయనకు ఆ బుక్ ఇవ్వాలనుకున్నాను. ఇక ఆ బుక్ ఇచ్చినప్పుడు ఆయన చాలా సర్ప్రైజ్ అయ్యారు.

అందుకే అంత స్పెషల్..

Advertisement

అయితే కల్కి సినిమా చూసిన తర్వాత ఆ సింక్ మరింత బాగా అర్థమయింది. అదే సమయంలో నాకు ప్రభాస్ చీరను గిఫ్టుగా ఇచ్చారు. చాలా బాగుంది.. మూడేళ్ల పాటు ఆ చీరను దాచిపెట్టుకున్నాను. ఇప్పుడు రాజా సాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ప్రభాస్ ఇచ్చిన చీరనే నేను కట్టుకున్నాను” అంటూ ఆమె తెలిపింది. ఇకపోతే రిద్దీ కుమార్ కే స్పెషల్గా చీరను ఎందుకు గిఫ్ట్ గా ఇచ్చాడు అనే విషయాన్నికొస్తే.. వీరిద్దరి కాంబినేషన్లో ఇప్పటికే రాధేశ్యామ్ సినిమా వచ్చిన విషయం తెలిసిందే. ఇందులో ఒక చిన్న పాత్రలో నటించింది. అప్పుడే ఈమెతో ఫ్రెండ్షిప్ పెరిగింది. ఇప్పుడు మరోసారి ది రాజా సాబ్ సినిమాతో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు.. ఈ ఫ్రెండ్షిప్ కారణంగానే ప్రభాస్ ఆమెకు చీరను గిఫ్ట్గా ఇచ్చినట్లు తెలుస్తోంది.

also read:Balakrishna: బాలయ్య ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన టికెట్ ధరలు..?

Related News

రికార్డుల వేటలో ‘ది ఒడిస్సీ’..మన మేకర్స్ ఇప్పటికైనా మారతారా?

విదేశాల్లో షాట్లు.. ఏపీలో ఓట్లు! టాలీవుడ్ స్టార్స్‌పై అంబికా కృష్ణ మార్కు కౌంటర్లు!

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

హైదరాబాద్‌లో ‘వైఫ్ ఎక్స్ఛేంజ్’ కల్చర్ ఉందంటూ హీరోయిన్ మాధవీలత సంచలన వ్యాఖ్యలు!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

Big Stories

Advertisement
×