E-Paper
Advertisement

Ram Pothineni : మళ్ళీ ఆ డైరెక్టర్ కు ఛాన్స్ ఇచ్చిన రామ్..స్టోరీ లైన్ వింటే మతిపోద్ది..

Ram Pothineni : మళ్ళీ ఆ డైరెక్టర్ కు ఛాన్స్ ఇచ్చిన రామ్..స్టోరీ లైన్ వింటే మతిపోద్ది..
Advertisement

Ram Pothineni : టాలీవుడ్ స్టార్ హీరో స్టార్ రామ్ పోతినేని ప్రస్తుతం వరుసగా సినిమాలను అనౌన్స్ చేస్తూ వస్తున్నాడు. ఇటీవల ఆంధ్ర కింగ్ తాలూకా మూవీలో నటించి ప్రేక్షకులను మెప్పించాడు. ఆ మూవీ పాజిటివ్ టాక్ ని అందుకోవడంతో రామ్ ఖాతాలో సక్సెస్ మూవీ పడింది. ప్రస్తుతం ఆయన వరుసగా సినిమాలను లైనట్లో పెట్టుకుంటూ బిజీగా ఉన్నారు.. ఈసారి రాబోతున్న సినిమాతో ఎలాగైనా సరే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలని రామ్ గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నాడు.. ఈ క్రమంలో గతంలో చేసిన డైరెక్టర్ కు ఛాన్స్ ఇచ్చినట్లు తెలుస్తుంది. మరి ఆ డైరెక్టర్ ఎవరు? స్టోరీ లైన్ ఏంటో ఒకసారి తెలుసుకుందాం..

మళ్ళీ అదే డైరెక్టర్ తో మూవీ..

హీరో రామ్ పోతినేని కెరియర్ మొదట్లో బ్యాక్ టు బ్యాక్ హిట్ సినిమాలలో నటించాడు. రామ్ హీరోగా ఒక డెబ్యూ డైరెక్టర్‌తో సినిమా ఉంటుందని.. అలాగే ఆర్కా మీడియా బ్యానర్‌లో ప్రాజెక్ట్ ఉంటుందనే వార్తలు ఈ మధ్య ఫిలిం నగర్లో చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఆ ప్రాజెక్టు ను రామ్ పక్కన పెట్టినట్లు ఓ వార్త వినిపిస్తుంది. ఇప్పుడు ఆయన తన ఇమేజ్‌కు సరిపోయే పక్కా కమర్షియల్ అండ్ ఎమోషనల్ కథలు వినేందుకు సిద్ధమవుతున్నాడట.. రామ్ కు బ్లాక్ బాస్టర్ హిట్ ఇచ్చిన నేను శైలజ మూవీ డైరెక్టర్ కిషోర్ తిరుమలతో ఓ మూవీ చేస్తున్నట్లు సమాచారం. ఆ కథను విన్న రామ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.. అదే కనుక నిజమైతే బ్లాక్ బాస్టర్ పడటం ఖాయం అని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.

Advertisement

Also Read :ఇంత వయసు వచ్చిన అది చెయ్యకుండా ఉండడు..అమర్ పై తల్లి కామెంట్స్..

రొమాంటిక్ లవ్ స్టోరీతో మూవీ..

గతంలో రామ్ యాక్షన్ సినిమాలు కన్నా ఎక్కువగా లవ్ అండ్ ఎంటర్టైనర్ సినిమాలలోని నటించాడు. ఆ స్టోరీలతో వచ్చిన సినిమాలన్నీ కూడా బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచాయి. ఆ తర్వాత వచ్చిన యాక్షన్ సినిమాలన్నీ కూడా రామ్ కు ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేక పోయాయి.. రీసెంట్ గా వచ్చిన ఆంధ్ర కింగ్ తాలూకా మూవీ కాస్త పర్వాలేదు అనిపించింది. దాంతో రామ్ మళ్లీ తన రూట్ మార్చుకున్నట్లు తెలుస్తుంది. ఈసారి ఆయన రొమాంటిక్ లవ్ స్టోరీ తో ప్రేక్షకులు ముందుకు రాబోతున్నట్లు ఓ వార్త వినిపిస్తుంది. ఇదే కనుక నిజమైతే రామ్ ఖాతాలో మళ్ళీ బ్లాక్ బస్టర్ హిట్ పడిపోతుందని ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. త్వరలోనే ఈ సినిమా గురించి ఒక క్లారిటీ రానుంది.. ఈ సినిమా తర్వాత మరో యాక్షన్ మూవీలో నటించే అవకాశాలు ఉన్నట్లు ఫిలిం ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మధ్య రామ్ అకౌంట్ లో బ్లాక్ బాస్టర్ హిట్ మూవీ పడలేదు. ఒక్క హిట్ పడితే మళ్ళీ ట్రాక్ మారిపోతుంది..

Related News

Nagarjuna:ఇండస్ట్రీకి నాగార్జున స్ట్రాంగ్ హెచ్చరిక!

Lenin: వాటి కోసమే అఖిల్ ఇన్నేళ్లు ఎదురు చూసాడు.. నాగార్జున ఎమోషనల్!

మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.5లక్షలు ప్రకటన!

నేరుగా ఓటీటీలోకి రాబోతున్న మృణాల్ సస్పెన్స్ థ్రిల్లర్!

చిన్న సినిమా.. విపరీతమైన క్రేజ్.. 72వ జాతీయ అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’ రచ్చ!

కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా లైఫ్‌లో బిగ్ ట్విస్ట్.. తండ్రిపై సంచలన ఆరోపణలు

స్పిరిట్ కథ లీక్: ఆ ఒక్క ట్విస్ట్‌తో థియేటర్లు షేక్ అవ్వడం ఖాయం!

మరో సినిమాతో ‘రాజు వెడ్స్ రాంబాయి’ దర్శకుడు.. హీరో ఎవరో తెలుసా ?

Big Stories

Advertisement
×