E-Paper
Advertisement

The Raja Saab: 500కోట్ల రాజా షాబ్ కన్నా 2కోట్ల సినిమా మేలు.. ఇంత తప్పు ఎలా చేశారు..!

The Raja Saab: 500కోట్ల రాజా షాబ్ కన్నా 2కోట్ల సినిమా మేలు.. ఇంత తప్పు ఎలా చేశారు..!
Advertisement

The Raja Saab: సంక్రాంతి 2026 సినిమాల రేసులో భారీ అంచనాలతో థియేటర్లలోకి వచ్చిన చిత్రం ది రాజా సాబ్. జనవరి 9, 2026న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదలైంది. ఈ చిత్రంలో ప్రభాస్.. ప్రధాన పాత్రలో నటించగా.. ప్రముఖ దర్శకుడు మారుతీ దర్శకత్వం వహించారు. విడుదలకు ముందు నుంచే సినిమా మీద భారీ బజ్ ఏర్పడింది. ప్రీ రిలీజ్ ఈవెంట్లు, ట్రైలర్లు.. పాటలతో ప్రేక్షకుల్లో ఆసక్తి బాగా పెరిగింది.

సినిమా విడుదలైన మొదటి రోజే ప్రపంచవ్యాప్తంగా రూ.112 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. మిక్స్‌డ్ టాక్ వచ్చినా కూడా కలెక్షన్ల పరంగా ఈ చిత్రం బలమైన ఓపెనింగ్ ఇచ్చింది. ఇది ప్రభాస్ మార్కెట్ స్ట్రెంగ్త్‌ను.. మరోసారి నిరూపించింది. ఫ్యాన్స్ పెద్ద ఎత్తున థియేటర్లకు వచ్చి సినిమాను చూసారు.

Advertisement

అయితే..సినిమా రిలీజ్ అయిన కొద్ది గంటల్లోనే ప్రేక్షకులు ఒక ముఖ్యమైన తప్పును గమనించారు. అది ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌కు సంబంధించిన సమస్య. కొన్ని థియేటర్లలో సబ్‌టైటిల్స్ సరిగ్గా ప్రదర్శించబడలేదు. సబ్‌టైటిల్స్‌పై టైమ్‌కోడ్‌లు కనిపించడం, ఒకదానిపై ఒకటి అక్షరాలు పడటం.. స్క్రీన్‌లో భాగం కవర్ కావడం వంటి సమస్యలు ఎదురయ్యాయని ప్రేక్షకులు చెప్పారు.

ఈ సమస్య ఒక్క థియేటర్‌కే పరిమితం కాకుండా..పలు ప్రాంతాల్లో కనిపించిందని సమాచారం. ముఖ్యంగా నార్త్ ఇండియా.. ఓవర్సీస్ స్క్రీన్లలో ఈ సమస్య ఎక్కువగా ఉందని ప్రేక్షకులు తెలిపారు. సినిమా పలు భాషల్లో విడుదల కావడంతో సబ్‌టైటిల్స్ చాలా ముఖ్యమైన అంశం అవుతుంది. అందుకే ఈ తప్పు పెద్ద చర్చకు దారితీసింది.

Advertisement

చాలా మంది ప్రేక్షకులు సోషల్ మీడియాలో ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ ఈ విషయాన్ని మేకర్స్ దృష్టికి తీసుకువచ్చారు. “ఇంత పెద్ద సినిమా, ఇలాంటి చిన్న కానీ ఇబ్బందికరమైన తప్పు ఎలా జరిగింది?” అంటూ ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు ఇలా 500 కోట్లు పెట్టి తీసిన సినిమా కన్నా రెండు కోట్లు పెట్టి తీసిన సినిమాలకు కూడా ఇలాంటి టెక్నికల్ ఇష్యూ వచ్చిండదు అని అంటున్నారు.

ఇక సినిమా విషయానికి వస్తే..ఇది హారర్ ఫాంటసీ టచ్‌తో రూపొందింది. ప్రభాస్‌ను ఇప్పటివరకు చూడని కొత్త కోణంలో చూపించేందుకు దర్శకుడు మారుతి ప్రయత్నించారు. కథ, పాత్రలు, విజువల్స్ విషయంలో కొత్తదనం చూపించాలనే ఆలోచన కనిపిస్తుంది. అయితే కథనం నెమ్మదిగా సాగడం, కొన్ని సన్నివేశాలు ఆశించిన స్థాయిలో లేకపోవడం వల్ల మిక్స్‌డ్ రివ్యూస్ వచ్చాయి.

ఈ చిత్రంలో హీరోయిన్లుగా నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ నటించారు. ఇతర ముఖ్య పాత్రల్లో సంజయ్ దత్, బొమ్మన్ ఇరానీ కనిపించారు. సంగీతాన్ని తమన్.. అందించారు. పాటలు ముందే పాపులర్ కాగా, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకు బలం ఇచ్చింది. కొన్ని సన్నివేశాల్లో థమన్ మ్యూజిక్ ఎలివేషన్ ఇచ్చిందని ఫ్యాన్స్ చెబుతున్నారు. ఇక ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పై విశ్వప్రసాద్ నిర్మించారు. నిర్మాణ విలువలు బాగున్నాయని, విజువల్స్‌లో ఎక్కడా రాజీ పడలేదని చెప్పొచ్చు. భారీ సెట్లు, గ్రాఫిక్స్, లొకేషన్లు సినిమాకు మంచి ప్లస్ అయ్యాయి. కానీ కథ, కథనం అలానే మారుతి దర్శకత్వం.. ఈ చిత్రం లెంత్ ఈ సినిమాకి పెద్ద మైనస్ గా నిలిచాయి అనేది ప్రేక్షకుల వాదన.

ఇప్పుడు ప్రధానంగా చర్చ నడుస్తున్నది సబ్‌టైటిల్స్ సమస్యపై మేకర్స్ ఎలా స్పందిస్తారనే విషయం. ప్రేక్షకులు ఫిర్యాదు చేసిన తర్వాత మేకర్స్ వెంటనే చర్యలు తీసుకుంటారా? థియేటర్లకు అప్‌డేటెడ్ ఫైల్ పంపించి సమస్యను సరిచేస్తారా? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. గతంలో కూడా కొన్ని సినిమాల్లో ఇలాంటి చిన్న తప్పులు జరిగినప్పుడు మేకర్స్ త్వరగా రియాక్ట్ అయ్యారు.

సోషల్ మీడియా కాలంలో ప్రేక్షకుల ఫీడ్‌బ్యాక్ చాలా వేగంగా బయటకు వస్తోంది. అందుకే మేకర్స్ కూడా వెంటనే స్పందించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా పాన్ ఇండియా సినిమాలకు ఇలాంటి టెక్నికల్ ఇష్యూస్ చాలా కీలకం. ఒక చిన్న తప్పు కూడా సినిమా అనుభూతిని తగ్గిస్తుంది.

ALSO READ: Nandamuri Mokshagna: హీరోగా మోక్షజ్ఞ ఎంట్రీకి లైన్ క్లియర్.. ఫైనల్‌గా నందమూరి హీరో ఎలాంటి సినిమాతో రానున్నారంటే..!

Related News

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

కన్నీటి పర్యంతమవుతున్న ‘మహారాజ’ బ్యూటీ.. అసలేం జరిగిందంటే?

డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ వివాదం..ఫిలిం ఫెడరేషన్ అత్యవసర సమావేశం!

ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు చిత్రం ఏంటో తెలుసా?

నేషనల్ అవార్డ్స్ రేసులో ధనుష్ రికార్డ్… ‘కలాం’ బయోపిక్‌పై హైప్!

ఆ హీరోతో అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్?

Sharmiela mandre :చడీ చప్పుడు లేకుండా పెళ్లి చేసుకున్న అల్లరి నరేష్ హీరోయిన్.. వరుడు ఎవరంటే?

Big Stories

Advertisement
×