E-Paper
Advertisement

Podarillu Today Episode : అమ్మాయిలతో చక్రీ పులిహోర..తాయారు దెబ్బకు మహా షాక్.. కేశవ, శైలజ ఫైట్..

Podarillu Today Episode : అమ్మాయిలతో చక్రీ పులిహోర..తాయారు దెబ్బకు మహా షాక్.. కేశవ, శైలజ ఫైట్..
Advertisement

Podarillu Today Episode February 25th: నిన్నటి ఎపిసోడ్ లో.. కన్నా ని తీసుకొని బయటకు వెళ్ళిపోతుంది మహాలక్ష్మి.. ఏమైంది వదిన ఎందుకు బాధపడుతున్నావ్ అని నేను ఏమైనా అన్నానా అని కన్న అడుగుతాడు.. నువ్వు శాశ్వతంగా ఇక్కడే ఉంచాలని ప్లాన్ చేశారు అని బాధపడుతుంది మహాలక్ష్మి.. తన సర్టిఫికెట్లు కాల్చేసిన విషయాన్ని కన్నాతో చెప్పి ఎమోషనల్ అవుతుంది.. మహాలక్ష్మి ఏడుస్తూ ఉంటే కన్నా కూడా బాధపడిపోతూ ఉంటాడు. మహాలక్ష్మి ఎలాగైనా సరే డైవర్ట్ చేయాలని కన్నా నన్ను చంపాలని చూడొద్దు నాకు ఆకలేస్తుంది వెళ్లి తిందాం పద అనేసి అడుగుతాడు..

అప్పుడే చక్రి కన్నాకి ఫోన్ చేస్తాడు.. మహాలక్ష్మి ఇంటికి వస్తుందని మాధవతో చెప్పగానే ఇద్దరు చాలా సంతోషంగా ఫీల్ అవుతారు.. ఇక తర్వాత వాళ్ళు ఎప్పుడు ఇంటికి వస్తారా అని వెయిట్ చేస్తుంటారు.. మహాలక్ష్మి బాధ పడుతుందని కేశవ సీరియస్ అవుతాడు.. నారాయణ మాత్రం తన లారీ ముగ్గుతో అందరిని నవ్విస్తాడు అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది..

Advertisement

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. నారాయణ బీడీ తాగుతూ మహాలక్ష్మి వేసిన ముగ్గు పై ఆ బీడీని పడేస్తాడు.. అది చూస్తే కోడలు పిల్ల నన్ను ఇంట్లో కూడా ఉండనివ్వదు అని భయపడిపోతాడు.. ఎలాగైనా సరే ఈ ముగ్గుని వేయాల్సిందే అని నారాయణ ఫిక్స్ అవుతాడు. లారీ ముగ్గురిని చూసి అందరూ ఒక్కసారిగా నవ్వుకుంటారు.. ఆ తర్వాత మహాలక్ష్మి టీ పెట్టడం చూసి మిగతా వాళ్ళందరూ షాక్ అవుతారు మొత్తానికి మహాలక్ష్మి పెట్టిన టీ బావుండడంతో అందరూ తాగుతారు.. ఇక చక్రి మహాలక్ష్మి కోసం జాబును వెతికే ప్రయత్నం చేస్తాడు. తన ఫ్రెండుని బ్రతిమలాడి మరి మహాలక్ష్మికి జాబ్ ఇప్పించాలని ఎన్నో మాటలను చెప్తాడు.. జాబు ఇప్పుడు కష్టం రాని తన ఫ్రెండ్ ఎంత చెప్పినా సరే.. చక్రి చేతులు పట్టుకొని బ్రతిమలాడుతాడు. మొత్తానికి తన ఫ్రెండ్ లవ్ స్టోరీ ని గుర్తు చేసి అతని ఎమోషనల్ గా కట్టిపడేస్తాడు..

మొత్తానికి చక్రీకి తన ఫ్రెండు హెల్ప్ చేయడానికి ఒప్పుకుంటాడు.. మహాలక్ష్మికి ఉద్యోగం ఇవ్వడానికి అతను ఒప్పేసుకుంటాడు. మహా కి ఉద్యోగం వచ్చింది అని చెప్తే చాలా సంతోషంగా ఫీల్ అవుతుంది. అంత పాటుగా తనకు ఒక గిఫ్ట్ కూడా ఇవ్వాలని అనుకుంటాడు.. అయితే ఒక షాపుకు వెళ్లి తనకి నైట్ వేసుకోవడానికి నైటీ తీసుకురావాలని చక్రి అనుకుంటాడు.. అక్కడ షాప్ కి వెళ్ళగానే సేల్స్ గర్ల్స్ పులిహార కలుపుతాడు చక్రి. అయితే మీ ఆవిడకి ఏ సైజులో నైటీలు కావాలి అని అక్కడున్న ఆవిడ అడుగుతుంది. మీకు ఏ సైజు కావాలి అని అడిగితే చక్రీ అక్కడ ఉన్న ఒక ఆవిడని చూసి ఆవిడ సైజు కావాల్సి వస్తుంది అని అంటాడు.. అక్కడున్న ఆవిడతో కూడా పులిహార కలుపుతూ ఉంటాడు చక్రి.. ఏవండీ మా ఆవిడకి సర్ప్రైజ్ ఇవ్వాలని అనుకుంటున్నాను మీరు ఒకసారి ఇక్కడికి వచ్చి మీ సైజులో ఉన్న నైటీని సెలెక్ట్ చేసి ఇస్తారా అని అంటాడు..

Advertisement

అప్పుడే షాప్ లోకి వచ్చిన కేశవ చక్రీ చేస్తున్న పనికి షాక్ అవుతాడు.. మొత్తానికి ఆ నైటీ తీసుకున్న తర్వాత బయటకు వచ్చిన తర్వాత.. ఏంట్రా పెళ్లయిన తర్వాత కూడా నీ బుద్ధి మారదా అని గడ్డి పెడతాడు.. నేనేం చేశాను రా అని అడిగితే ఏంటి ఏం చేస్తున్నావ్ లోపల కొంచమైనా ఉందా నీకు అని అంటాడు. నేను సమాజ సేవ చేస్తున్నాను రా ఏమి చేయట్లేదు అని అనగానే.. ఏంటి ఇది సమాజసేవన అని కేశవ అడుగుతాడు.. ఇదంతా కష్టపడుతూ ఉన్న వాళ్ళకి కాస్త రిలాక్స్ అయ్యేలా చేశాను అంతే అందులో తప్పేముంది అని చక్రి అంటాడు.. నేను బైక్ డెలివరీ ఇవ్వడానికి వెళ్తున్నాను అని చక్రి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు..

శైలజ బస్టాండ్ లో వెయిట్ చేస్తూ ఉండగా అక్కడికి వచ్చినా తన ఫ్రెండు స్కూటీలో రావడం చూసి చాలా బాగుంది. ఎవరిది స్కూటీ అయినా నీకు డ్రైవింగ్ రాదు కదా ఎలా వేసుకుని వచ్చావు అని అడుగుతుంది. అటు మహాలక్ష్మి కన్నా ఇద్దరూ గుడికి వెళ్లి వస్తుంటారు. మధ్యలో గాయత్రి కనిపిస్తుంది కన్నా గురించి అడిగితే గాయత్రి చెప్పబోతుంటే.. నీకు దండం పెడతానే నాకు గురించి ఏమీ చెప్పద్దు అని అంటాడు కన్నా.. బావతో పెళ్లయితే బాగుంటుంది కదా అని గాయత్రి కూడా ఆలోచిస్తూ ఉంటుంది.. అక్కడున్న ఒక షాప్ కెళ్ళి అందరికీ చాక్లెట్స్ తీసుకొచ్చి ఇస్తుంది. తాయారు మాత్రం తన భర్త గురించి ఒక ఆవిడ అనడంతో ఆమెపై రెచ్చిపోయి బిందెతో బాదుతుంది.. ఆ సీన్ చూసిన గాయత్రి మా అమ్మ మీతో చూస్తే నన్ను కూడా కొడుతుందని అక్కడ నుంచి పారిపోతుంది..

ఇక శైలజ బైక్ డ్రై చేస్తానని తీసుకొని వెళుతుంది.. తనకు డ్రైవింగ్ రాకపోవడంతో మెల్లగా నేర్చుకుంటాను అని తన ఫ్రెండుకి నచ్చచెప్పి మరి బండిని తీస్తుంది.. కేశవ తన ఫ్రెండ్ కి బైక్ డెలివరీ ఇవ్వడానికి వస్తాడు.. శైలజ నేరుగా వచ్చి కేశవ బండిని గుద్దుతుంది.. ఆ గుద్దింది ఎవరో చూసి నాకు కేశవ నువ్వు కచ్చితంగా దీనికి డబ్బులు చెల్లించాల్సిందే మొత్తం 20,000 ఇవ్వాలి లేదా పోలీస్ స్టేషన్ కి తీసుకొని వెళ్తాను అని అంటాడు. అప్పుడే ప్లేట్ మార్చిన శైలజ తనని ఏదో చేస్తున్నాడు అని కేకలు పెడుతూ గోల చేస్తుంది.. అక్కడున్న వాళ్ళు అది నిజమే అనుకొని నమ్ముతారు.. అందరూ కలిసి కేశవదే తప్పు అంటారు.. మొత్తానికి కేశవ కి మరోసారి అమ్మాయి వల్ల పెద్ద దెబ్బే పడుతుంది..

Also Read :రవి కాపురంలో చిచ్చుపెట్టిన నీతూ.. సంజుకు మీనా దిమ్మతిరిగే షాక్.. ఇది కదా అసలు ట్విస్ట్..

ఇక ఇంటికి వచ్చిన మహాలక్ష్మికి తాను తెచ్చిన గిఫ్ట్ ఇస్తాడు చక్రి.. మీకు ఇవాళ రెండు గుడ్ న్యూస్ లు అని చెప్పగానే మహా రూమ్ దొరికేసిందా అయితే నేను వెళ్ళిపోవచ్చా అని సంతోషంగా అడుగుతుంది. మీకు జాబ్ వచ్చేసింది మా అన్నయ్య వల్లే మీకు జాబ్ వచ్చిందని చెప్పగానే మహాలక్ష్మి ఎగిరి గంతేస్తుంది. పెద్దికి ఏదో ఒక గిఫ్ట్ ఇవ్వాలని అనుకుంటుంది. తర్వాత నైటీ నేను వేసుకోను అని చెప్పగానే చక్రి ఫీల్ అయిపోతాడు. ఇక్కడ రాత్రి అవగానే కేశవ చాలా కోపంగా వస్తాడు. అది చూసిన కన్నా ఏంటి అన్నయ్య కోపంగా ఉన్నావు అని అనగానే దారిలో ఒక చింపాంజీ కనిపించింది అని జరిగిన విషయాన్ని కన్నాతో చెప్తాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Related News

Podarillu Mahalakshmi : ‘పొదరిల్లు’ సీరియల్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్.. మహా అవుట్…

Nindu Noorella Saavasam Serial Today Episode July 20th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: హోమం చూసి భయపడిన ప్రచండ – కోపంతో రగిలిపోయిన మనోహరి  

Podarillu Today Episode : చక్రికీ మైండ్ బ్లాక్.. భయంకరమైన నిజాన్ని తెలుసుకున్న మహా.. శైలు ఎంట్రీ..

Karthika Deepam 2 Serial Today Episode July 20th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పోటీలో గెలిపించిన దీప – ఎమోషనల్ అయిన శివనారాయణ   

Illu Illalu Pillalu Today Episodes: దిమ్మతిరిగే ట్విస్ట్ ఇచ్చిన భద్ర.. ధీరజ్ కు అనుమానం.. వల్లి ప్లాన్ ఇదా..?

Intinti Ramayanam Today Episode: అవనికి అక్షయ్ షాక్.. పల్లవికి అక్షయ్ వార్నింగ్… పల్లవి రచ్చ రచ్చ..

Brahmamudi Serial Today Episode July 20th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: ఇందు ధర్నా సక్సెస్‌ – అత్తారింటికి బయలుదేరిన రాజు  

Telugu TV Serials: ఈ వారం సీరియల్స్ టీఆర్పీ రేటింగ్.. శ్రీవల్లి సీరియల్ కు షాక్..!

Big Stories

Advertisement
×