E-Paper
Advertisement

Venuswamy: వేణుస్వామికి గట్టి కౌంటర్ ఇచ్చిన హీరోయిన్.. పూజకు ఫలితం లభించలేదా?

Venuswamy: వేణుస్వామికి గట్టి కౌంటర్ ఇచ్చిన హీరోయిన్.. పూజకు ఫలితం లభించలేదా?
Advertisement

Venuswamy: ప్రముఖ ఆస్ట్రాలజర్ గా భారీ పాపులారిటీ సొంతం చేసుకున్నారు వేణు స్వామి. ఎప్పుడైతే సమంత నాగచైతన్య వివాహం చేసుకున్న తర్వాత విడిపోతారని ప్రకటించారో.. ఆ సమయంలో సమంత నాగచైతన్య నిజంగానే విడిపోవడంతో ఈయన కామెంట్స్ కి మరింత క్రేజ్ పెరిగింది..అలా ఒక్కసారిగా ట్రెండింగ్ లోకి వచ్చేసారు వేణు స్వామి. అంతేకాదు పలువురు సెలబ్రిటీల జాతకాలపై కామెంట్లు చేస్తూ భారీ పాపులారిటీ అందుకున్న ఈయన.. ఆ తర్వాత కాలంలో కొంతమంది హీరోలపై, రాజకీయ పార్టీలపై చేసిన వ్యాఖ్యలు బెడిసి కొట్టడంతో ఈయనను చాలామంది విమర్శించారు అంతేకాదు పలు ప్రాంతాలలో ఈయనపై కేసు కూడా నమోదైన విషయం తెలిసిందే.

వేణు స్వామి దగ్గర పూజ చేయించుకున్న హీరోయిన్స్..

అయితే ఇదంతా జరగక ముందు వేణు స్వామి దగ్గర సామాన్యులతో పాటు పలు రంగాలకు చెందిన సెలబ్రిటీలు కూడా పూజలు చేయించుకునేవారు. ముఖ్యంగా సినీ ఇండస్ట్రీకి చెందిన హీరోయిన్లు వృత్తిపరమైన వృద్ధి కోసం ప్రత్యేకంగా రాజ శ్యామల యాగం నిర్వహించిన విషయం తెలిసిందే. అలా డింపుల్ హయతి, నిధి అగర్వాల్, అనన్య నాగళ్ళ, ప్రగతి, రష్మిక మందన్న లాంటి సెలబ్రిటీలు వేణు స్వామితో ప్రత్యేక పూజలు చేయించుకున్నారు. అలా గతంలో వేణు స్వామి దగ్గర పూజలు చేయించుకున్న డింపుల్ హయతి తాజాగా ఈ విషయంపై స్పందించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

వేణు స్వామి పై డింపుల్ హయతి కీలక వ్యాఖ్యలు..

Advertisement

డింపుల్ హయతి చాలాకాలం విరామం తీసుకుని ఇప్పుడు రవితేజ తో భర్త మహాశయులకు విజ్ఞప్తి అనే సినిమాలో నటిస్తోంది. ఇందులో ఆషిక రంగనాథ్ కూడా మరో హీరోయిన్గా నటిస్తోంది. నేను శైలజ సినిమా దర్శకుడు కిషోర్ కే తిరుమల ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఫ్యామిలీ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే పలు ప్రమోషన్స్ కార్యక్రమాలు చేపట్టిన డింపుల్ హయతి పలు ఇంటర్వ్యూలకు హాజరవుతూ తన వ్యక్తిగత, వృత్తిపరమైన విషయాలను పంచుకుంటూ వార్తల్లో నిలుస్తోంది.

పూజ చేయించుకున్నంత మాత్రాన స్టార్స్ అయిపోతారా?

ఈ నేపథ్యంలోనే వేణు స్వామి గురించి , ఆయనతో తాను జరిపించిన పూజల గురించి మాట్లాడుతూ.. కేవలం పూజలు చేయించుకోవడం వల్ల స్టార్స్ అయిపోతారు అంటే నేను నమ్మను. తరచూ నేను గుడికి వెళ్తాను. పెద్దవాళ్ళు చెప్పారని మాత్రమే పూజలు కూడా చేశాను. ఎవరో ఏదో అన్నంత మాత్రాన.. పూజలు చేసినంత మాత్రాన ఇక్కడి కెరియర్ మారిపోవడం అనేది జరగదు. ఇండస్ట్రీలో కావాల్సింది కష్టం.. కాసింత ఓపిక .. నేను ఏంటి అనేది నా వాళ్లకు తెలుసు.. దేనికైనా సరే సమయం రావాలి.. అప్పుడే అన్ని బయటకు వస్తాయి అంటూ చెప్పుకొచ్చింది. మొత్తానికైతే డింపుల్ అయితే చేసిన కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. మరి దీనిపై వేణు స్వామి ఏదైనా స్పందిస్తారేమో చూడాలి. అయితే ఇది విన్న నెటిజెన్స్ మాత్రం పూజా ఫలితం లభించలేదు. అందుకే డింపుల్ అయితే అలాంటి మాటలు మాట్లాడుతోంది అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.

Advertisement

ALSO READ:Tollywood: జననాయగన్ ఎఫెక్ట్.. ఓటీటీలో భగవంత్ కేసరి రికార్డ్

Related News

రికార్డుల వేటలో ‘ది ఒడిస్సీ’..మన మేకర్స్ ఇప్పటికైనా మారతారా?

విదేశాల్లో షాట్లు.. ఏపీలో ఓట్లు! టాలీవుడ్ స్టార్స్‌పై అంబికా కృష్ణ మార్కు కౌంటర్లు!

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

హైదరాబాద్‌లో ‘వైఫ్ ఎక్స్ఛేంజ్’ కల్చర్ ఉందంటూ హీరోయిన్ మాధవీలత సంచలన వ్యాఖ్యలు!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

Big Stories

Advertisement
×