E-Paper
Advertisement

Rahul Sipligunj Cult Webseries : రాహుల్ సిప్లిగంజ్‌కు హైకోర్టు షాక్..కల్ట్ వెబ్ సిరీస్ విడుదలకు అడ్డంకి..!

Rahul Sipligunj Cult Webseries : రాహుల్ సిప్లిగంజ్‌కు హైకోర్టు షాక్..కల్ట్ వెబ్ సిరీస్ విడుదలకు అడ్డంకి..!
Advertisement

Rahul Sipligunj Cult Webseries : సింగర్‌గా..అలాగే బిగ్ బాస్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న రాహుల్ సిప్లిగంజ్ మరోసారి వార్తల్లో నిలిచారు. ఆయన నటిస్తున్న ‘కల్ట్’ అనే వెబ్ సిరీస్ విషయమై తెలంగాణ హైకోర్టులో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ వెబ్ సిరీస్‌పై దాఖలైన పిటిషన్‌ను కోర్టు లంచ్ మోషన్‌గా స్వీకరించి విచారణ చేపట్టింది.

ఈ కేసులో తెలంగాణ హై కోర్టు రాహుల్ సిప్లిగంజ్‌తో పాటు వెబ్ సిరీస్ దర్శకుడు, సినీ బృందం.. అలాగే డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లకు నోటీసులు జారీ చేసింది. ఫేస్‌బుక్ మాతృసంస్థ అయిన మెటా ప్లాట్ ఫామ్ అలానే గూగుల్ కు కోర్టు నోటీసులు పంపింది. ఈ వ్యవహారం ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చర్చనీయాంశంగా మారింది.

Advertisement

పిటిషనర్ ఉత్తం వల్లూరి చౌదరి కోర్టులో వాదిస్తూ, మదనపల్లి చిన్నారుల హత్య కేసు ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉందని తెలిపారు. ఆ కేసును ఆధారంగా తీసుకుని తప్పుడు కథతో వెబ్ సిరీస్ రూపొందించి.. ఈ నెల 17న విడుదల చేయడానికి ప్రయత్నించడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. ఇలా చేయడం వల్ల తమ పరువు ప్రతిష్ఠకు భంగం కలుగుతుందని పిటిషన్‌లో పేర్కొన్నారు.

పిటిషనర్ తరఫున ప్రముఖ న్యాయవాది రామారావు ఇమ్మానేని వాదనలు వినిపించారు. కోర్టు ఈ వాదనలను పరిశీలించిన అనంతరం సంబంధిత వారందరికీ నోటీసులు జారీ చేస్తూ, తదుపరి విచారణను ఈ నెల 20వ తేదీకి వాయిదా వేసింది.

Advertisement

ఇక రాహుల్ సిప్లిగంజ్ విషయానికి వస్తే, ఆయన సింగర్‌గా ప్రజల్లో మంచి ఆదరణ పొందారు. బిగ్ బాస్ షో ద్వారా మరింత దగ్గరయ్యారు. ఇప్పుడు నటుడిగా కూడా అవకాశాలు పొందుతున్నారు. అయితే ‘కల్ట్’ వెబ్ సిరీస్ చుట్టూ ఏర్పడిన ఈ న్యాయపరమైన వివాదం ఆయన కెరీర్‌పై ఎలాంటి ప్రభావం చూపుతుందోనని అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

హైకోర్టు తుది తీర్పు వచ్చే వరకు ఈ వెబ్ సిరీస్ విడుదలపై స్పష్టత రానుంది. ఈ వ్యవహారం ఎలా మలుపు తిరుగుతుందో చూడాలి.

ALSO READ: AA22 x A6: అట్లీ-అల్లు అర్జున్ సినిమా గురించి ఫేక్ రిపోర్ట్స్.. మోసపోయిన ఫ్యాన్స్..!

Related News

ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు చిత్రం ఏంటో తెలుసా?

నేషనల్ అవార్డ్స్ రేసులో ధనుష్ రికార్డ్… ‘కలాం’ బయోపిక్‌పై హైప్!

ఆ హీరోతో అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్?

Sharmiela mandre :చడీ చప్పుడు లేకుండా పెళ్లి చేసుకున్న అల్లరి నరేష్ హీరోయిన్.. వరుడు ఎవరంటే?

38ఏళ్ల తర్వాత తండ్రి నాగబాబు రికార్డును రిపీట్ చేసిన నిహారిక!

సైలెంట్ గా నిశ్చితార్థం.. పెళ్లికి సిద్ధమైన టాలీవుడ్ హీరో!

కళ్ళు లేవు.. మైమరిపించే గాత్రానికి నేషనల్ అవార్డు.. ఎవరీ సింగర్?

విజువల్ వండర్ గా రామాయణ ట్రైలర్.. అఫీషియల్ ఎప్పుడంటే?

Big Stories

Advertisement
×