HBD Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi)గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈయన ‘చిరుత’ సినిమాతో అందరి దృష్టిని ఆకట్టుకున్నారు. అయితే మెగాస్టార్ చిరంజీవి కొడుకు కాబట్టి మొదటి సినిమా విజయం అయింది అని, ఈయన హీరో కటౌట్ కాదు అంటూ చాలామంది హేళన చేశారు. అయితే ఆ తర్వాత నటనలో తనను తాను మలుచుకొని నేడు గ్లోబల్ స్టార్ గా పేరు సొంతం చేసుకున్నారు రామ్ చరణ్. అటు నటనలో ఇటు మాస్ లుక్స్ లో ఊహించని క్రేజ్ సొంతం చేసుకున్న ఈయన.. డాన్స్ స్టెప్పులతో అదిరిపోయే ఇమేజ్ సొంతం చేసుకున్నారు.
ఇకపోతే మార్చి 27న రామ్ చరణ్ పుట్టినరోజు కావడంతో ఆయనకు సంబంధించిన కొన్ని విషయాలు ముందుగానే వైరల్ అవుతున్నాయి. అందులో ఒకటి ఆయన ఆస్తులు. ఖరీదైన ఫ్లాట్లు, లగ్జరీ కార్లు ఆయన సొంతం.. మరి సినిమాల ద్వారా వచ్చిన పారితోషకంతో వివిధ రంగాలలో పెట్టుబడులు పెట్టి ఆదాయాన్ని పెంపొందించుకుంటున్నారు. మరి రామ్ చరణ్ ఆస్తుల విలువ ఎంతో ఇప్పుడు చూద్దాం..
రామ్ చరణ్ ఆస్తుల విలువ సుమారుగా రూ.1,380 కోట్లకు పైగా ఉంటుందని సమాచారం. ఆయన భార్య ఉపాసన అపోలో ఛారిటీ వైస్ చైర్ పర్సన్ అలాగే బీ పాజిటివ్ మ్యాగజైన్ చీఫ్ ఎడిటర్ గా కూడా పనిచేస్తున్నారు. ఇక ఇద్దరి ఆస్తులు కలుపుకొని సుమారుగా రూ.2,500 కోట్ల వరకు ఉంటుందని సమాచారం. ఆర్ఆర్ఆర్ చిత్రానికి గానూ రూ.50 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్న ఈయన.. బుచ్చిబాబు సనా దర్శకత్వంలో చేస్తున్న ‘పెద్ది’ సినిమా కోసం తన రెమ్యూనరేషన్ ను భారీగా పెంచినట్లు సమాచారం.. గ్లోబల్ స్టార్ డం వచ్చాక ఆయన ఒక్కో కమర్షియల్ యాడ్ కోసం సుమారుగా 4కోట్ల వరకు పారితోషకం తీసుకుంటున్నారు అనే టాక్ ఇండస్ట్రీలో నడుస్తోంది.
రామ్ చరణ్ కి హార్స్ రైడింగ్ అంటే చాలా ఇష్టం. 2011 సెప్టెంబర్ లో సొంతంగా హైదరాబాదులో పోలో రైడింగ్ క్లబ్ ను ఆయన ప్రారంభించారు. ‘మా’టీవీ బోర్డు ఆఫ్ డైరెక్టర్లలో ఒకరిగా కూడా ఒకప్పుడు పని చేశారు. అలాగే ట్రూజెట్ అనే ప్రైవేట్ ఎయిర్ లైన్స్ సంస్థ కూడా ఈయన సొంతం. ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ హైదరాబాద్ జట్టుకి ఓనర్ గా కూడా ఉన్నారు. ఇక అంతేకాదు 2016లో కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ అనే ఒక ప్రొడక్షన్ హౌస్ ని స్థాపించి నిర్మాతగా కూడా మారారు. మెగాస్టార్ చిరంజీవి నటించిన ఖైదీ నెంబర్ 150, సైరా నరసింహారెడ్డి , గాడ్ ఫాదర్ వంటి చిత్రాలను నిర్మించారు. యూవీ క్రియేషన్స్ కి చెందిన విక్రమ్ రెడ్డితో కలిసి వి మెగా పిక్చర్స్ అనే నిర్మాణ సంస్థను స్థాపించి.. ఈ ప్రొడక్షన్ హౌస్ ద్వారా ‘ది ఇండియా హౌస్’ అనే చిత్రాన్ని ప్రకటించారు.
రామ్ చరణ్ లగ్జరీ కార్లను మెయింటైన్ చేస్తున్నారు. సుమారుగా 4కోట్ల విలువైన కస్టమైజ్డ్ మెర్సిడెస్ మే బాచ్ GLS 600 కారుతోపాటు 10 కోట్ల విలువ చేసే రోల్స్ రాయిస్ ఫాంటమ్, ఆడి మార్టిన్ వి వాంటేజ్, రేంజ్ రోవర్ ఆటో బయోగ్రఫీ, ఫెరారీ పోర్టోఫినో వంటి లగ్జరీ కార్లు కూడా ఉన్నాయి.
ALSO READ:Bollywood: త్వరలో పట్టాలెక్కనున్న ‘ఆపరేషన్ సింధూర్’.. డైరెక్టర్ ఎవరంటే?
హైదరాబాదులోని జూబ్లీహిల్స్ లో 25 వేల చదరపు అడుగుల్లో ఒక పెద్ద బంగ్లా ఉంది. ఇందులో స్విమ్మింగ్ పూల్, టెన్నిస్ కోర్ట్ , జిమ్నాసియం, ఫిష్ పాండ్ వంటి విలాసవంతమైన సౌకర్యాలతో కూడిన ఈ ఇంటి విలువ సుమారుగా 50 కోట్లు ఉండొచ్చని సమాచారం. అలాగే ముంబైలో కూడా ఒక లగ్జరీ అపార్ట్మెంట్ ఉన్నట్లు అప్పట్లో వార్తలు వినిపించాయి.