E-Paper
Advertisement

SS Rajamouli : మా మనోభావాలు దెబ్బతిన్నాయి… రాజమౌళిపై ఫిర్యాదు చేసిన హిందూ సంఘం..

SS Rajamouli : మా మనోభావాలు దెబ్బతిన్నాయి… రాజమౌళిపై ఫిర్యాదు చేసిన హిందూ సంఘం..

SS Rajamouli : టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ దర్శకధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్లో వారణాసి సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.. ఇటీవల గ్రాండ్ ఈవెంట్ చేసి ఈ మూవీ టైటిల్ ను అనౌన్స్ చేశారు.. అందరు ఊహించిన దానికంటే మహేష్ బాబు లుక్ ఓ రేంజ్ లో ఉందనే టాక్ ప్రస్తుతం వినిపిస్తుంది. అంతేకాదు ఈ టైటిల్ అనౌన్స్మెంట్ తర్వాత ఒకవైపు ప్రశంసలు కురిపిస్తున్న… మరో వైపు విమర్శలు కూడా ఎదురవుతున్నాయి.. గతంలో రాజమౌళి చేసిన కొన్ని వ్యాఖ్యలు వైరల్ అవ్వడంతో కొందరు శ్రీరాముడి అభిమానులు ఆయన వ్యాఖ్యలపై తీవ్రంగా ఖండిస్తున్నారు.. అంతేకాదు సోషల్ మీడియా వేదికగా ఆయన పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా రాజమౌళి పై కేసు నమోదు అయ్యిందని తెలుస్తుంది. దర్శకుడుఎస్ఎస్ రాజమౌళి పై పోలీసులకు ఫిర్యాదు చేశారు రాష్ట్రీయ వానరసేన సంఘం.. రీసెంట్ గా జరిగిన వారణాసి చిత్రం కార్యక్రమంలో హనుమంతుడిపై రాజమౌళి చేసిన వ్యాఖ్యలు హిందువుల మనోభావాలు దెబ్బ తీసే విధంగా ఉన్నాయని ఆరోపిస్తూ సరూర్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాజమౌళిపై కేసు నమోదు చేసి భవిష్యత్తులో ఎవరూ హిందూ దేవుళ్లపై అనుచిత వ్యాఖ్యలు చేయకుండా ఉండేలాగా చర్యలు తీసుకోవాలని పోలీసులను రాష్ట్రీయ వానరసేన సంఘం సభ్యులు కోరారు. ప్రస్తుతం ఇది ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.. మరి ఈ కేసు పై రాజమౌళి ఎలా స్పందిస్తారో చూడాలి..

రాజమౌళి పై హిందూ సంఘాలు ఆగ్రహం.. 

రాజమౌళి ప్రస్తుతం మహేష్ బాబు తో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.. ఈ మూవీ టైటిల్ అనౌన్స్ మెంట్ కార్యక్రమంను ఓ రేంజ్ లో చేశారు. ప్రీరిలీజ్ ఈవెంట్ లాగే ఉండటంతో ఆ ఈవెంట్ పై ప్రశంసలు దక్కాయి. ఇందులో టైటిల్ అనౌన్స్మెంట్ అనంతరం రాజమౌళి మాట్లాడారు. ఆయన వారణాసి మూవీ స్టోరీ గురించి మాట్లాడుతూ.. హనుమంతుడి పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయని.. రాష్ట్రీయ వానర సేన సంఘం సభ్యులు రాజమౌళి పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం ఈ కేసు ఇండస్ట్రీలో పెద్ద దుమారం రేపుతుంది. దేవుడి పై సినిమాలు చేస్తూ ఇలాంటి వ్యాఖ్యలు చెయ్యడం ఏంటి అంటూ హిందువులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో సరూర్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాజమౌళిపై కేసు నమోదు చేసి భవిష్యత్తులో ఎవరూ హిందూ దేవుళ్లపై అనుచిత వ్యాఖ్యలు చేయకుండా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.. పోలీసులు విచారణ జరిపే పనిలో ఉన్నారు.

రాజమౌళి అసలు ఏమన్నారంటే..? 

వారణాసి ఈవెంట్ లో మాట్లాడిన ఆయన హనుమాన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు.. తనకు దేవుడిపై నమ్మకం లేదని.. మా నాన్న నా దగ్గరకు వచ్చి హనుమంతుడు వెనకుండి నడిపిస్తాడని అంటున్నాడు.. ఇలా జరిగిన వెంటనే నాకు కోపం వచ్చింది. నా భార్యకు హనుమాన్ అంటే చాలా ఇష్టం.. ఆయనను తన స్నేహితుడిగా భావిస్తుంది. అదే నాకు కోపం తెప్పిస్తుంది. ఇలానేన ఆయన చేసేది అనిపించింది అంటూ కామెంట్స్‌ చేశాడు. ఇక రాజమౌళి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో వివాదంగా మారింది. హిందువులు మా మనోభావాలు దెబ్బతిసేలా ఉన్నాయని ఫిర్యాదు చేశారు. ఈ వివాదం పై రాజమౌళి ఎలా రియాక్ట్ అవుతారో అన్నది ఆసక్తిగా మారింది.. వారణాసి సినిమా విషయానికొస్తే 2027లో థియేటర్లలోకి రాబోతుందని అనౌన్స్ చేశారు.. అంటే ఈ సినిమా కోసం మరో రెండేళ్లు వెయిట్ చేయాల్సిందే…

 

Related News

పెద్ది’ మూవీ రివ్యూ: రామ్ చరణ్ ఊరమాస్ జాతర.. బుచ్చిబాబు హిట్ కొట్టాడా?

పెద్ది ఓటీటీ లాక్….అప్పుడే డిజిటల్ స్ట్రీమింగ్ పై క్లారిటీ వచ్చేసిందిగా!

ప్రభాస్ ‘స్పిరిట్’ లొకేషన్ సెల్ఫీ లీక్.. లుక్ చూస్తే పూనకాలే!

బన్నీ-లోకేష్ కనగారాజ్ సినిమా క్యాన్సిల్ అయిందా? …. అసలు నిజం తెలిస్తే షాకవ్వాల్సిందే!

చరణ్ ‘పెద్ది’ బాక్సాఫీస్ బ్యాటింగ్ స్టార్ట్.. సమంత, వరుణ్ తేజ్ రివ్యూస్ వైరల్.. ‘మెగా 158’ టీమ్ స్పెషల్ విష్

పెద్ది’ రిలీజ్ వేళ రచ్చ.. రామ్ చరణ్ విగ్రహంపై దారుణంగా ట్రోల్స్, క్షమాపణలు చెప్పిన ఫ్యాన్స్!

ఇది కదా క్యారెక్టర్ డెడికేషన్ అంటే! ‘పెద్ది’ గెటప్‌లో రోడ్లపై తిరిగిన జగ్గూభాయ్..

షూటింగ్ సెట్‌లో భారీ పేలుడు.. ఎస్‌జే సూర్య డ్రీమ్ ప్రాజెక్ట్‌లో ఘోర విషాదం!

Big Stories

×