E-Paper
Advertisement

YouTuber Komali: సూసైడ్ చేసుకుని యూట్యూబర్ కోమలి మృతి.. ఏం జరిగిందంటే?

YouTuber Komali: సూసైడ్ చేసుకుని యూట్యూబర్ కోమలి మృతి.. ఏం జరిగిందంటే?
Advertisement

YouTuber Komali: హైదరాబాద్‌లోని మణికొండ చిత్రపురి కాలనీలో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. గ్లామర్ ప్రపంచంలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవాలని కలలు కన్న యువ యూట్యూబర్ కోమలి (21), అర్ధాంతరంగా తన నూరేళ్ల జీవితాన్ని ముగించింది. ప్రేమ వ్యవహారంలో తలెత్తిన విభేదాలు, మానసిక వేదన ఈ దారుణ నిర్ణయానికి దారితీసినట్లు ప్రాథమిక సమాచారం ద్వారా తెలుస్తోంది. రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలోని చిత్రపురి కాలనీలో నివసించే కోమలి, సోమవారం మధ్యాహ్నం సమయంలో తన ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ఉరివేసుకుంది. కుటుంబ సభ్యులు గమనించి వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. అత్యవసర విభాగంలో చికిత్స పొందుతూ, పరిస్థితి విషమించడంతో మంగళవారం ఆమె మృతి చెందింది. ఈ వార్త తెలిసిన వెంటనే చిత్రపురి కాలనీలో సోషల్ మీడియా సర్కిల్స్‌లో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Read also-Brahmamudi Serial Today February 25th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: బాంబ్ బ్లాస్ట్ లో చనిపోయిన దుగ్గిరాల ఫ్యామిలీ  

ప్రేమ.. విభేదాలు.. మానసిక సంఘర్షణ

Advertisement

కోమలి ఆత్మహత్యకు ప్రధాన కారణం మరో యూట్యూబర్ అఖిల్ రెడ్డితో ఉన్న ప్రేమ వ్యవహారమేనని స్థానికులు, బంధువులు ఆరోపిస్తున్నారు. గత మూడేళ్లుగా కోమలి, అఖిల్ రెడ్డి ప్రేమలో ఉన్నారు. ఇద్దరూ యూట్యూబ్ రంగంలో ఉండటంతో వారి మధ్య పరిచయం పెరిగి ప్రేమగా మారింది. గత ఏడాది కాలంగా వీరిద్దరి మధ్య తీవ్ర మనస్పర్థలు తలెత్తాయి. తరచూ గొడవలు జరగడంతో, గతేడాది వీరు విడిపోయారు. ప్రేమించిన వ్యక్తి దూరమవ్వడాన్ని కోమలి తట్టుకోలేకపోయింది. అఖిల్‌తో విడిపోయినప్పటి నుండి ఆమె తీవ్రమైన డిప్రెషన్‌లోకి వెళ్లినట్లు తెలుస్తోంది. గతంలో కూడా ఆమె ఒకసారి ఆత్మహత్యాయత్నం చేసిందని, అప్పట్లో కుటుంబ సభ్యులు ఆమెను కాపాడుకున్నారని సమాచారం. కోమలి మృతిపై రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పోలీసులు ఆమె మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఆత్మహత్యకు ముందు ఆమె ఎవరితో మాట్లాడింది? చివరిగా పంపిన మెసేజ్‌లు ఏమిటి? అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. అఖిల్ రెడ్డి పాత్రపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. వేధింపులేమైనా ఉన్నాయా అనే విషయాన్ని నిర్ధారించేందుకు ఆమె సోషల్ మీడియా ఖాతాలను విశ్లేషిస్తున్నారు.

Related News

వారికి అభినందనలు తెలిపిన ఏపీ డిప్యూటీ సీఎం!

వారణాసి షూటింగ్ పై క్రేజీ అప్డేట్.. జక్కన్న ఏం ప్లాన్ చేస్తున్నావయ్యా?

ఎమోషనల్ గా ‘చెన్నై లవ్ స్టోరీ’ ట్రైలర్.. కిరణ్ ఖాతాలో మరో హిట్?

ఫిగర్ బాలేదని టార్చర్.. 40 ఏళ్లొచ్చాకే ఆ నరకం నుండి బయటపడ్డానంటున్న తారక్ హీరోయిన్

యాంకర్ సుమ హీరోయిన్‌గా నటించిన ఏకైక సినిమా ఏంటో తెలుసా ?

‘టాక్సిక్’ ట్రైలర్ డేట్ ఫిక్స్..ఇదైనా ఖాయమా యష్?

72వ జాతీయ అవార్డుల్లో సత్తా చాటిన తెలుగు సినిమాలు.. ఉత్తమ చిత్రం ఏదంటే?

విక్రమ్ 1 సక్సెస్.. చిరు ఫిదా: ప్రైవేట్ రాకెట్ ప్రయోగంపై మెగాస్టార్ క్రేజీ రియాక్షన్!

Big Stories

Advertisement
×