E-Paper
Advertisement

Renu Desai : కోట్ల ఆస్తికి వారసురాలు.. ఆ ఒక్కటే బాధ.. ఇప్పుడేం ఏం చేస్తుందంటే..?

Renu Desai : కోట్ల ఆస్తికి వారసురాలు.. ఆ ఒక్కటే బాధ.. ఇప్పుడేం ఏం చేస్తుందంటే..?
Advertisement

Renu Desai :  టాలీవుడ్ హీరోయిన్, పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. ఒకప్పుడు తెలుగులో అడపాదడపా సినిమాలు చేసింది. అయితే పవన్ కళ్యాణ్ తో పెళ్లి తర్వాత అసలు ఇండస్ట్రీకి దూరమైంది. ఇన్నేళ్లకు మళ్లీ ఈమె రీఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం ఓ మూవీలో కీలక పాత్రలో నటిస్తుంది. ఈ మధ్య ఏదొక టాపిక్ వల్ల వార్తల్లో నిలుస్తుంది. తాజాగా పెట్టిన ప్రెస్ మీట్లో ఆమె చేసిన కొన్ని కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయాయి.. ఇదిలా ఉండగా తాజాగా ఓ యూట్యూబ్ ఛానెల్ కు ఇంటర్వ్యూ ఇచ్చింది.. అందులో తన ఆస్తులు, బిజినెస్ లతో పాటుగా వెయిట్ పెరగడానికి కారణాలను చెప్పింది. ప్రస్తుతం ఆ ఇంటర్వ్యూ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..

కోట్లట్లో ఆస్తులు.. 

సినీనటి రేణు దేశాయ్ తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ వచ్చింది. అందులో ఆమె మాట్లాడుతూ తన ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ గురించి చెప్పుకొచ్చింది. చిన్నప్పటినుంచి తాత అలాగే నాన్న ఇద్దరు కూడా రియల్ ఎస్టేట్లో ఉండే వాళ్ళని చెప్పింది. అయితే ఆ మాట వినగానే యాంకరు మీరు కోటీశ్వరులు అన్నమాట అని అడుగుతారు. దానికి రేణు దేశాయ్ ఏం చెప్పాలన్నా భయమేస్తుంది. ఎవరు ఏం రాసుకుంటారో తెలియట్లేదు అని రేణు దేశాయ్ అంటుంది.. పర్వాలేదు బాగానే ఉన్నాం అని సమాధానం చెప్పింది. అయితే నాకు మోడలింగ్ అంటే ఇంట్రెస్ట్ కాబట్టి అలా నేను మోడలింగ్ లోకి వచ్చేసాను అని ఆమె అన్నారు. ఆ తర్వాత సినిమా ఆఫర్లు రావడంతో మెల్లగా సినిమాల్లోకి వచ్చినట్లు రేణు దేశాయ్ చెప్పుకొచ్చారు.. ఒక్కొక్కరూ ఒక్కొక్క లాగా అనుకుంటున్నారు తప్ప ఎవరిది అన్నది ఇక్కడ ఎవరు ఆలోచించడం లేదు అని రేణు దేశాయ్ ఇన్ డైరెక్ట్ గా పవన్ ఉద్దేశించి మాట్లాడింది.. ఈ వీడియో వైరల్ అవ్వడంతో రేణు దేశాయ్ కోటీశ్వరాలు అని నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు..

అనారోగ్య సమస్యలు.. 

Advertisement

అంతే కాదు ఆమె మాట్లాడుతూ తనకున్న అనారోగ్య సమస్య గురించి వివరించింది. అది ఫ్యామిలీలో జన్యుపరంగా వచ్చినట్లు చెప్పుకొచ్చింది. హార్ట్ బీట్ ఎక్కువగా ఉండడం, ఆయాసం, ఎక్కువసేపు నిలబడలేకపోవడం ఇలాంటి సమస్యలన్నీ ఆమెను వెంటాడుతున్నాయని చెప్పింది. ట్రీట్మెంట్ తీసుకుంటూ మెడిసిన్స్ యూస్ చేయడం వల్ల తాను వెయిట్ పెరిగినట్లు చెప్పింది. కానీ నేను వెజిటేరియన్ కాబట్టి డైట్ ని ఫాలో అవుతూ కంట్రోల్ చేసుకుంటున్నాను అని ఆమె అంటున్నారు.

Also Read :చావుబ్రతుకుల్లో ప్రతాప్.. ఇంట్లోంచి వెళ్ళిపోయిన కోడలు..కన్నీళ్లు పెట్టుకున్న లలిత..

రేణు దేశాయ్ ఏం చేస్తుందంటే..? 

Advertisement

పవన్ కళ్యాణ్ తో పెళ్లి చేసుకున్న తర్వాత ఈమె సినిమాలకు దూరమైన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఎటువంటి సినిమాల్లోనూ కనిపించలేదు. ఇక విడాకులు తర్వాత కూడా ఆమె సినిమాల్లో కనిపించాలని అనుకోలేదు. కేవలం పిల్లల్ని చూసుకుంటూ తన పనేంటో తాను చేసుకుంటూ వెళ్ళేది. అయితే ఆమె రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న విషయాన్ని ఎన్నాళ్ల తర్వాత బయటపెట్టింది. ప్రస్తుతం నేను అందులో బిజీగా ఉన్నాను అని అన్నారు. ఇప్పుడు పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు కదా నాకు నచ్చిన క్యారెక్టర్ గనుక వస్తే కచ్చితంగా చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తానని రేణు దేశాయ్ సినిమాల గురించి చెప్పుకొచ్చింది.. ప్రస్తుతం ఈ ఇంటర్వ్యూ వీడియో వైరల్ అవ్వడంతో రేణు దేశాయ్ గురించి ఆసక్తికర విషయాలు వెలుగు చూసాయి..

Related News

పవన్ కళ్యాణ్‌తో విడిపోయాక నా పరిస్థితి ఇదే.. రేణు దేశాయ్ కామెంట్స్!

నవరాత్రుల వేళ హెబ్బా పటేల్ స్పెషల్ ట్రీట్..ఫ్యాన్స్‌కు కనువిందే!

జ్యోతి పూర్వజ్, పూర్వాజ్ మూవీ ‘కిల్లర్’.. ఒకేసారి రెండు అప్డేట్స్!

‘స్పిరిట్’ వాయిదా.. ఫ్యాన్స్‌కు కొత్త రిలీజ్ డేట్ ప్రకటించిన సందీప్ రెడ్డి వంగా!

గరివిడి లక్ష్మి సినిమాపై రవితేజ రివ్యూ.. ఏమన్నారంటే?

ఏడేళ్ల వయసులోనే సాఫ్ట్వేర్ సంస్థకు యజమాని.. ‘జైలర్’ బుడ్డోడు చిన్నోడు కాదండోయ్!

‘గరివిడి లక్ష్మి’లో ఆర్పీ పట్నాయక్ పాత్ర వెనుక అసలు కథ ఇదేనా?

క్యాస్టింగ్ కౌచ్‌పై ఝాన్సీ ఏమన్నారంటే.. ఇండస్ట్రీలో మహిళల పరిస్థితి ఇదేనా?

Big Stories

Advertisement
×