E-Paper
Advertisement

AA22 x A6: అట్లీ-అల్లు అర్జున్ సినిమా గురించి ఫేక్ రిపోర్ట్స్.. మోసపోయిన ఫ్యాన్స్..!

AA22 x A6: అట్లీ-అల్లు అర్జున్ సినిమా గురించి ఫేక్ రిపోర్ట్స్.. మోసపోయిన ఫ్యాన్స్..!
Advertisement

Allu Arjun next movie update: సోషల్ మీడియా పుణ్యమా అని పెద్ద హీరోలకి సంబంధించిన ఏ సినిమా వార్త వచ్చినా క్షణాల్లో వైరల్ అవుతోంది. ఈమధ్య ఒక భారీ ప్రాజెక్ట్ గురించి కూడా పెద్ద హడావిడి జరిగింది. అదే అల్లు అర్జున్ అట్లీ కాంబోలో రాబోతున్న సినిమాను తాత్కాలికంగా AA22 x A6 అనే టైటిల్‌తో ఫ్యాన్స్ పిలుస్తున్నారు.
తాజాగా సోషల్ మీడియాలో ఒక వార్త బాగా వైరల్ అయింది. ఈ సినిమాలో బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ కూడా నటిస్తున్నాడు అన్న రిపోర్ట్ బయటకు వచ్చింది.

అల్లు అర్జున్ సినిమా మీద ఊహాగానాలు..

ఈ వార్త మొదటగా ఒక పెద్ద తెలుగు ఛానల్‌లో వచ్చినట్లు ప్రచారం జరిగింది. అంతే అల్లు అర్జున్ ఫ్యాన్స్, అట్లీ ఫ్యాన్స్, టైగర్ ష్రాఫ్ అభిమానులు అందరూ ఒక్కసారిగా ఈ వార్తపై చర్చలు మొదలుపెట్టారు. ఇది పాన్ ఇండియా కాదు ఏకంగా పాన్ వరల్డ్ సినిమా అవుతుంది అంటూ కామెంట్స్.. వచ్చాయి. అల్లు అర్జున్ టైగర్ ష్రాఫ్ ఒకే సినిమాలో అంటే యాక్షన్ సీన్స్ ఏ రేంజ్‌లో ఉంటాయో అని ఊహించుకున్నారు. కొందరైతే కథలో కీలక పాత్రలో టైగర్ ఉంటాడని, మరికొందరు నెగటివ్ షేడ్ క్యారెక్టర్ అని ఊహాగానాలు కూడా మొదలుపెట్టేశారు.

అల్లు అర్జున్ సినిమా గురించి ఫేక్ వార్తలు..

Advertisement

ఈ హైప్ అంత ఎక్కువ రోజులు నిలవలేదు. ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాలు ఈ వార్తను పూర్తిగా ఖండించాయి. టైగర్ ష్రాఫ్‌కు AA22 x A6 సినిమాతో ఎలాంటి సంబంధం లేదు. అసలు ఈ ప్రాజెక్ట్ గురించి అతనితో ఎప్పుడూ చర్చ కూడా జరగలేదట. ఏ దశలో కూడా అతని పేరు పరిశీలనలోకి కూడా రాలేదని స్పష్టంగా చెప్పారు. ఈ రిపోర్ట్ మొత్తం ఆధారం లేని వార్త అని తేలిపోయింది. కేవలం సోషల్ మీడియాలో క్లిక్స్, వ్యూస్ కోసం ఈ న్యూస్‌ని స్ప్రెడ్ చేశారని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.

ప్రస్తుతం AA22 x A6 సినిమా ఇంకా ప్రారంభ దశలోనే ఉంది. స్క్రిప్ట్, వర్క్‌షాప్స్, ప్రీ-ప్రొడక్షన్ పనులు మాత్రమే జరుగుతున్నాయని సమాచారం. ఈ సినిమాలో అల్లు అర్జున్‌ను ఇప్పటివరకు చూడని కొత్త లుక్‌లో చూపించబోతున్నారట. అట్లీ స్టైల్ మాస్ + ఎమోషన్ యాక్షన్ కలిపి ఓ భారీ ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. కాస్టింగ్ విషయంలో ఇంకా అధికారికంగా ఎవరినీ అనౌన్స్ చేయలేదు. అందుకే రోజుకో కొత్త పేరు బయటకు వస్తోంది.

Advertisement

టైగర్ ష్రాఫ్ ఈ ప్రాజెక్ట్‌లో లేరు కానీ తన వేరే సినిమాలతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం లగ్ జా గలే అనే యాక్షన్ డ్రామా సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్నారు. ఇటీవల ఈ సినిమా సెట్స్ నుంచి కొన్ని లీక్ వీడియోలు బయటకు వచ్చాయి. అందులో టైగర్ చేస్తున్న ఇంటెన్స్ యాక్షన్ సీన్స్ ఫ్యాన్స్‌ను ఆకట్టుకున్నాయి.

ALSO READ: Thalapathy Vijay: జన నాయకుడి వల్ల డివివి దానయ్యకు అదృష్టం..ఎందుకో తెలుసా..

Related News

కన్నీటి పర్యంతమవుతున్న మహారాజా హీరోయిన్.. అసలేం జరిగిందంటే?

డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ వివాదం..ఫిలిం ఫెడరేషన్ అత్యవసర సమావేశం!

ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు చిత్రం ఏంటో తెలుసా?

నేషనల్ అవార్డ్స్ రేసులో ధనుష్ రికార్డ్… ‘కలాం’ బయోపిక్‌పై హైప్!

ఆ హీరోతో అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్?

Sharmiela mandre :చడీ చప్పుడు లేకుండా పెళ్లి చేసుకున్న అల్లరి నరేష్ హీరోయిన్.. వరుడు ఎవరంటే?

38ఏళ్ల తర్వాత తండ్రి నాగబాబు రికార్డును రిపీట్ చేసిన నిహారిక!

సైలెంట్ గా నిశ్చితార్థం.. పెళ్లికి సిద్ధమైన టాలీవుడ్ హీరో!

Big Stories

Advertisement
×