E-Paper
Advertisement

నాన్న పరిచయం చేసిన అబ్బాయినే ప్రేమించా.. కానీ పెళ్లికి ఒప్పుకోలేదు!

నాన్న పరిచయం చేసిన అబ్బాయినే ప్రేమించా.. కానీ పెళ్లికి ఒప్పుకోలేదు!
Advertisement

Chetana Uthej:టాలీవుడ్ నటుడు ఉత్తేజ్ కుమార్తె చేతన తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన జీవితంలో ఎదురైన చేదు అనుభవాలను పంచుకుంది. ముఖ్యంగా తన తల్లి పద్మ క్యాన్సర్ బారిన పడటం, ఆ సమయంలో తాను ఎదుర్కొన్న మానసిక సంఘర్షణ, తల్లి చనిపోయిన తర్వాత తన జీవితం గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయింది. అలాగే తన ప్రేమ, పెళ్లి విషయంలో కుటుంబంలో ఎదురైన పరిస్థితులను కూడా ఇలా చెప్పుకొచ్చింది.

అమ్మకు క్యాన్సర్ అని తెలిసి షాక్ అయ్యా!

Advertisement

తన తల్లికి క్యాన్సర్ వచ్చిందని తెలిసినప్పుడు తాను షాక్‌కు గురయ్యానని బాధ పడింది.. ఆ సమయంలో తాను ఓ సినిమా కోసం అసోసియేట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నానని చెప్పింది.తన ఫ్యామిలీ డాక్టర్ ఫోన్ చేసి తల్లి ఆరోగ్యం గురించి చెప్పడంతో ఏం చేయాలో అర్థం కాలేదని ,అప్పటికే తల్లితో తనకు గొడవలు అవడం మూలాన మాట్లాడాలా వద్దా అనే డైలమాలో పడిపోయానని వాపోయింది.

అయితే తల్లి కూడా తనతో మాట్లాడాలని ప్రయత్నించేదని, మెసేజ్‌లు పెట్టి మళ్లీ డిలీట్ చేసేదని తన తండ్రి ఏమనుకుంటారోననే భయంతో ఆమె అలా చేసేదని తెలిపింది.చివరకు కొన్ని రోజుల తర్వాత తల్లితో మాట్లాడానని, ఆ సమయంలో ఇద్దరూ మనసు విప్పి మాట్లాడుకున్నామని బాధ పడింది.

Advertisement

మూడు నెలలే అమ్మతో కలిసి ఉండగలిగా

అయితే తన తల్లితో తిరిగి మాట్లాడటం ప్రారంభించిన కొద్దికాలానికే పరిస్థితులు మారిపోయాయని చేతన ఆవేదన వ్యక్తం చేసింది.. జూన్ 13న తల్లి దగ్గరకు వెళ్లానని, సెప్టెంబర్ 13న ఆమె చనిపోయిందని గుర్తుచేసుకుంది .. తాను గర్భవతిగా ఉన్న సమయంలో తల్లిని కోల్పోవడం తన జీవితంలో మర్చిపోలేని విషాదమని చెప్పుకొచ్చింది.

ఇక తన తల్లి చాలా ధైర్యంగా ఉండేదని, సాధారణంగా రోగాల భారిన పడటం కూడా తాను పెద్దగా చూడలేదని తెలిపింది. అలాంటి వ్యక్తికి క్యాన్సర్ రావడం తమ కుటుంబానికి పెద్ద షాక్ అని చెప్పుకొచ్చింది.
తను ఆరు నెలల పాటు కీమోథెరపీ తీసుకుంటూ ఎంతో పోరాడారని ఆ రోజులని గుర్తు చేసుకుంది.

నా బిడ్డను చూడలేనేమోనని అమ్మ ఏడ్చింది!

ఇక తన తల్లి మరణానికి కొద్ది రోజుల ముందు జరిగిన సంఘటనను గుర్తుచేసుకుంటూ చేతన ఎమోషనల్ అయ్యింది.. తన బిడ్డను చూడలేనేమోనని తన తల్లి తనను, తన భర్త రవిని పట్టుకుని ఏడ్చారని చెప్పింది .

. ఆ మాటలు విన్నప్పుడు తన బాధను మాటల్లో చెప్పలేకపోయానని తెలిపింది . అయినప్పటికీ తల్లికి ధైర్యం చెబుతూ పండుగ చేసుకుందామని, అంతా బాగుంటుందని అనుకునేలా ప్రయత్నించానని వెల్లడించింది.

తల్లి తనతో ఉన్న సమయంలో ఎన్నో విషయాలు మాట్లాడుకున్నామని, ఆమె చిన్ననాటి జ్ఞాపకాలను కూడా రికార్డు చేసుకున్నానని చెప్పింది .. భవిష్యత్తులో అమ్మ గొంతు వినాలనే ఉద్దేశంతో అలా చేశానని,. అయితే ఆ మూడు నెలల్లో తల్లితో సరిగ్గా ఫొటోలు కూడా తీసుకోలేకపోయానని బాధపడింది. తన సీమంతం సమయానికి ఆరోగ్యం బాగైతే కలిసి ఫొటోలు దిగుదామని తల్లి చెప్పిన విషయాన్ని గుర్తుచేసుకుని ఎమోషనల్ అయ్యింది.

ప్రేమ పెళ్లికి కుటుంబం ఒప్పుకోలేదు..

తన ప్రేమ, పెళ్లి గురించి ,మాట్లాడుతూ తన భర్త రవిరాజ్‌ను తండ్రి ఉత్తేజ్‌నే పరిచయం చేశారని చెప్పింది. రవి మంచి నటుడు, డ్యాన్సర్ అని, ఎంతో కష్టపడుతున్నాడని తండ్రి తనకు చెప్పినట్లు వివరించింది .. అలా మొదలైన పరిచయం స్నేహంగా మారి, తర్వాత ప్రేమగా మారిందని తెలిపింది.

అయితే తాము ప్రేమలో ఉన్నామని తల్లిదండ్రులకు చెప్పినప్పుడు అంగీకరించలేదని, తనకు, రవికి కొంత సమయం తీసుకోవాలని ఉన్నప్పటికీ పరిస్థితులు వేగంగా మారిపోయాయని చెప్పింది. కుటుంబంలో జరిగిన గొడవల కారణంగా ఇంటి నుంచి బయటకు వచ్చానని, చివరకు పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందని వివరించింది.

అయితే తన తల్లిదండ్రులు ఎందుకు తమ పెళ్లికి అంగీకరించలేదో ఇప్పటికీ పూర్తిగా అర్థం కాలేదని , తాను, తన భర్త ఎన్నోసార్లు కూర్చొని మాట్లాడుకుందామని ప్రయత్నించినా సరైన కారణం తెలియలేదని వాపోయింది.

అమ్మానాన్న లేని పెళ్లి చేసుకోవడం బాధగా అనిపించింది!

పెళ్లి సమయంలో తల్లిదండ్రులు, చెల్లి తన పక్కన లేకపోవడం బాధ కలిగించిందని తెలిపింది.. తాను పారిపోయి పెళ్లి చేసుకున్నట్లు అనుకోవద్దని, పరిస్థితులు అలా మారిపోయాయని చెప్పింది. తల్లి మరణం తర్వాత కుటుంబంతో తనకు దూరం మరింత పెరిగిందని, తండ్రితో దాదాపు రెండేళ్లుగా మాట్లాడలేదని బాధపడిపోయింది.

ALSO READ:అబ్బా.. చీరలో రుక్మిణి వసంత్ లుక్ మామూలుగా లేదుగా!

Tags

Related News

వియత్నాం ట్రిప్ ఫొటోలతో కుర్రాళ్లను ఫిదా చేస్తున్న మినాక్షి

మా హీరో గొప్పంటే మా హీరో గొప్ప.. ఫ్యాన్ వార్స్‌పై విశ్వక్ సేన్ ఫైర్

అబ్బా.. చీరలో రుక్మిణి వసంత్ లుక్ మామూలుగా లేదుగా!

రణబాలి డైరెక్టర్ గురించి ఈ విషయాలు మీకు తెలుసా?

రజినీకాంత్‌తో ‘జైలర్’ తీసిన నెల్సన్.. ఒకప్పుడు ఏం చేసేవారో తెలుసా?

‘మంగళవారం’లో పులిరాజు పాత్ర వెనుక ఇంత కథ ఉందా?

రింగ్ దొరకక ప్రపోజ్ చేయలేదు.. ఆ మూమెంట్ మిస్సయిన రష్మిక: విజయ్ దేవరకొండ

Big Stories

Advertisement
×