E-Paper
Advertisement

Podarillu Today Episode : చావుబ్రతుకుల్లో ప్రతాప్.. ఇంట్లోంచి వెళ్ళిపోయిన కోడలు..కన్నీళ్లు పెట్టుకున్న లలిత..

Podarillu Today Episode : చావుబ్రతుకుల్లో ప్రతాప్.. ఇంట్లోంచి వెళ్ళిపోయిన కోడలు..కన్నీళ్లు పెట్టుకున్న లలిత..
Advertisement

Podarillu Today Episode January 25th: నిన్నటి ఎపిసోడ్ లో.. మహా స్నానానికి వెళుతుంది. నారాయణ తన ఇంటికి గొప్పింటి కోడలు వచ్చిందంటూ చంకల గుద్దుకుంటూ అందరితో చెబుతూ ఉంటాడు. అది చూసిన రమణయ్య ఓర్వలేక మాటకు మాట సమాధానం చెప్తాడు.. ఇన్ని రోజులు అదేదో శాపాలు పెట్టింది మా ఇంటికి తగిలింది అని చెప్పేసి చాలా మాటలు అన్నారు. ఇప్పుడు నా ఇంటికి గొప్పింటి కోడలు వచ్చింది అని నారాయణ అంటాడు. కోట్లు కోట్లు ఉన్న ఇంటి నుంచి నా ఇంటికి నా కొడుకే కావాలని వచ్చింది అని నారాయణా అనగానే అంత చదువు చదివి అన్ని కోట్లు ఉన్న అమ్మాయి ఎందుకు మీ ఇంటికి వచ్చింది అని అందరూ అంటారు. మహాలక్ష్మి మా నాన్నతో మాట్లాడక చాలా రోజులవుతుంది మా ఇంట్లో వాళ్ళు నాకు బాగా గుర్తొస్తున్నారు అని చక్రిని ఫోన్ అడుగుతుంది. మీ దగ్గర ఫోన్ నెంబర్ ఉందా అని అడుగుతుంది. మా వదిన నెంబర్ కూడా గుర్తు లేదు అని మహా ఫీల్ అవుతుంది.. మీ దగ్గర ఉందా అని చక్రిని అడుగుతుంది..

మహా హారికతో మాట్లాడుతుంది. అమ్మ నాన్న ఎలా ఉన్నారు వదినా అని అడుగుతుంది. నువ్వు వెళ్లిపోవడంతో పరువు పోయిందని మీ నాన్న చనిపోవడానికి ఏవో మాత్రలు వేసుకున్నాడు. ఆయన పరిస్థితి క్రిటికల్ గానే ఉంది అనే డాక్టర్లు చెబుతున్నారు. ఎందుకు మహా నువ్వు ఇలా చేశావు అని హారిక అడుగుతుంది. ప్రతాప్ ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడని తెలుసుకున్న మహా తన తండ్రి కోసం కన్నీళ్లు పెట్టుకుంటుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది..

Advertisement

ఇక ఇవాళ ప్రోమో విషయానికి వస్తే..బాధపడకమ్మా మీ నాన్నకి ఏమీ కాదు అని మాధవ్ అంటాడు. అయితే చక్రి అందరు కూడా మహని వాళ్ళ నాన్నను చూడడానికి వెళ్ళమని చెప్తారు. కన్నా నువ్వేం బాధపడకు వదిన మీ నాన్నకు ఏమీ కాదు అని ధైర్యం చెప్తాడు. ఇది విన్న వ్యక్తి అక్కడికి వెళ్లి వేరేలా చెప్పాలని రమణయ్య దగ్గరికి వెళ్లి మీ కోడలు వెళ్ళిపోతుంది  రమణయ్య చెప్పిందే నిజమైంది అని అనగానే అతను చాలా సంతోషంగా ఉంటాడు. ఏం మాట్లాడుతున్నారా నా కోడలు వెళ్లిపోవడం ఏంటి అని నారాయణ గొడవకు దిగుతాడు. అదిగో కార్ వస్తుంది ఒకసారి చూడు. నీ కోడలు నీ కొడుకు వస్తున్నారు చూడు అని అక్కడ ఉన్న వాళ్ళందరూ అంటారు.. అప్పుడే చక్రి మహా కారులో అక్కడ రావడం చూస్తాడు నారాయణ..

చూసావా మీ కోడలు ఏడ్చుకుంటూ వెళ్ళింది. మీ కొడుకుని నమ్మొచ్చింది ఇప్పుడు ఇక్కడ పరిస్థితిని చూసి తను ఇక్కడ ఉండలేను అని వెళ్ళిపోతుంది అని రమణయ్య అంటాడు. అది చూసిన నారాయణ ఎందుకు వెళ్ళిపోతుందని ఆలోచిస్తూ ఉంటాడు. కానీ రమణయ్య మాత్రం డాన్సులు కట్టావుగా నా కోడలు నాకు ఏమీ లేదు అని ఇప్పుడు ఏం చేస్తావు. నువ్వు ఇప్పుడు వేయరా డ్యాన్సులు అని ఎగతాళి చేస్తాడు.. నారాయణను అందరూ తలా ఒక మాట అనడంతో బాధపడుతూ ఇంటికి వచ్చేస్తాడు.

Advertisement

మాధవ్ వాళ్లను ఏమైంది అని అడుగుతాడు. కోడలు పిల్ల నిజంగానే ఇంట్లోంచి వెళ్లిపోయిందా? నలుగురు నాలుగు రకాలుగా మాట్లాడుకుంటున్నారు. అసలు ఏం జరిగింది రా అని అడుగుతాడు. ఇంట్లో నుంచి వెళ్లిపోలేదు నాన్న వాళ్ళ నాన్న ఈ అమ్మాయి లేదు అని ఆత్మహత్య చేసుకుని చనిపోవాలనుకున్నాడట. ప్రస్తుతం ఆయన హాస్పిటల్ లో చావు బతుకులో ఉన్నాడని తెలుసుకున్న అమ్మాయి తనని తీసుకొని వెళ్ళమని చక్రిని అడిగితే మేమే తీసుకుని వెళ్ళమని చెప్పాము అని అంటాడు. అంతే కదా కోడలు పిల్ల వెళ్ళిపోలేదు కదా అని నారాయణ అంటాడు. మీకు ఎవరో తప్పుగా చెప్పారు నాన్న అక్కడ ఏమి జరగలేదు అని అంటాడు మాధవ్.

ఇక తర్వాత చక్రీతో కలిసి హాస్పిటల్ కి వెళ్లిన మహా వాళ్ళ నాన్నని బెడ్ పై చూసి కన్నీళ్లు పెట్టుకుంటుంది. నేను వచ్చేసాను నాన్న లేవు నాన్న అని ఏడుస్తుంది. అది చూసిన లలిత ఎందుకే నువ్వు మళ్ళీ వచ్చావు చచ్చాడో బతికాడో చూడ్డానికి వచ్చావా అని అంటుంది.. నేను మీ కూతురు అమ్మ నేను ఏ తప్పు చేయలేదు ఎందుకు మీరు నన్ను అంతగా ఇది చేస్తున్నారు అని మహా అడుగుతుంది. నువ్వే తప్పు చేయకపోతే మరి ఇదేంటి అని లలిత అంటుంది. పులి లాంటి నా భర్తని ఇలా బెడ్ పై పడేలా చేశావు నువ్వు బాగుపడవే అని లలిత శాపాలు పెడుతుంది.

Also Read :పల్లవికి అవని స్ట్రాంగ్ వార్నింగ్.. సంతకం పెట్టని అవని.. చక్రధర్ గురించి బయటపడ్డ నిజాలు..

నువ్వు ఇక్కడి నుంచి వెంటనే వెళ్ళిపో ఆయనకు స్పృహ వచ్చి నిన్ను చూసాడంటే కచ్చితంగా బాధపడతాడు ఆయన మాకు దక్కడు అని బాధపడుతుంది లలిత. ఇక నువ్వు ఎందుకు వచ్చావు మహా వెళ్ళిపో ఇక్కడ ఎవరైనా చూస్తే బాగోదు ఆది చూస్తే ఖచ్చితంగా నేను చంపేస్తాడు అని అంటుంది. మహానే చక్రీ తీసుకొని వెళ్లడానికి ప్రయత్నం చేస్తాడు.. మహా మాత్రం మా నాన్నని ఇలా వదిలిపెట్టి ఎలా రావాలి అని బాధ పడిపోతూ ఉంటుంది. అక్కడితో ప్రోమో ఎండ్ అవుతుంది. సోమవారం ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి..

Related News

బిగ్ బాస్ 10 ఫైనల్ కంటెస్టెంట్స్ వీరే.. దశావతారం వర్కౌట్ అవుతుందా?

కృష్ణాష్టమి స్పెషల్.. ‘రాధా’గా మారిన అనసూయ.. వీడియో వైరల్!

అవినాష్, అరియానా మధ్య గొడవలు నిజమేనా? బయటపెట్టిన శ్రీముఖి!

Nindu Noorella Saavasam Serial Today Episode September 4th  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆత్మ కోసం ప్రచండ ప్రత్యేక పూజ  

Gundeninda GudiGantalu Today episode: మీనాను దెబ్బ అదుర్స్.. సంజుకు దిమ్మతిరిగే షాక్.. బాలుకు రాఖీ కట్టిన మౌనిక..

Ninnu kori Serial Today Episode September 4th ‘నిన్ను కోరి’ సీరియల్‌: చంద్రకు నిజం తెలిసిందన్న మందర – షాక్‌ అయిన మాయ      

Podarillu Today Episode : చక్రితో అంట్లు కడిగించిన మహా.. నారాయణ హర్ట్.. జయంతి మాటతో షాక్..

Karthika Deepam 2 Serial Today Episode September 4th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలిని ఇంట్లో పని మనుషుల్లాగా ఉంటామన్న దీప, కార్తీక్         

Big Stories

Advertisement
×