E-Paper
Advertisement

Kalyan Padala: కొత్త ప్రయాణం ప్రారంభం..గుడ్ న్యూస్ చెప్పిన బిగ్ బాస్ విన్నర్ కళ్యాణ్ పడాల..

Kalyan Padala: కొత్త ప్రయాణం ప్రారంభం..గుడ్ న్యూస్ చెప్పిన బిగ్ బాస్ విన్నర్ కళ్యాణ్ పడాల..
Advertisement

Kalyan Padala: కళ్యాణ్ పడాల పరిచయం అవసరం లేని పేరు. ఒక సాధారణ కుటుంబంలో జన్మించి దేశ సేవ కోసం ఇండియన్ ఆర్మీలో కొనసాగుతున్న ఈయన సినిమాలపై ఆసక్తితో ఇండస్ట్రీలోకి రావాలనే ప్రయత్నాలు చేశారు. అయితే బిగ్ బాస్ రియాలిటీ షో అందుకు వేదికగా మారింది. ఇలా బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 కార్యక్రమంలో కామన్ మ్యాన్ క్యాటగిరిలో భాగంగా కళ్యాణ్ ఎంపిక అవ్వడమే కాకుండా ఈ కార్యక్రమం చివరి వరకు కొనసాగుతూ విజేతగా బయటకు వచ్చిన సంగతి తెలిసిందే.

కొత్త ప్రయాణం..

ఇక బిగ్ బాస్ హౌస్ కళ్యాణ్ కొనసాగుతున్న సమయంలో ఆయనకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. ఇక బిగ్ బాస్(Bigg Boss 9) తర్వాత ఈయన కెరియర్ పై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టారని తెలుస్తోంది. ఇలా కెరియర్ పై దృష్టి సారించిన కళ్యాణ్ సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఈయన తాజాగా సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ షేర్ చేశారు. ఇందులో భాగంగా తన కొత్త ప్రయాణం మొదలైంది అంటూ తెలియచేయడంతో అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరి కళ్యాణ్ కొత్త ప్రయాణం ఏంటి అసలేం చేయబోతున్నారు అనే విషయానికి వస్తే..

యూట్యూబ్ ప్రయాణం ప్రారంభం..

Advertisement

బిగ్ బాస్ ద్వారా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న కళ్యాణ్ ప్రేక్షకులకు మరింత దగ్గర అయ్యే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఒక యూట్యూబ్ ఛానల్(Youtube Channel) ప్రారంభించాలని కోరుకున్నారు. అందుకు అనుగుణంగానే తన కొత్త యూట్యూబ్ ఛానల్ ప్రారంభించినట్లు తాజాగా ఇన్స్టాగ్రామ్ ద్వారా తెలియజేశారు. ఈ విషయాన్ని తెలియచేస్తూ.. “ఇది కేవలం ప్రారంభం మాత్రమే.. మీ అందరితో మరింత సన్నిహితంగా కనెక్ట్ అవ్వడం కోసం, నా నిజమైన వ్యక్తిత్వాన్ని, నేను నేర్చుకున్న విషయాలను, సరదా క్షణాలను, వీటన్నింటి మధ్య జరిగే ప్రతి విషయాన్ని మీతో పంచుకోవడం కోసం నేను నా అధికారిక యూట్యూబ్ ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నాను అంటూ కళ్యాణ్ తన యూట్యూబ్ ఛానల్ ప్రారంభం గురించి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

?igsh=MWhybXdlMHV5ejc0OQ==

Advertisement

ఇలా ఈయన యూట్యూబ్ ఛానల్ ద్వారా అభిమానులకు మరింత చేరువవుతున్న నేపథ్యంలో అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇలా యూట్యూబ్ ఛానల్ ద్వారా తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకోబోతున్నారని తెలుస్తోంది. ఇక ఇండస్ట్రీలో కొనసాగడం కోసం ఎంతో కష్టపడి బిగ్ బాస్ అవకాశాన్ని అందుకోవడమే కాకుండా, విజేతగా నిలిచిన కళ్యాణ్ పడాలకు తదుపరి ఇండస్ట్రీలో ఎలాంటి అవకాశాలు వస్తాయనేది తెలియాల్సి ఉంది. ఇక కళ్యాణ్ సైతం అదే దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టిన సంగతి తెలిసిందే.

Also Read: Big tv kissik talks: హీరోయిన్ కు లిప్ కిస్ ఇవ్వాలి.. కాబోయే భార్యకు కండీషన్లు పెట్టిన పృథ్వీ?

Related News

Bigg Boss 10 Telugu : బిగ్ బాస్ 10లోకి స్టార్ యాంకర్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Bigg Boss: విడాకులు ప్రకటించిన బిగ్ బాస్ విన్నర్ భార్య!

BiggBoss 10 : బిగ్ బాస్ లోకి క్రేజీ హీరోయిన్ ఎంట్రీ.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Ariana Glory : వామ్మో.. అరియనా నెలకు అన్ని లక్షలు సంపాదిస్తుందా..?

త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్న బిగ్ బాస్ బ్యూటీ.. వరుడు ఎవరంటే..?

Siri Hanumanth : యాంకర్ సిరి హనుమంత్ నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా..?

బిగ్ బాస్ ‘అగ్ని పరీక్ష 2’ డేట్ వచ్చేసింది.. షో పూర్తి వివరాలు ఇవే..

Bigg Boss : నటికి శాపంగా మారిన బిగ్ బాస్.. ఇప్పుడేం చేస్తుందంటే..?

Big Stories

Advertisement
×