E-Paper
Advertisement

Sikkim Sundari Plant: పదేళ్లకు ఒక్కసారే పూసే పువ్వు ఇది.. దీని ప్రత్యేకతలు తెలిస్తే మైండ్ బ్లాకే!

Sikkim Sundari Plant: పదేళ్లకు ఒక్కసారే పూసే పువ్వు ఇది.. దీని ప్రత్యేకతలు తెలిస్తే మైండ్ బ్లాకే!
Advertisement

Sikkim Sundari Plant: మీరు చూస్తున్న ఈ పువ్వు రోజూ కనిపించే పువ్వు కాదు.. దీనిపేరు సిక్కిం సుందరి. ఇది సిక్కింలోని ఎత్త్తైన కొండ ప్రాతంలో మాత్రమే పెరుగుతుంది. ఈ మొక్క ప్రత్యేకత ఏమిటంటే దాదాపు 30 సంవత్సరాలు ఏమి పూయకుండా నెమ్మదిగా పెరుగుతుంది. అన్ని సంవత్సరాలు పూర్తయ్యాక జీవితంలో ఒక్కసారి మాత్రమే పువ్వు పూస్తుంది. ఆ పువ్వు పూసిన కొద్దిరోజులకే ఈ మొక్క జీవితం ముగిస్తుంది. ఈ పుష్పం చుట్టూ ఉన్న పొరలు లోపల పువ్వుని చలినుంచి కాపాడతాయి. అందుకే మంచుపడే ప్రాంతాల్లో కూడా ఇది బతుకుతుంది. ఇంతకాలం ఓపికగా ఎదిగి ఒక్కసారి మాత్రమే పూసే ఈ పువ్వు నిజంగా ప్రకృతి అద్భుతం.

పదేళ్లకు ఒకసారి హిమాలయాల్లో 4వేల అడుగుల ఎత్తులో ఈ పువ్వు వికసిస్తుంది.. ఇది కూడా బ్రహ్మ కమలం లాగానే అయినా, దానికీ, దీనికి తేడాలున్నాయి. సిక్కిం సుందరి పువ్వు చుట్టూ ఒక పలుచటి కవచం లాంటి పొర ఉంటుంది. దానిలో ఉష్ణోగ్రత, మంచు పర్వతాల్లో చల్లని గాలుల నుంచి కాపాడుతుంది. పదిరోజుల్లో విత్తనాలు వెదజల్లి ఇది వాడిపోతుంది. మళ్ళీ విత్తనాలు మొలిచి పదేళ్లు ఓపికగా పెరిగి పుష్పించి రాలిపోతుంది.. దీని శాస్త్రీయ నామం రియం నోబిలే.

Advertisement

కాగా ఇటీవల పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా హిమాలయాల్లో పెరిగే ఈ అరుదైన, అందమైన పుష్పం సిక్కిం సుందరిని ప్రపంచానికి పరిచయం చేశారు. అప్పట్లో తన ఎక్స్ ఖాతాలో షేర్ చేసిన ఈ పోస్ట్ సంచలనం సృష్టించింది. సముద్ర మట్టానికి సుమారు 4,000 నుంచి 4,800 మీటర్ల ఎత్తులో ఈ మొక్క విరాజిల్లుతుంది. దీన్ని శాస్త్రవేత్తలు గ్లాస్‌హౌస్ మొక్కగా పేర్కొన్నారు. దీని పొడవైన, పారదర్శక కవచాలాంటి ఆకులు సహజ గ్రీన్‌హౌస్‌లా పనిచేస్తాయి. అవి లోపల ఉన్న సున్నితమైన పువ్వులను గడ్డకట్టే గాలుల నుంచి, తీవ్రమైన అల్ట్రావయలెట్ కిరణాల నుంచి కాపాడుతాయి.

ఈ మొక్క మోనోకార్పిక్ జాతికి చెందింది. అంటే తన జీవితంలో కేవలం ఒక్కసారే పుష్పిస్తుంది. 7 నుంచి 30 సంవత్సరాల పాటు నేలకి దగ్గరగా చిన్న ఆకుల గుత్తిలా ఉండి, పర్వత వాతావరణంలో శక్తిని పొదుపు చేస్తుంది. ఆ తర్వాత చివరి దశలో ఒక్కసారిగా దాదాపు రెండు మీటర్ల ఎత్తు వరకు పెరిగి, పగోడా ఆకారంలో పుష్పించి, విత్తనాలను వ్యాప్తి చేసి, అనంతరం తన జీవనయాత్రను ముగిస్తుంది అని ఆనంద్ మహీంద్రా తన పోస్టులో పేర్కొన్నారు.

Advertisement

ఇక ఈ పుష్పం శాస్త్రవేత్తలకు, పర్యాటకులకు ఆకర్షణీయంగా, అద్భుతమైన అనుభూతిని అందిస్తుంది. ఇది ఎత్తైన పర్వత ప్రాంతాల్లో మైనస్ సున్నా డిగ్రీ ఉష్టోగ్రతలు ఉండే కఠిన వాతావరణంలో పెరిగే మొక్క. ఎందుకంటే ఆక్సీజన్ లెవల్స్ తక్కువగాను, అలాగే బలమైన గాలుల మధ్య పర్వతాలకు వ్యతిరేకంగా పెరుగుతుంది.

ఈ పుష్పాన్ని ఓర్పుకు నిదర్శనంగా భావిస్తారు. ఎందుకంటే ఈ మొక్క పుష్పించేందుకు ఏడు నుంచి 30 ఏళ్లవరకు చాలా నిశ్బబ్ధంగా ఆకుల్లో శక్తిని నిల్వ చేసుకుంటూ చిన్న రోసెట్‌లా పెరుగుతుంది. ఆ తర్వాత ఒక్కసారిగా అన్నే ఏళ్ల అనంతరం ఏకంగా రెండు మీటర్ల పొడవు పెరిగి ఆలయంలో గోపురం మాదిరగా పెరుగుతుంది. విత్తనాలను విడుదల చేస్తుంది. అలా దాని జీవితాన్ని పూర్తి చేస్తుంది.

Also Read: ప్రమాదాన్ని పసిగట్టే ‘సూపర్ సెన్స్’.. గంట ముందే శరీరం ఎలా స్పందిస్తుంది ?

ఈ మొక్క జీర్ణక్రియ, వాపులు, కాలేయం, నొప్పులు ఇతర అనారోగ్య సమస్యలకు ఔషదంగా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇక ఈ పుష్పం కాండాలను స్థానికులు ఆహారంగా తీసుకుంటారని చెబుతారు. దీని వేర్లను సాంప్రదాయ వైద్యంలో కూడా ఉపయోగిస్తారట.

Related News

తక్కువ స్థలంలో కిచెన్ గార్డెన్‌.. ఇంట్లోనే కూరగాయలు పండించడం మరింత సులభం

రాత్రి ఆలస్యంగా నిద్రపోయి ఉదయం త్వరగా లేస్తున్నారా? మీ శరీరానికి కలిగే నష్టాలివే

పిల్లలు రాత్రి ఏ సమయం కల్లా నిద్రపోవాలి? టైమ్‌కు నిద్రపోకపోతే మెదడుపై ప్రభావం

రక్తపోటు పెరగడానికి మౌత్ వాష్ కూడా ఒక కారణమేనా.. తాజా రీసెర్చ్ ఏం చెబుతోంది?

గ్రీన్ టీ తాగుతున్నా బరువు తగ్గట్లేదా? అయితే మీరు ఈ 5 తప్పులు చేస్తున్నట్టే!

గుండెపోటు వెనక అసలు విలన్ ప్లాస్టిక్కేనా? మెడికల్ హిస్టరీలోనే షాకింగ్ నిజాలు!

మ్యూజిక్ లవర్స్‌కి పండగే..తక్కువ ధరలో ఎక్కువ బేస్ ఇచ్చే క్రేజీ బడ్స్!

మీ బంధువులు, స్నేహితులను ఈ 4 ప్రశ్నలు ఎప్పుడూ అడగకూడదు.. రిలేషన్ దెబ్బతింటుంది

Big Stories

Advertisement
×