Child Actor Tylor Chase: సినీ ఇండస్ట్రీ అంటేనే రంగుల ప్రపంచం. ఈ పరిశ్రమలోని తారల జీవితాలు ఎంత విలాసవంతంగా ఉంటాయో తెలిసిందే. కానీ, అదంత వారి చేతిలో అవకాశాలు ఉన్నంత వరకే. ఈ రంగుల ప్రపంచం పైకి మాత్రమే మెరిస్తుందని, దానిక వెనుక ఎన్నో కన్నీటి గాథలు ఉన్నాయని ఇప్పటికే ఎంతోమంది నటీనటులు రుజువు చేశారు. ఒకప్పుడు వెండితెరపై ఓ వెలుగు వెలిగిన నటులేందరో చివరికి రోడ్డున పడ్డ సంఘటనలు చాలానే చూశాం. పావలా శ్యామలా, నటి పాకిజా ఇలా ఎంతోమంది క్యారెక్టర్ ఆర్టిస్టులు అవకాశాలు లేక రోడ్డునపడ్డారు. పూట గడవడమే కష్టంగా ఉందంటూ సాయం కోసం ఎదురుచూస్తున్నారు.
ఆ మధ్య విక్రమార్కుడు చైల్డ్ ఆర్టిస్టు కూడా అనాథలా రోడ్డెక్కాడు. మందుకు బానిసై అనారోగ్య బారిన పడిన సంఘటన బయటకు వచ్చింది. అయితే ఇప్పడు మరో చైల్డ్ ఆర్టిస్టు రోడ్డుపై అడుక్కుంటున్న సంఘటన వెలుగు చూసింది. అయితే ఇప్పటి ఇండియన్స్ యాక్ట్రస్ని మాత్రం ఇలాంటి దీన స్థితిలో చూశాం. ఇప్పుడు హాలీవుడ్ నటుడు కూడా రోడ్డునపడటం వరల్డ్ వైడ్‌గా హాట్ టాపిక్ అయ్యింది. అతడ మరెవరో కాదు పిల్లల కామెడీషో నికెలోడియన్ ఫేం టైలర్ చేజ్. కార్టూన్లతో పాపులరైన ఈ కామెడీ షోలో టైలర్ చేజ్ చైల్డ్ ఆర్టిస్టుగా నటించి అలరించాడు.ఈ సిరీస్తో హాలీవుడ్లో అతడు విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న టైలర్ చేజ్ వయసు ప్రస్తుతం 36 ఏళ్లు.
కొంతకాలంగా మాయమైన అతడు తాజాగా కాలిఫోర్నియా వీధుల్లో నివస్తున్నట్టు కనిపించడంతో ఆయన అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకేంతో సుపరిచితమైన ఈ బాలనటుడు దీనస్థితికి ఆందోళన చెందుతున్నారు. 2004-2007 మధ్య నెడ్ డిక్లాసిఫైడ్ స్కూల్ సర్వైవల్ గైడ్‌లో మార్టిన్ క్వెర్లీ పాత్ర పోషించాడు చేజ్ ఇటీవల లాస్ ఏంజిల్స్‌లోని రివర్‌సైడ్‌లోని వీధుల్లో అడుక్కంటూ కనిపించాడు. సెప్టెంబర్‌లో కనిపించిన ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఈ వీడియోలో మాసిపోయిన షర్ట్ జీన్స్ ధరించి కనిపించాడు. జీన్స్ ప్యాంట్ ఎగదోసుకుంటూ, మతిస్థిమితం కోల్పోయి ఉన్నాడు. ఇలాంటి ధీనస్థితిలో అతడిని చూసి అభిమానులు వాపోతున్నారు.
వీడియో తీసిన వ్యక్తి అతని గురించి ప్రస్తావించినపుడు తాను నికెలోడియన్ బాల నటుడిని అని చేజ్ బదులిచ్చాడు. ఈ వీడియో వైరల్ కావడంతో చేజ్ పేరు మీద GoFundMe పేజీని ఏర్పాటు చేసి 1,200 డాలర్లకు పైగా నిధులను సేకరించారు. అయితే ఈ విరాళాలను చేజ్ తల్లి నిరాకరించారు. విరాళాల సేకరణను నిలిపివేయాలని కోరారు. టైలర్‌కు డబ్బు కాదు వైద్య సహాయం అవసరమని ఆమె స్పష్టం చేశారు. ఎన్నోసార్లు చాలా ఫోన్లు కొనిచ్చా. కానీ ఒకటి, రెండు రోజుల్లో వాటిని పోగొట్టుకుంటాడు. వైద్య ఖర్చుల కోసం మనీ మేనేజ్ చేయడం అతనికి తెలియదంటూ వివరించారు. ఈ సందర్భంగా గోఫండ్‌మీ ద్వారా విరాళాల సేకరణను అభినందించారు. కానీ నిజానికి ఈ డబ్బుతో లాభం లేదన్నారు.
🇺🇸 FROM CHILD STAR TO HOMELESS IN CALIFORNIA – THE TYLER CHASE STORY
Tyler Chase, who played Martin on Nickelodeon’s Ned’s Declassified School Survival Guide, was recently spotted homeless in California.
In a viral street clip, he calmly explains he was on Nickelodeon and even… pic.twitter.com/ArPzugXqA0
— Mario Nawfal (@MarioNawfal) December 21, 2025